ETV Bharat / state

ఎస్సీ, ఎస్టీ, బీసీల రుణాల రాయితీ వెనక్కి!.. బ్యాంకుల్లో రూ.488 కోట్లకుపైనే..

author img

By

Published : Jul 27, 2022, 3:58 AM IST

SC ST BC Loans BAcked
SC ST BC Loans BAcked

SC ST BC Loans Concession: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తదితర సామాజిక వర్గాల్లోని నిరుపేదలకు గత మూడేళ్లుగా స్వయం ఉపాధి రుణాలివ్వని వైకాపా ప్రభుత్వం.. గత ప్రభుత్వమిచ్చిన రాయితీ నిధుల్నీ విడిచిపెట్టడం లేదు. తాజాగా గత ప్రభుత్వ హయాంలో పేదల అభ్యున్నతికి 20 కార్పొరేషన్ల ద్వారా అందించి.. ఖర్చు కాకుండా మిగిలిపోయిన స్వయం ఉపాధి రుణాల రాయితీ నిధులపై కన్నేసింది. 2014-15 నుంచి 2018-19 వరకు ఖర్చు కాకుండా ఉన్న నిధులు బ్యాంకుల్లో సుమారు రూ.488 కోట్లు ఉన్నట్లు గుర్తించి వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది.

SC ST BC Loans Concession: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తదితర సామాజిక వర్గాల్లోని నిరుపేదలకు గత మూడేళ్లుగా స్వయం ఉపాధి రుణాలివ్వని వైకాపా ప్రభుత్వం.. గత ప్రభుత్వమిచ్చిన రాయితీ నిధుల్నీ విడిచిపెట్టడం లేదు. పేదలు తమ కాళ్ల మీద నిల్చునేందుకు ఊతమిచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి నవరత్న పథకాల చెల్లింపులనే వాటి ద్వారా చూపిస్తూ అర్థాన్నే మార్చేసింది. తాజాగా గత ప్రభుత్వ హయాంలో పేదల అభ్యున్నతికి 20 కార్పొరేషన్ల ద్వారా అందించి.. ఖర్చు కాకుండా మిగిలిపోయిన స్వయం ఉపాధి రుణాల రాయితీ నిధులపై కన్నేసింది. 2014-15 నుంచి 2018-19 వరకు ఖర్చు కాకుండా ఉన్న నిధులు బ్యాంకుల్లో సుమారు రూ.488 కోట్లు ఉన్నట్లు గుర్తించి వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేసింది.

బీసీలకు చెందిన రాయితీయే రూ.200 కోట్లు
బ్యాంకుల్లో నిల్వ ఉన్న రూ.488 కోట్లలో బీసీలకు సంబంధించి రూ.200 కోట్లు, కాపులకు చెందిన రూ.94 కోట్లు, ఎస్సీల కోటా రూ.81 కోట్ల వరకు ఉన్నాయి. ఎస్టీ, రజకులు, నాయీ బ్రాహ్మణులు, వడ్డెర, విశ్వ బ్రాహ్మణులు, తదితర వర్గాలకు సంబంధించిన రాయితీ నిధులు రూ.5కోట్ల నుంచి రూ.15 కోట్ల వరకు ఉన్నట్లు గుర్తించారు. ఏ బ్యాంకులో ఎంత మొత్తం ఉందో? ప్రభుత్వం లెక్కలు తీసింది. రాష్ట్రంలోని దాదాపు 48 బ్యాంకుల్లో రాయితీ నిధులు ఉన్నట్లు గుర్తించింది. బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌ ఖాతాల్లో జమ చేసేలా షెడ్యూలు విడుదల చేసింది. దీన్ని పర్యవేక్షించేందుకు ఎస్సీ కార్పొరేషన్‌ను నోడల్‌ ఏజెన్సీగా నియమించింది. 2019 ఎన్నికల ముందు గత ప్రభుత్వ హయాంలో స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తు చేసుకుని ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న వివిధ వర్గాల వారు వేల సంఖ్యలో ఉన్నారు. వైకాపా ప్రభుత్వం వీరికీ ఇవ్వలేదు. అలాగనీ కొత్తగా ఎంపిక ప్రక్రియ చేపట్టలేదు. రాయితీ రుణాల్ని అందజేతను పక్కనపెట్టింది. ఇంటింటికీ బియ్యం సరఫరా వాహనాలనే రాయితీపై అందించారు.

ఇదీ చదవండి: పోలవరం నిర్వాసిత కుటుంబాలు.. 1.06 లక్షలు: రాజ్యసభలో కేంద్ర మంత్రి వెల్లడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.