ETV Bharat / state

Farmers Hardships అకాల వర్షాల వెతలపై సర్కారు స్పందించకపోతే.. ఆత్మహత్యలే గతి అంటున్న రైతులు

author img

By

Published : May 5, 2023, 11:26 AM IST

Updated : May 5, 2023, 5:30 PM IST

Farmers Hardships: ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు కన్నీటిని మిగిల్చింది. ఎండ, వానను లెక్క చేయకుండా.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో.. నీటిపాలైంది. ప్రభుత్వ నిర్లక్ష్యం అకాల వర్షాలకు తోడు దళారుల దగాతో ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇకనైనా అలసత్వం వీడి..తమ వైపు చూడాలని..రైతులు మొరపెట్టుకుంటున్నారు.

Farmers hardships in the joint Krishna district
ఉమ్మడి కృష్ణజిల్లాలో రైతుల కష్టాలు

ఉమ్మడి కృష్ణజిల్లాలో రైతుల కష్టాలు

Farmers Problems : ఉమ్మడి కృష్ణాజిల్లాలోని రైతులు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పూర్తి స్థాయి చర్యలు చేపట్టలేదు. దీంతో కల్లాల్లోనే ఉన్న పంటలు.. గత నాలుగు రోజులుగా వీడని వర్షాలకు తడిసి ముద్దయ్యాయి. ముఖ్యంగా ఈ అకాల వర్షాలతో వరి, పసుపు, మొక్కజొన్నతో పాటు మామిడి రైతులు తీవ్ర నష్టాలపాలయ్యారు. ఇదే అదునుగా వ్యాపారులు ధరలను అమాంతం తగ్గించేశారు. ఆదుకోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కృష్ణా, ఎన్​టీఆర్ రెండు జిల్లాల్లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం అధికంగానే ఉంటుంది. ప్రస్తుతం మొక్కజొన్న కోత దశ, ఆరబెట్టేదశలో ఉంది. కోతకోసి కల్లాల్లో అరబెట్టిన మొక్కజొన్న కొద్దిపాటి వర్షం కురిసినా గింజ మొలకరావడం, ఫంగస్ సోకుతుందని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న పూర్తిగా తడిసి పోవడంతో ఫంగస్ వచ్చి గింజలు నీరుగారిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. మొక్కజొన్న క్వింటా 1870 రుపాయల మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కానీ పంట తడిసి పోవడంతో కొనే నాధుడే లేరని రైతులు వాపోతున్నారు.

మరిన్ని రోజుల పాటు వర్షాలు కురిస్తే పంటనష్టం మరింతగా పెరిగే అవకాశం లేకపోలేదని రైతులు వాపోతున్నారు. మొక్కజొన్న సాగుకు ఎకరానికి దాదాపు 35 వేలు ఖర్చు చేశామని, కల్లాల్లో ఆరబెట్టిన మొక్కజొన్న తడిచిపోవడంతో ఈ ఏడాది నష్టాలే మిగులుతాయని రైతులు అంటున్నారు. ఒక్క మొక్కజొన్న రైతులే కాకుండా ధాన్యం, పసుపు, మిరప రైతులు కూడా అకాల వర్షాలతో పాటు మద్దతు ధర లేకపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్నారు.

వేలకు వేలు అప్పులు తీసుకువచ్చి వ్యవసాయం చేస్తున్నామని ఈ వర్షాల దెబ్బకు పంటలు తడిసిపోయి పెట్టిన పెట్టుబడి వస్తుందో లేదో కూడా తెలియడం లేదని వాపోతున్నారు. వర్షాలకు ధాన్యం చాలా మేర తడిచిపోయింది. రోడ్ల పక్కన ఖాళీ స్థలాలు, ప్రైవేట్ వెంచర్లల్లో రైతులు ధాన్యాన్ని పట్టాలపై ఆరబెడుతున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి ధాన్యాన్ని కాపాడుకుంటానికి రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. రాత్రి, పగలు ఇక్కడే ఉంటున్నామని, ధాన్యం కొనుగోలు చేయడంతో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు.

నిల్వ చేసేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపో వడంతో రైతులు తమవద్ద ఉన్న ధాన్యాన్ని మిల్లర్లు నిర్ణయించిన ధరకే అమ్ముకుంటున్నారు. ఇంతగా రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం మాత్రం ఇంకా రైతులకు తాము ఏదో మేలు చేస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని రైతులు చెబుతున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం అమ్ముకునేందుకు చుక్కలు కనబడుతున్నాయని రైతులు అంటూన్నారు. రైతులు పంటలకు ఈక్రాప్ చేసిన సకాలంలో పంటను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదేమని అడిగితే రకరకాల కారణాలు చెపుతున్నారని పేర్కొన్నారు.


అన్నదాత కష్టం అధికారులు అనాలోచిత నిర్ణయాల కారణంగా నీటిలో కొట్టుకుపోతుంది. కృష్ణ, ఎన్​టీఆర్ జిల్లాలోని గన్నవరం, పామర్రు, తొట్లవల్లూరు, జి కొండూరు, మైలవరం, నందిగామ ప్రాంతాల్లో పంట నష్టం ఎక్కవ జరిగి ఉంటుందని రైతు సంఘాల నేతలు భావిస్తున్నారు. వాతావరణ మార్పులతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆరబెట్టిన ధాన్యం తడిసి మొలకలొస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంటలను సకాలంలో కొనుగోలు చేయదు. తాము బయట వ్యాపారులకు విక్రయించాలనుకుంటే ఆ అవకాశం లేకుండా చేస్తోందని రైతులు తెలిపారు. పంటలను పండించేందుకు ఎంత ఇబ్బందులు పడ్డామో నేడు ఆ పంటను వర్షం నుంచి కాపాడుకుంటూ ఆ పంటలను అమ్ముకోవాలంటే కూడా అంతే ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు చెప్పారు.


ఒకవైపు అకాల వర్షాలు రైతులను ఇబ్బందులు పెడుతుంటే మరోక వైపు పంటలకు మద్దతు ధర లేకపోవడం రైతులను ఆర్ధికంగా కుంగతీస్తోంది. వడ్డీలకు అప్పులు తీసుకువచ్చి వ్యవసాయం చేశామని ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి తడిసిన పంటలను కొనుగోలు చేయాలని, అలాగే అన్ని పంటలకు మద్దతు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

"10 ఎకరాల మొక్కజొన్న వేశాను. పెట్టుబడి చాలా అయ్యింది. అకాల వర్షాల కారణంగా బేరగాళ్లు ధర తగ్గించి వేశారు. ప్రభుత్వం స్పందించి మద్దతు ధర కల్పిస్తే ఒడ్డున పడతాం. లేకపోతే రైతులందరరం చాలా ఇబ్బంది పడతాం. మందు తాగాల్సిందే."- రైతులు

ఇవీ చదవండి

Last Updated : May 5, 2023, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.