ETV Bharat / state

రాష్ట్ర సంపదంతా తన దగ్గరే ఉండాలనుకునే ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి: చంద్రబాబు

author img

By

Published : Feb 23, 2023, 4:29 PM IST

Kanna Laxminarayana joined in TDP : మేం రాజకీయంగా విబేధించుకున్నాం కానీ, వ్యక్తిగతంగా కాదు.. పెదకూరపాడులో కన్నాని ఓడించేందుకు మేం ఎంత ప్రయత్నించినా ప్రజల్లో ఆయనకు ఉన్న అభిమానం ముందు మేం ఓడిపోయామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కండువా కప్పి కన్నాను అహ్వానించారు. ఈ సందర్భంగా గత స్మృతులను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

Kanna Laxminarayana joined in TDP : సీనియర్ రాజకీయ నేత కన్నా లక్ష్మీనారాయణ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశంలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

వ్యక్తిగత విబేధాలు లేవు.. కన్నాతోపాటు భారీగా అనుచరులు ఎన్టీఆర్ భవన్ కు తరలివచ్చిన నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకత ఉన్న నేత అని చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఎంత ఉత్సాహం ఉంటుందో.. అంతే ఉత్సాహం కన్నా చేరిక సందర్భంగా చూపించటం సంతోషకరమన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన వ్యక్తి కన్నా.. అని అభినందించారు. రాజకీయంగా తాను, కన్నా విభేదించుకున్నామే గానీ.. అవి వ్యక్తిగతం కాదని స్పష్టం చేశారు. పెదకూరపాడులో కన్నాని ఓడించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని,.. ఆయన ప్రజలతో అంతగా మమేకమయ్యారని వెల్లడించారు.

పెద్ద ఎత్తున టీడీపీలో చేరిక... కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఆ పార్టీని కాదని కన్నా తెదేపాలోకి వచ్చారంటే అది రాష్ట్ర భవిష్యత్ కోసమేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. సీనియర్ రాజకీయ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశంలో చేరారు. కన్నాకు తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం లోకి సాదరంగా ఆహ్వానించారు. కన్నా లక్ష్మీనారాయణ తో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున తెలుగుదేశంలో చేరారు. కన్నాతోపాటు భారీగా అనుచరులు ఎన్టీఆర్ భవన్ కు తరలివచ్చిన నేపథ్యంలో తెదేపా కేంద్ర కార్యాలయం పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన వ్యక్తి కన్నా. రాజకీయంగా విభేదించుకున్నాం కానీ, అవి వ్యక్తిగతం కాదు. పెదకూరపాడులో కన్నాని ఓడించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ప్రజలతో ఆయన అంతగా మమేకమయ్యారు. - చంద్రబాబు, తెలుగుదేశం అధినేత

వ్యవస్థలను నాశనం చేస్తున్నారు.. సైకో పాలనలో ప్రజలంతా పేదలవుతుంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం మరింత ధనవంతుడు అవుతూనే ఉన్నాడని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రులుగా చేసిన వారిలో కొందరు అవినీతిపరులు, మరికొందరు అసమర్థులు ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డిలా విధ్వంసం చేసిన వారు మాత్రం లేరని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి అయినా మంచిపేరు తెచ్చుకునేందుకు తపిస్తారు కానీ జగన్మోహన్ రెడ్డిలా వ్యవస్థలపై దాడులు చేయరని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర సంపదంతా తన దగ్గరే ఉండాలనుకునే ఆర్ధిక ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి అని దుయ్యబట్టారు. మెడమీద కత్తిపెట్టి ప్రజల ఆస్తులు కాజేసే దుర్మార్గుడు పేదల ప్రతినిధిగా చెప్పుకుంటున్నాడన్న చంద్రబాబు.. సైకోలు మాత్రమే జగన్​లా మాట్లాడతారని మండిపడ్డారు.

రాష్ట్రంలో రాక్షస పాలనను పారద్రోలాలంటే ప్రజాస్వామ్య వాదులతో కలిసి పోరాడటమే ఉత్తమం. రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యాపార కేంద్రంగా మార్చారు. సంక్షేమం అంటే చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తుకెళ్లటం కాదు. అమరావతే రాజధాని అన్న జగన్... మాట తప్పాడు. చంద్రబాబుకి వ్యతిరేకంగా పనిచేసిన వారిలో నేనూ ఒకడిని, కానీ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యానే తెలుగుదేశంలో చేరాను. - కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.