ETV Bharat / state

Brothers death: మరణంలోనూ వీడని రక్తసంబంధం..!

author img

By

Published : May 20, 2022, 7:13 AM IST

Brothers death: కర్నూలులో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఒకే రోజు తోబుట్టువులిద్దరూ మృతి చెందటంతో.. జిల్లాలోని మద్దూరు నగర్​లో విషాదం నెలకొంది. వారిద్దరి మృతదేహాలను చూసిన కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

Brothers death on same day in kurnool
ఒకే రోజు ప్రాణాలు కోల్పోయిన అన్నదమ్ములు

Brothers death: ఒకే రోజు అన్నదమ్ములిద్దరూ మృతి చెందిన విషాద ఘటన కర్నూలులో జరిగింది. మద్దూరు నగర్‌కు చెందిన వసంత, అనిల్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడైన 15 ఏళ్ల అభి.. ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి.. ప్రమాదంలో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

17 ఏళ్ల పెద్ద కుమారుడు అరవింద్ సైతం ఇంట్లో నిద్రలోనే అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. కుమారుల ఎదుగుదల చూడాలనుకున్న కుటుంబ సభ్యులు.. వారి మృతదేహాల్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించడం స్థానికుల్ని కంటతడి పెట్టిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.