ETV Bharat / state

అమరరాజా కేసు.. పీసీబీ షోకాజ్ నోటీసులపై స్టే ఎత్తివేేసిన సుప్రీంకోర్టు

author img

By

Published : Feb 20, 2023, 5:40 PM IST

Amararaja Batteries Company case : అమరరాజా బ్యాటరీస్ కాలుష్యం వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ పీసీబీ షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టే ఎత్తేసిన సుప్రీంకోర్టు.. కంపెనీ మూసివేతపై హైకోర్టు స్టే ఆర్డర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. రాజకీయ కారణాలతో తమను వేధిస్తున్నారని అమరరాజా తరఫు న్యాయవాదులు విన్నవించారు.

సుప్రీంకోర్టులో విచారణ
సుప్రీంకోర్టులో విచారణ

Amararaja Batteries Company case : అమరరాజా బ్యాటరీస్ కాలుష్యం వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ పీసీబీ షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టే ఎత్తేసిన సుప్రీంకోర్టు.. కంపెనీ మూసివేతపై హైకోర్టు స్టే ఆర్డర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. అమరరాజా తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని షోకాజ్ నోటీసులు ఇచ్చిన పీసీబీ.. పరిసర జలాల్లో లెడ్ పెరుగుతోందని మూసివేతకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం విదితమే. కాగా, రాజకీయ కారణాలతో తమను వేధిస్తున్నారని అమరరాజా తరఫు న్యాయవాదులు విన్నవించారు. షోకాజ్ నోటీసుపై ప్రజాభిప్రాయ సేకరణ చేసి నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఇచ్చే ఉత్తర్వులను 4 వారాలు నిలుపుదల చేయాలని సూచించింది. పీసీబీ నోటీసులపై న్యాయ పరిష్కారాల కోసం నిలుపుదల చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

అమరరాజా బ్యాటరీస్ కాలుష్యం వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ పీసీబీ షోకాజ్ నోటీసులపై గతంలో ఇచ్చిన స్టే ఎత్తేసిన సుప్రీంకోర్టు.. కంపెనీ మూసివేతపై హైకోర్టు స్టే ఆర్డర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. షోకాజ్ నోటీసుపై ప్రజాభిప్రాయ సేకరణ చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

వేలాది మందికి ఉపాధి.. వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో అమరరాజా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది. దీంతో 20వేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా 50వేల మంది.. మొత్తం 70వేలకు పైగా ఉపాధి పొందుతున్నారు. ఈ నేపథ్యాన.. ఆ సంస్థ మరో 9,500కోట్ల పెట్టుబడితో లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమైంది. ప్రభుత్వం అంగీకరించి ఉంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా మరికొన్ని వేలమందికి ఉపాధి లభించేది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వచ్చేది. పలు అనుబంధ పరిశ్రమలూ ఏర్పాటయ్యేవి. అయితే.. వైసీపీ ప్రభుత్వం రాకతోనే అమరరాజా సంస్థపై వేధింపులు ప్రారంభమయ్యాయి.

భూములు గుంజుకున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం... వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఆ సంస్థకు ఇచ్చిన 253 ఎకరాల భూములను ప్రభుత్వం 2020 జూన్‌ 30న వెనక్కి తీసేసుకుంది. ఈ కారణంతో అమరరాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. ఒప్పందంలో పేర్కొన్న దానికంటే అధికంగా ఉపాధి కల్పించడమే గాక రూ.2,700కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టామని విన్నవించడంతో కోర్టు స్టే విధించింది. ఆ తర్వాత ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలు మరింతగా పెరిగాయి.

నిబంధనల పేరిట వేధింపులు.. 2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో విడతల వారీగా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీలు చేశారు. గాలిలో, మట్టిలో సీసం పరిమాణం నిర్దేశిత ప్రమాణాలకు మించి ఉన్నట్టు వెల్లడించారు. అంతేగాకుండా ఉద్యోగుల రక్తంలోనూ పరిమితికి మంచి సీసం ఉన్నట్టు పరీక్షల్లో తేలిందని చెప్పారు. నిబంధనలు పాటించడం లేదంటూ చిత్తూరు జిల్లా నూనెగుండ్లపల్లి, కరకంబాడిల్లో ఉన్న అమరరాజా బ్యాటరీ తయారీ యూనిట్లు మూసేయాలని పీసీబీ ఆదేశించింది. ఆ క్రమంలో 2021 మే 1న అమరరాజా బ్యాటరీస్‌ ఫ్యాక్టరీకి ఏకంగా విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం గమనార్హం.

హైకోర్టు స్టే.. అమరరాజా సంస్థ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే విధించింది. తదనంతరం కూడా వేధింపులు కొనసాగుతున్నాయి. నిబంధనల సాకుతో... విపక్ష పార్టీల్లో కీలక నేతలకు చెందిన పరిశ్రమలపై కక్షసాధింపు చర్యలకు పూనుకోవడం, ఏకంగా వాటిని మూయించాలని ప్రయత్నించడం వల్ల వేలాది మంది కార్మికులు, రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం ఏర్పడుతోంది.

పెద్దఎత్తున విస్తరణకు సిద్ధమైన అమరరాజా సంస్థ.. తెలంగాణతోపాటు తమిళనాడు, ఉత్తరభారత్‌లోని మరో రాష్ట్రంలోనూ పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది. బ్యాటరీల తయారీలో నంబర్‌వన్‌ స్థానంలో ఉన్న ఆ సంస్థను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తమ రాష్ట్రానికి ఆహ్వానించగా.. అక్కడ కూడా పెట్టుబడులకు అమరరాజా ఆలోచిస్తోంది.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.