ETV Bharat / state

Head Constable Suicide in Kurnool: తుపాకీతో కాల్చుకుని హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. కర్నూలులో ఘటన..

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 8, 2023, 11:28 AM IST

Updated : Sep 8, 2023, 12:41 PM IST

Head Constable Committed Suicide by Shooting Gun: కర్నూలులో హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.. ఈ విషయంపై పోలీసుల ఆరా తీస్తున్నారు.

constable_suicide
constable_suicide

Head Constable Suicide in Kurnool: తుపాకీతో కాల్చుకుని హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య.. కర్నూలులో ఘటన..

Head Constable Committed Suicide by Shooting Gun: కర్నూలులో హెడ్‌కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే హెడ్‌కానిస్టేబుల్‌ సత్యనారాయణ లోకాయుక్త కోర్టులో విధులు నిర్వహిస్తున్నారు. అయితే సత్యనారాయణ బాత్‌రూమ్‌కి వెళ్లి తన తుపాకితో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని కర్నూలు ఆసుపత్రికి తరలించారు. ఆ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Police Suicides in AP: ఇటీవల రాష్ట్రంలో పోలీసుల వరుస ఆత్మహత్య ఘటనలు తీవ్ర సంచలనంగా మారుతున్నాయి. కుటుంబ కలహాల నేపధ్యంలో కొన్ని జరగగా.. పని ఒత్తిడి, అధికారుల ఒత్తిడి తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

High Tension in Lokesh Padayatra: లోకేశ్ పాదయాత్రలో వైసీపీ శ్రేణుల రాళ్లదాడి.. కానిస్టేబుల్​తో సహా పలువురికి గాయాలు..

Another Constable Committed Suicide in Kurnool District: ఈ నెల 6వ తేదీ ఇదే జిల్లాలోని ఆదోని పట్టణంలోని కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సందీప్‌ కుమార్‌ (32) బుధవారం ఉదయం ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ శివనారాయణ స్వామి, సీఐలు శ్రీనివాస్ నాయక్‌, విక్రమ సింహ సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులను విచారించారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు.

YSRCP Leaders Attack on SEB Constable : పోలీస్ స్టేషన్​పై వైసీపీ నేతల దండయాత్ర.. మహిళా కానిస్టేబుల్​పై విచక్షణారహితంగా దాడి..

Tadipatri Town CI Ananda Rao Committed Suicide: ఇటీవలే అధికారుల ఒత్తిడి తాళలేక అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ సీఐ ఆనందరావు (52) ఆత్మహత్య చేసుకున్నారు. తెల్లవారుజామున ఇంట్లోనే ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గత 9 నెలలుగా ఆనందరావు తాడిపత్రి సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని సీపీఐ కాలనీలోని అద్దె ఇంట్లో ఆయన కుటుంబం నివాసముంటోంది. గత కొన్ని రోజులుగా భార్య అనురాధతో సీఐకు గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కుటుంబసభ్యులు నిద్రపోయిన తర్వాత ఇంట్లోనే సీఐ ఉరివేసుకున్నారు.

Constable Murder Case: ప్రియుడి కోసం భర్తను హతమార్చింది.. అనుమానం రాకుండా.. లక్షన్నర పెట్టి..

Difficulty With Work Pressure for Three Months: గత కొంతకాలంగా పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు పడేవారని కుటుంబసభ్యులు తెలిపారు. సీఐ ఆనందరావు గత ఏడాది సెప్టెంబర్‌లో కడప నుంచి తాడిపత్రికి బదిలీపై వచ్చారు. ఆయన స్వగ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి. సీఐకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Last Updated : Sep 8, 2023, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.