ETV Bharat / state

రాంగోపాల్ రెడ్డి పులివెందుల పులిబిడ్డ.. జగన్ పులివెందుల పిల్లి : చంద్రబాబు

author img

By

Published : Mar 20, 2023, 7:54 PM IST

1
1

Chandrababu comments on mlc victory : ముగ్గురు పట్టభద్రుల తెలుగుదేశం ఎమ్మెల్సీలను అధినేత చంద్రబాబు ఘనంగా సత్కరించారు. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత, అభ్యర్థులు, టీడీపీ పట్ల నమ్మకం విజయానికి కారణమని చెప్తూ.. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందించారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ.. క్రైం ఇన్ ధియరీకి పాల్పడిందని, నేరాలకు పాల్పడిందని, అందులో అధికారులు ఇరికించే ప్రయత్నం చేసిందని చంద్రబాబు చెప్పారు.

Chandrababu comments on mlc victory : ముగ్గురు పట్టభద్రుల తెలుగుదేశం ఎమ్మెల్సీలను అధినేత చంద్రబాబు ఘనంగా సత్కరించారు. బాబాయిని గొడ్డలిపోటుతో చంపేశాక ప్రజలు భయపడుతున్నారని సీఎం జగన్​ను ఉద్దేశించి విమర్శించారు. ఓటు అడగడానికి రావొద్దు.. మీకే ఓటేస్తామని... వేపాడ చెప్పిన విషయం నిజమన్నారు. ఇదే పరిస్థితి రాష్ట్రం మొత్తంగా ఉందని తెలిపారు. వేపాడకు ఎకనమిస్టుగా మంచి పేరు ఉందని.. అందుకే ఎమ్మెల్సీగా గెలిచారని తెలిపారు. వేపాడను విశ్వసనీయతే గెలిపించిందని చంద్రబాబు స్పష్టం చేశారు. వేపాడ పేరు ప్రకటించిన వెంటనే ఉత్తరాంధ్ర సీటు గెలిచిందనే ఫీలింగ్ వచ్చేసిందన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు శ్రీకాంత్ అండగా నిలిచారని గుర్తు చేశారు. వేపాడ, శ్రీకాంత్, రాంగోపాల్ రెడ్డి సతీమణులు కూడా టీడీపీ విజయం కోసం కష్టపడ్డారని అభినందించారు. శ్రీకాంత్ టెక్నాలజీని కూడా బాగా వినియోగించుకుని ఎమ్మెల్సీగా గెలిచారన్నారు. రాంగోపాల్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చే ముందు ఆలోచించానని చంద్రబాబు తెలిపారు.

పులివెందుల్లో రౌడీయిజానికి అడ్డుకట్ట... పులివెందుల బిడ్డ రాంగోపాల్ రెడ్డి అని అభినందించారు. రాంగోపాల్ రెడ్డి పులివెందుల పులి.. జగన్ పులివెందుల పిల్లి అని చంద్రబాబు తెలిపారు. పులివెందుల్లో వైఎస్సార్సీపీ రౌడీయిజాన్ని రాంగోపాల్ రెడ్డి అడ్డుకున్నారన్నారు. జగన్ పిరికివాడు.. తన కోసం చాలా మందిని తన క్రైమ్ లో పార్ట్​నర్లను చేస్తారని ధ్వజమెత్తారు. టీడీపీ గెలిచిన తర్వాత సీఎం జగన్ ఆదేశాల మేరకు రీ కౌంటింగ్ కోసం డిమాండ్ చేశారని తెలిపారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించాకే రీ-కౌంటింగ్ డిమాండ్ చేశారు.. డిక్లరేషన్ ఫారం ఇవ్వలేదని మండిపడ్డారు. రాత్రంతా అక్కడే ఉండి మానిటర్ చేస్తూ డిక్లరేషన్ ఫారం కోసం ఒత్తిడి చేశామని చెప్తూ.. లేదంటే ఫలితాలు తారుమారయ్యేవని అన్నారు. మన ఎఫర్ట్సుతోనే వాళ్లకి ఇష్టం లేకున్నా డిక్లరేషన్ ఫారం ఇచ్చారని తెలిపారు. గెలిచిన ఎమ్మెల్సీని ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు. ఆర్వోను రెచ్చగొట్టిన సీఎంను ఏమనాలని ప్రశ్నించారు. రేపు ఏదైనా తేడా జరిగితే.. బాధితులయ్యేది ఆర్వో, కలెక్టర్లేనని తెలిపారు. ఇదే పార్ట్​నర్స్ ఇన్ క్రైమ్ థియరీ అని పేర్కొన్నారు. టీడీపీ హిట్ లిస్టులో అధికారులని చేర్చి.. వాళ్లని టీడీపీ పైకి ఎగదోస్తున్నారని ఆక్షేపించారు.

జగన్ రెడ్డి ముందుగా క్రైం పార్ట్​నర్స్​ను ఎంచుకుంటాడు. వారితో నేరాలు చేయిస్తాడు. ఆర్ఓ, ఎన్నికల విధుల్లో ఉండే ఎస్పీతో కూడా నేరాలు చేయించాడు. ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి రవీందర్ రెడ్డి.. విజేతలకు అభినందనలు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ, జగన్ రెడ్డి ఫోన్ చేసి.. రీకౌంటింగ్ అడగమని చెప్పాడు. పైగా తెలుగుదేశం పార్టీ అధికారులను బ్లాక్ మెయిల్ చేసిందని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ఓ డిక్లరేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టారు. అయినా, రాత్రంతా తిండీ, తిప్పలు లేకుండా అక్కడే గడిపాం. డిక్లరేషన్ ఇచ్చే వరకూ అక్కడే ఉన్నాం. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించి ఆర్ఓను రెచ్చగొట్టిన ముఖ్యమంత్రిని సైకో అనకుండా ఏమనాలని నేను ప్రశ్నిస్తున్నా.. - చంద్రబాబు, తెలుగుదేశం అధినేత

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.