ETV Bharat / state

YSRCP Minister Kottu Satyanarayana: 'పవన్​కు ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేదు.. రోజురోజుకూ ఇమేజ్​ డ్యామేజ్​'

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 22, 2023, 5:30 PM IST

YSRCP Minister Kottu Satyanarayana : పవన్ కల్యాణ్ ఇమేజ్​ తగ్గిపోతోందని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. ఒంటరిగా పోటీచేసే ధైర్యం లేక టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తోందని ఆయన పేర్కొన్నారు. దేవాదాయశాఖ ఆధ్వర్యాన ధర్మ ప్రచారం కార్యక్రమం ఏడాది పొడవునా చేపట్టేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.

YSRCP Minister Kottu Satyanarayana
YSRCP Minister Kottu Satyanarayana

Minister Kottu Satyanarayana Political Comments: పవన్ కల్యాణ్ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోందని మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక కలిసి పోటీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ విజయం సాధిస్తుందనేందుకు ఇది సంకేతమన్నారు. లోకేశ్ చేస్తుంది యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) కాదు.. గందరగోళం పాదయాత్ర అని అన్నారు. పాదయాత్రకు 250 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యిందని టీడీపీ నేతలు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు సీఈసీకి ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది, లేఖలు రాస్తే ఏమిటన్న మంత్రి.. ప్రభుత్వమే ఓటర్ల జాబితాను తనిఖీ చేయిస్తోందన్నారు. యువగళం పాదయాత్రలో తన వ్యతిరేకుల పేర్లు రాసుకుంటే ఏమవుతుంది, రాజకీయ పాదయాత్రకు సెలవులు ఉండవు అని అన్నారు. వైసీపీ మేనిఫెస్టో (Manifesto)నే పేర్లు మార్చి టీడీపీ పథకాలు ప్రకటించిందని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు (Chandrababu Naidu) రాఖీ బాబా అవతారం ఎత్తారు.. ఇదెక్కడి పిచ్చితనమంటూ మంత్రి ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ (Pawan Klayan) పవర్ స్టార్​గా పేరు తెచ్చుకుని.. ఇప్పుడు చంద్రబాబు మాటలు విని ఇమేజి పోగొట్టుకుంటున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

Kottu Satyanarayana on BJP: 'మోదీ అలా.. అమిత్ షా ఇలా.. వారిద్దరికీ ఏమైందో..!'

చంద్రబాబు నాయుడు లేఖలు ఎన్నయినా రాస్తాడు.. ఎన్నికల డ్రామాలు వేయాలిగా.. ఇవాళ ప్రభుత్వమే.. ఎన్నికల కమిషనే ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితాపై విచారణ జరిపిస్తోంది. సర్వే కొనసాగుతోంది. దానికి సంబంధించి సర్వే చేస్తున్నందున ఎవరున్నారు..? ఎవరు లేరు అనే విషయం తెలిసిపోతుంది కదా.. - మంత్రి కొట్టు సత్యనారాయణ

Satyanarayana 5 లక్షల రూపాయల ఆదాయం కలిగిన 23,600 ఆలయాలు గుర్తించామని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ఆలయ నిర్వహణ అప్పగించేందుకు కేవలం 37 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని, వాటికి ధూప దీప నైవేద్య కార్యక్రమం నిర్వహించే అంశంపై యధావిధిగా కార్యాచరణ ఉంటుందన్నారు. ధర్మ ప్రచారం కార్యక్రమం ఏడాది పొడవునా చేపట్టేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

Shops Closed in Srikalahasti Due to Minister Kottu Tour: 'మంత్రి వస్తున్నాడని.. షాపులు బంద్​'.. శ్రీకాళహస్తిలో అధికారుల అత్యుత్సాహం

ధర్మప్రచారం.. దేవాలయాల వారీగా సమీప ప్రాంతాల్లో ధర్మ ప్రచారం కార్యక్రమం చేస్తామని, ఈ కార్యక్రమంలో స్థానిక కళాకారులకు కూడా చేయూత లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడితే కొందరు తనపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అన్నారు. పట్టణాల్లో దేవాదాయ శాఖ సత్రాలు, మఠాల ఆక్రమణకు పాల్పడడాన్ని నిలువరిస్తామన్నారు. దేవాదాయ శాఖ (Endowment Department) కు చెందిన ఏ భూమి అయినా చట్టపరంగా స్వాధీనం చేసుకునేలా ఆర్డినెన్సు ఇచ్చామన్నారు. అన్యాక్రాంతం అయ్యేందుకు వీలు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. 4.60 లక్షల ఎకరాల భూమి దేవాదాయ శాఖదేనని, 1.65 లక్షల గజాల వాణిజ్య స్థలం ఆక్రమణలో ఉందని మంత్రి వెల్లడించారు.

Deputy CM Kottu comments: జగన్ మళ్లీ అధికారంలోకొస్తే.. అందరి లెక్కలు తేలుస్తాం: డిప్యూటీ సీఎం కొట్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.