Padayatra: గుడివాడలో..  అడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులు

author img

By

Published : Sep 24, 2022, 2:23 PM IST

Updated : Sep 24, 2022, 3:10 PM IST

Amaravati Farmers padayatra

Amaravati Farmers padayatra: కృష్ణా జిల్లాలో 13వ రోజు అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది. గుడివాడలో రైతుల పాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. టోల్‌గేట్‌ వద్ద గద్దె అనురాధ వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. దీంతో టోల్‌గేట్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది. రాజధాని రైతుల మహాపాదయాత్రలో పోలీసుల చర్యలు తమను భయపెట్టేలా ఉన్నాయని ఐకాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లాలో రైతుల పాదయాత్రకు వెళ్లేవారికి పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. రైతుల పాదయాత్రకు మద్దతుగా వెళ్తున్న చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు.

Amaravati Farmers padayatra: 13వ రోజు అమరావతి రైతుల మహాపాదయాత్ర కొనసాగుతోంది. ఇవాళ కృష్ణా జిల్లా కౌతవరం నుంచి మహాపాదయాత్ర ప్రారంభమైంది. గుడ్లవల్లేరు, అంగలూరు మీదుగా గుడివాడకు రానుంది. నాగవరప్పాడు వరకు దాదాపు 15 కిలోమీటర్లు సాగనుంది. మరోవైపు గుడివాడలో రైతుల పాదయాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. కంకిపాడు మండలం దాములూరు టోల్‌గేట్‌ వద్ద తనిఖీలు చేపట్టారు.

ఐడీ కార్డులు ఉన్న రైతులనే అనుమతిస్తున్నారు. ఐడీ కార్డులు లేవంటూ 20 మంది రైతులను కంకిపాడు పీఎస్‌కు తరలించారు. ఐడీ కార్డుల పంపిణీ ప్రక్రియ పూర్తికాకున్నా అడ్డుకోవడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. టోల్‌గేట్‌ వద్ద గద్దె అనురాధ వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. దీంతో టోల్‌గేట్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు. గుడివాడ వెళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు ఆపేస్తున్నారు. కృష్ణా జిల్లావ్యాప్తంగా గుడివాడలో 400 మందికిపైగా పోలీసులు, అధికారులు మోహరించారు. గుడివాడ మార్కెట్ యార్డులో పోలీసులకు అధికారులు రూట్లు కేటాయించారు. ముందస్తుచర్యగా వజ్ర వాహనాలు, బలగాలను రంగంలోకి దింపారు.

కృష్ణాజిల్లా గుడివాడకు చేరుకున్న అమరావతి రైతుల మహా పాదయాత్రలో పాల్గొనేందుకు వెళ్తున్న... తెదేపా మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను పోలీసులు అడ్డుకున్నారు. ఏలూరు జిల్లా కైకలూరు తెదేపా కార్యాలయం నుంచి బయలుదేరిన జయమంగళాన్ని ముదినేపల్లిలో పోలీసులు అడ్డుకున్నారు. రైతులకు మద్దతు తెలపడానికి వెళ్తున్న నన్ను ఎందుకు ఆపుతున్నారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళతో పాటుగా పలువురు తెదేపా నేతలను అరెస్టు చేసి ముదినేపల్లి స్టేషన్‌కు తరలించారు.

రైతుల పాదయాత్రకు మద్దతుగా వెళ్తున్న చింతమనేనిని ఏలూరు జిల్లా దెందులూరు మండలం దుగ్గిరాల వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఏలూరులోని చింతమనేని ఇంటి చుట్టూ పోలీసు బలగాల మోహరించాయి.

పాదయాత్రకు వస్తున్న రైతులను ఎక్కడికక్కడ పోలీసులు ఆపేస్తున్నారు. రాజధాని గ్రామాల నుంచి వస్తున్న రైతుల బస్సులను అపేశారు. పెదపారుపూడి వద్ద రైతులు వస్తున్న బస్సులను నిలిపివేశారు. బస్సులు ఆపడంతో ఆటోల్లో పాదయాత్ర వద్దకు రైతులు చేరుకుంటున్నారు.

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో రైతుల పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రకు సంఘీభావంగా పిన్నమనేని రూ.5 లక్షల చెక్కు అందజేశారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జి ఆ చెక్కును అందజేశారు. పాదయాత్రలో కొనకళ్ల, పిన్నమనేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో పాదయాత్ర జరుగుతోందని కొనకళ్ల నారాయణ అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి అంగుళం కూడా కదల్చలేరన్నారు. నియంతలను మించి రాష్ట్రంలో జగన్ పాలన చేస్తున్నారని పిన్నమనేని విమర్శించారు.

పాదయాత్రకు మద్దతుగా వస్తున్న రైతుల్ని పోలీసులు అడ్డుకోవటంపై ఐకాస నేతల మండిపడ్డారు. పాదయాత్ర చేసేవారికి ఎంతమందైనా మద్దతు తెలపవచ్చని హైకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అశేష జనసందోహాన్ని చూసి...అధికార పార్టీ నేతలు భయపడుతున్నారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొవాలని హితవుపలికారు.

రాజధాని రైతుల మహాపాదయాత్రలో పోలీసుల చర్యలు తమను భయపెట్టేలా ఉన్నాయని ఐకాస నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు వద్ద పోలీసులు టియర్ గ్యాస్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, వాటర్ క్యాన్ వాహనాలను మోహరించారని తెలిపారు. గత 12రోజులుగా లేని చర్యలు ఇప్పుడేంటని రైతులు మండిపడ్డారు. పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఐకాస నేతలు ఆరోపించారు.

కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో కొనసాగుతున్న రైతుల పాదయాత్రకు సంఘీభావంగా పిన్నమనేని వెంకటేశ్వరరావు, బాబ్జీలు 5లక్షల రూపాయల చెక్కును అందజేశారు. కనీవినీ ఎరుగని రీతిలో పాదయాత్ర జరుగుతోందని కొనకళ్ల నారాయణ అన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిని అంగుళం కూడా కదల్చలేరన్నారు. నియంతలను మించి జగన్ పాలన చేస్తున్నారని పిన్నమనేని మండిపడ్డారు. సాయంత్రానికి రైతుల మహాపాదయాత్ర గుడివాడకు చేరనుంది.

నోటీసులు: పల్నాడు జిల్లాలో రైతుల పాదయాత్రకు వెళ్లేవారికి పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. నరసరావుపేట నియోజకవర్గంలో పలువురికి నోటీసులు ఇచ్చారు. పాదయాత్రకు వెళ్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రాజుపాలెం మండలంలో పలువురికి నిన్న రాత్రి పోలీసులు నోటీసులు ఇచ్చారు.

13వ రోజు పాదయాత్ర

ఇవీ చదవండి:

సిద్ధంగా ఉన్నారా లేక ప్రత్యామ్నాయం చూసుకోవాలా: చంద్రబాబు

చెదరని సంకల్పం.. అమరావతే లక్ష్యం.. రైతుల మహాపాదయాత్ర

'ప్రేమలో ఉన్నప్పుడే బాధగా ఫీల్ అవుతా'.. అందాల ఊర్వశి పోస్ట్

Last Updated :Sep 24, 2022, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.