ETV Bharat / state

పెర్​ఫ్యూమ్​ గన్... పేలిస్తే కోతులు రన్​...

author img

By

Published : Oct 28, 2020, 4:16 PM IST

అతడొక నిరక్షరాస్యుడు... దినసరి వ్యవసాయ కూలీ, పంటలకు నష్టం కలిగిస్తున్న కోతుల గుంపు తరిమి కొట్టడమే అతని విధి. ఎన్నో ఏళ్లుగా ఇదే పని చేస్తూ బతుకుతున్నాడు. ఒకానొక వేళ అతడికి మెరుపులా ఓ ఆలోచన తట్టింది. అది ఓ తుపాకీ తయారుచేసేందుకు కారణమైంది.

పర్​ఫ్యూమ్​ గన్.. పేలిస్తే కోతులకు గజ గజే
పర్​ఫ్యూమ్​ గన్.. పేలిస్తే కోతులకు గజ గజే

పర్​ఫ్యూమ్​ గన్.. పేలిస్తే కోతులకు గజ గజే

కృష్ణా జిల్లా నూజివీడు పట్టణం ఎండీవో కార్యాలయం సమీపంలోని యానాదుల కాలనీలో నరసింహారావు అనే గిరి పుత్రుడు ఉంటున్నాడు. అతను చేసిన వినూత్న ప్రయోగం.. నేడు రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. రెండు పైపులు, ఒక గ్యాస్ లైటర్, ఒక క్యారీబ్యాగ్, కొద్దిగా సెంటు వినియోగిస్తే బాంబు పేల్చిన శబ్దం సృష్టించవచ్చని ఆలోచించాడు. ఈ ఆలోచన నుంచి కోతుల గుంపు తరిమేందుకు కొత్త పరికరం తయారు చేశాడు. ఇప్పుడు కోతులను తరిమికొట్టడం సులువైంది.

'కోతుల గుంపు తరిమేందుకు నేను ఎన్నో ప్రయత్నాలు చేసే వాడిని. చిన్నతనంలో టపాకాయలు తయారు చేయడం, ఉండేలుతో కోతులను తరమడం వంటివి చేసేవాడిని. వాటి నుంచి వచ్చిన ఆలోచనతోనే పైపులతో కొత్తగా తయారు చేసిన ఈ పరికరం రూపుదిద్దుకుంది. 3 అంగుళాల పైపు మూడడుగులు, రెండంగుళాల పైప్ మూడడుగులు తీసుకొని రెంటినీ కలపాలి. వెనక వైపు మూత బిగించి, పైన గ్యాస్ లైటర్ ఏర్పాటు చేయాలి. ముందు నుంచి సెంటులో కొద్దిగా నీళ్లు కలిపి పైపులో పోసి, మూతి వద్ద క్యారీబ్యాగ్ బిగించాలి. గ్యాస్ లైటర్​తో ఒత్తిడి పెంచితే ద్రావణం వేగంగా వచ్చి క్యారీ బ్యాగ్​కు తగలి బాంబు వలే పెద్ద శబ్దం వస్తుంది'. అని నరసింహారావు వివరించాడు.

ఈ పరికరం వినియోగించడం ద్వారా కోతుల మూక వేగంగా పరుగులు తీస్తున్నాయి. ఇది చూసిన రైతులందరూ హ్యాట్సాఫ్ నరసింహారావు అంటూ ప్రశంసిస్తున్నారు.

ఇదీ చదవండి: ప్రభుత్వం ఒక్కో రైతుకు రూ.77,500 ఎగ్గొట్టింది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.