ETV Bharat / state

PAWANKALYAN TWEET: స్టాలిన్‌ను అభినందిస్తూ పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌

author img

By

Published : Sep 1, 2021, 7:11 AM IST

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను అభినందిస్తూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు, అన్ని రాజకీయ పార్టీలకు మీ పరిపాలన మార్గదర్శకం, స్ఫూర్తిదాయకమని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

pawan-kalyan-tweeted-congratulating-to-thamilnadu-cm-stalin
స్టాలిన్‌ను అభినందిస్తూ పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌

‘మీ పరిపాలన, ప్రభుత్వ పనితీరు మీ ఒక్క రాష్ట్రానికే కాదు... దేశంలోని అన్ని రాష్ట్రాలకు, రాజకీయ పార్టీలకూ మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం’ అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ శుభాభినందనలు తెలియజేస్తూ మంగళవారం రాత్రి ట్వీట్‌ చేశారు.

‘ఏ పార్టీ అయినా అధికారంలోకి రావడానికి రాజకీయం చేయాలి కానీ, వచ్చాక రాజకీయం చేయకూడదు. దీన్ని మీరు మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారు. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీకు నా శుభాకాంక్షలు’ అని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: నేటి నుంచి కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.