High Tension in Lokesh Padayatra: లోకేశ్ పాదయాత్రలో వైసీపీ శ్రేణుల రాళ్లదాడి.. కానిస్టేబుల్‌తో సహా పలువురికి గాయాలు..
Updated: Sep 6, 2023, 1:26 PM |
Published: Sep 6, 2023, 1:26 PM
Published: Sep 6, 2023, 1:26 PM
Follow Us 

High Tension in Lokesh Padayatra: నారా లోకేశ్ యవగళం పాదయాత్రలో వైసీపీ నేతల కవ్వింపుచర్యలు ఆగడం లేదు. అధికార పార్టీ ఆగడాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. సాఫీగా సాగుతున్న యువగళం పాదయాత్రకు(Yuva Galam Padayatra) అడ్డంకులు సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించడంతో.. పలుచోట్ల ఉద్రిక్త పరిస్తితులు నెలకొంటున్నాయి. తాజాగా.. పశ్చిమగోదావరి జల్లా భీమవరం శివారు గునుపూడిలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.

1/ 13
Nara Lokesh Yuvagalam Padayatra: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శివారులోని గునుపూడిలో ప్రశాంతంగా సాగుతున్న నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో.. వైసీపీ శ్రేణులు రాళ్ల వర్షం కురిపించాయి. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. లోకేశ్ గునుపూడి రాకముందే వైసీపీ కవ్వింపు చర్యలకు దిగింది. గునుపూడి వంతెన వద్ద వైసీపీ జెండాలు ఊపుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అడ్డుకోబోయిన యువగళం కార్యకర్తలను వైసీపీ శ్రేణులు చితకబాదాయి. ఈ క్రమంలో వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడిలో కానిస్టేబుల్ శ్రీనివాస్ తలకు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేస్తున్నా పోలీసులు నిలువరించే ప్రయత్నం చేయలేదని టీడీపీ నాయకులు ఆరోపించారు. పోలీసులు ముందస్తుగా వైసీపీ కార్యకర్తలను కట్టడి చేయకపోవడం వల్లే రాళ్లదాడి జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కాన్వాయ్‌లోని పలు వాహనాలను కూడా వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పాదయాత్ర జరిగే సమీప ప్రాంతంలోని భవనాలపైకి ఎక్కి మరీ వైసీపీ శ్రేణులు రాళ్లు విసిరాయి. దీంతో పలువురు యువగళం కార్యకర్తలకు గాయాలయ్యాయి. పాదయాత్రలో రాళ్ల దాడిపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Loading...
Loading...
Loading...