ETV Bharat / state

రెడ్​జోన్ ఎత్తేస్తే... నిబంధనలు గాలికొదిలేస్తారా?

author img

By

Published : Jun 5, 2020, 7:33 PM IST

క్వారంటైన్ కేంద్రం​లో మిగిలిన నిత్యావసరాల కోసం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటవాసులు ఎగబడ్డారు. కరోనా వ్యాప్తి చెందుతున్న భయం లేకుండా... సామాజిక దూరం పాటించకుండా... నిత్యవసర సరుకుల కోసం గూమికూడారు.

no social distance in jaggayyapeta
జగ్గయ్యపేటలో భౌతికదూరం పాటించని స్థానికులు

క్వారంటైన్ కేంద్రంలో మిగిలిన నిత్యావసరాలను పేదలకు పంపిణీ చేయాలన్న ప్రయత్నం ప్రహసనంగా మారింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట గురుకుల పాఠశాలలోని క్వారంటైన్ కేంద్రం తొలగించి... అక్కడ మిగిలిన బియ్యం, సరుకులు పేదలకు సరఫరా చేసే పనిని అంగన్​వాడీలకు అప్పగించ్చారు. పెద్దరామాలయంలో ఏర్పాటు చేసిన పంపిణీ కార్యక్రమంలో వార్డుకి ఇద్దరు పేదలను ఎంపిక చేసి సరుకు సరఫరాకు ప్రయత్నించారు. దీంతో మేమూ పేదలమే అంటూ స్థానికులు పెద్ద ఎత్తున గూమికూడారు. పరిమితమైన సరుకులు ఎవరికి పంచాలో తెలియక సిబ్బంది ఇరకాటంలో పడ్డారు. పంపిణీ నిలిపి... అధికారులకు సమాచారం అందించారు. 15 రోజుల క్రితం వరకు రెడ్​జోన్​గా ఉన్న పట్టణంలో ఇప్పుడు ఇలా భౌతిక దూరం లేకుండా ప్రజలు గూమికూడటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఈ బుడ్డోడిది మెదడా..? కంప్యూటరా..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.