ETV Bharat / state

ప్రజలపై జగన్ మరో బాదుడు-సీసీ కెమెరాల ప్రాజెక్టుకు 552 కోట్ల అప్పు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 22, 2023, 7:17 AM IST

YSRCP Government Debt For CCTV Project: రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చడమే పరమావధిగా పెట్టుకున్నట్లుంది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. అది, ఇది అన్న తేడాల్లేకుండా ప్రతి రంగంలోనూ ఎంత మేరకు అవకాశముంటే అంతమేరకు అప్పులు చేస్తోంది. తాజాగా సీసీ కెమెరాల ప్రాజెక్టు పేరుతో 552 కోట్ల కొత్త రుణం పొందేందుకు మార్గం సుగమం చేసుకుంది. ఏపీ ఫైబర్‌నెట్‌ సంస్థ తీసుకునే ఈ అప్పుకు ప్రభుత్వం హామీ ఇస్తూ ఉత్తర్వులిచ్చింది.

YSRCP_Government_Debt_For_CCTV_Project
YSRCP_Government_Debt_For_CCTV_Project

ప్రజలపై జగన్ మరో బాదుడు-సీసీ కెమెరాల ప్రాజెక్టుకు 552 కోట్ల అప్పు

YSRCP Government Debt For CCTV Project : అప్పులకు అలవాటు పడిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త రుణం పుట్టించడానికి సరికొత్త మార్గాన్ని వెతికింది. నాలుగున్నరేళ్లుగా సీసీ కెమెరాల ప్రాజెక్టును మూలనపడేసి ఎన్నికలకు ముందు ఇప్పుడు తెరపైకి తెచ్చింది. దీని కోసం ఏపీ ఫైబర్‌నెట్‌ తీసుకునే 552 కోట్ల 70 లక్షల రుణానికి హామీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 12న సంస్థ ఎండీ అలా లేఖ రాశారో లేదో పట్టుమని 10 రోజులు తిరగకుండానే రుణం తీసుకోవడానికి అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రుణంగా తీసుకునే మొత్తం ఎస్క్రో ఖాతాలో కాకుండా సంస్థ ఖాతాకు జమకానుంది. ఆ మొత్తాన్ని సీసీ కెమెరాల ఏర్పాటుకే వాడతారా లేక ప్రభుత్వం ఇతర అవసరాలకుదారి మళ్లిస్తుందా అనే అనుమానాలను కొందరు అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Government Guarantees AP Fibernet Company Debt : కొద్ది నెలల కిందట భారత్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌-BBNL (Bharat Broadband Network Limited) పనుల కోసం 600 కోట్ల రూపాయల రుణాన్ని గ్రామీణ విద్యుదీకరణ సంస్థ- REC నుంచి APSFL (Andhra Pradesh State FiberNet Limited) తీసుకుంది. రుణ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి ప్రతిపాదనలో చూపిన లెక్కలే విచిత్రంగా ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిని సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి వారి నుంచి జరిమానాలు వసూలు చేసి ఆ మొత్తం నుంచి చెల్లిస్తామని సంస్థ పేర్కొనడం విస్తుగొలుపుతోంది. దీని కోసం పోలీసులు, రవాణా శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ఇప్పటికే హైదరాబాద్‌, బెంగళూరుల్లో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేస్తామని మరీ పేర్కొంది. గతంలో హోంశాఖ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల నిర్వహణ ప్రాజెక్టును ప్రభుత్వం APSFLకు బదిలీ చేసింది.

జగనన్న వీర బాదుడు మామూలుగా లేదుగా - సామాన్యుడి గుండె గుభేల్​!

Andhra Pradesh Debt 2023 : రాష్ట్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి పర్యవేక్షణ కోసం బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ (State Fibernet Limited) తీసుకునే 552 కోట్ల 70 లక్షల రుణానికి ప్రభుత్వం హామీగా ఉంటుంది. సీసీ కెమెరాల ఏర్పాటుకు 959 కోట్లు, వాటి నిర్వహణ సంస్థకు ఐదున్నర కోట్లు, 13 జిల్లాల్లో రియల్ టైం గవర్నెన్స్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు 178 కోట్ల 20 లక్షలు, థర్డ్ పార్టీ టెస్టింగ్ ఏజెన్సీ కోసం 2 కోట్ల 40 లక్షలు కలిపి మొత్తం 11 వందల 45 కోట్ల 10 లక్షల రూపాయలను ప్రాజెక్టు అమలుకు ప్రతిపాదించింది. అందులో ఇప్పటికే 926 కోట్ల 20 లక్షల రూపాయలతో గుత్తేదారు సంస్థ పనులు నిర్వహించింది. వారికి బిల్లుల రూపేణా చెల్లించిన 579 కోట్ల 70 లక్షలు పోను ఇంకా 346 కోట్ల 50 లక్షలు చెల్లించాల్సి ఉంది. ప్రాజెక్టు అమలులో జాప్యానికి వడ్డీలు, ఇతర ఖర్చులు కలిపి 28 కోట్ల 40 లక్షల రూపాయలు అవసరం. ప్రాజెక్టులో మిగిలిన పనులు చేపట్టడానికి అవసరమైన మొత్తాన్ని రుణంగా తీసుకోవాలని ఫైబర్‌నెట్‌ సంస్థ నిర్ణయించింది.

AP Financial Condition : ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ.. అప్పు చేసినా జీతాలివ్వలేని పరిస్థితి

552 Crore Loan for CC Cameras Project : BBNL (Bharat Broadband Network Limited) ప్రాజెక్టు పనుల పేరుతో 600 కోట్ల రుణాన్ని REC నుంచి ఫైబర్‌నెట్ సంస్థ తీసుకుంది. R.E.C. ఇప్పటికే 300 కోట్లను APSFLకు ఇచ్చింది. ఈ మొత్తంతో ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌కు సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులను సంస్థ నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. కొద్ది రోజుల్లో రెండో విడత మరో 300 కోట్ల విడుదల కానున్నట్లు ఓ అధికారి తెలిపారు. అభివృద్ధి పనులే జరగకుండా రుణాన్ని తీసుకుని ఆ మొత్తాన్ని సంస్థ నుంచి ఎక్కడికి మళ్లించింది? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పాటు ప్రస్తుతం సీసీ కెమెరాల నిర్వహణ పేరిట మరో 552 కోట్ల రుణాన్ని సంస్థ తీసుకోనుంది. ఇప్పటికే సంస్థ ప్రతి నెలా 5 కోట్ల రూపాయల నష్టాల్లో ఉంది. REC నుంచి తీసుకున్న 300 కోట్లు, తీసుకోబోతున్న 852 కోట్లు కలిపి మొత్తం 11 వందల 52 కోట్ల కొత్త అప్పులపై వడ్డీల భారం పెరిగి సంస్థ మునిగిపోయే ప్రమాదం ఉందని కొందరు అధికారుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Andhra Pradesh Debt Details: రాష్ట్ర అప్పులను మరోసారి బయటపెట్టిన కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.