ETV Bharat / state

కరోనాతో అప్రమత్తంగా ఉండాలని ఆటోలకు పోస్టర్లు

author img

By

Published : Oct 24, 2020, 8:11 PM IST

పండగల నేపథ్యంలో కరోనా జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కర్నూలు రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. శానిటైజర్​లను విరివిగా వాడేలా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆటోలకు పోస్టర్లు అంటించారు.

posters-for-autos
కరోనాతో అప్రమత్తంగా ఉండాలని ఆటోలకు పోస్టర్లు

కరోనా కేసులు తగ్గుతున్నా ప్రజలందరూ అప్రమత్తంగానే ఉండాలని కర్నూలు జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ వివేకాంనదరెడ్డి అన్నారు. పండుగలు, తుంగభద్ర పుష్కరాల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ప్రజలు శానిటైజర్​లను విరివిగా వాడేలా అవగాహన కల్పించాలని ఆటోలకు పోస్టర్లు అంటించారు. డ్రైవర్లు ప్రతి 15 రోజులకు ఒకసారి కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని తెలిపారు.

ఇదీ చదవండి: పారిశుద్ధ్య నిర్వహణ లోపం.. దుర్గంధభరితంగా వ్యవసాయ మార్కెట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.