ETV Bharat / state

కొడాలి నాని, వంశీపై.. వైఎస్సార్సీపీ నేతల సంభాషణ వైరల్.. స్పందించిన దుట్టా

author img

By

Published : Feb 2, 2023, 1:27 PM IST

Updated : Feb 2, 2023, 5:13 PM IST

YSRCP leaders viral comments : ఇద్దరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల గురించి ఆ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఓ ప్రైవేటు కార్యక్రమంలో కలుసుకున్న నాయకులు విసిరిన వ్యంగాస్త్రాలు.. కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీలో అసంతృప్తి జ్వాలలు రేపాయి.

వైఎస్సార్సీపీ నేతల్లో అసంతృప్త జ్వాలలు
వైఎస్సార్సీపీ నేతల్లో అసంతృప్త జ్వాలలు

YSRCP leaders viral comments : కృష్ణాజిల్లాలో అధికార వైఎస్సార్సీపీ నేతల్లో అసంతృప్త జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. నేతల మధ్య నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు రాజుకుంటూనే ఉన్నాయి. గన్నవరం వైెఎస్సార్సీపీ నాయకులు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు సంభాషణలు సోషల్ మీడియాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతూ దుమారం రేపుతున్నాయి. ఒక ప్రైవేటు కార్యక్రమంలో కలుసుకున్న సందర్బంలో వైఎస్సార్సీపీ నేతల మధ్య సంభాషణ సాగింది.

మాజీ మంత్రి కొడాలి నాని సహా ఎమ్మెల్యే వంశీపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కొడాలి నానిపై చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఏ సినిమాలోనైనా హీరో కంటే విలన్​కే ఎక్కువ క్రేజ్ ఉంటుందని.. నియోజకవర్గానికి ఎందుకైనా ఉపయోగపడతారా..? అంటూ మాట్లాడారు. వల్లభనేని వంశీ, కొడాలి నానికి ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఏ వ్యాపారం చేసి ఇంత డబ్బు సంపాదించారని, ప్రశ్నించారు.

వల్లభనేని వంశీ ఆగడాలను మేం పశ్నించబట్టే మాకు ప్రజల్లో గుర్తింపు వచ్చింది.. అని దుట్టా వ్యాఖ్యలు చేసినట్లుగా ఉంది. మీడియాను మేనేజ్ చేయడంలో వంశీ దిట్ట అంటూ యార్లగడ్డ వెంకట్రావ్ వ్యాఖ్యానించారు. వీడియో వైరల్ కావడంతో పార్టీలో సర్వత్రా చర్చనీయాంశమైంది.

వైఎస్సార్సీపీ నేతల్లో అసంతృప్త జ్వాలలు

సీఎం జగన్​ని తిట్టే మనస్తత్వం మాది కాదు: యార్లగడ్డ వెంకట్రావు, తాను పార్టీకి కట్టుబడి ఉన్నామని వైకాపా నేత దుట్టా రామచంద్రరావు వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ని తిట్టే మనస్తత్వం తమది కాదని అన్నారు. అనకూడని మాటలు ఏమీ అనలేదన్నారు. వల్లభనేని వంశీతో కలిసి ప్రయాణం చేయమని అధిష్ఠానం చెప్పిందన్న ఆయన.. కుదరదని చెప్పేశామన్నారు. అదే సమయంలో వంశీతో గొడవ పడొద్దని చెప్పారని.. ఆ మాటకే కట్టుబడి ఉన్నామన్నారు.

ఇవీ చదవండి :

Last Updated : Feb 2, 2023, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.