'దళితుల సంక్షేమం దారి మళ్లించారు.. కొత్త పథకాల ఊసే మరిచారు'

author img

By

Published : Mar 17, 2023, 5:58 PM IST

Etv Bharat

Dalit Bahujan Labour Union : రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో దళిత, ఆదివాసీలకు మొండి చేయి చూపారని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిట్టిబాబు మాట్లాడుతూ... వార్షిక బడ్జెట్ లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాల్సి ఉన్నా ఆ మేరకు కేటాయింపులు చేయలేదని తెలిపారు.

Dalit Bahujan Labour Union: రాష్ట్ర వార్షిక బడ్జెట్​లో దళిత, ఆదివాసీలకు మొండి చేయి చూపారని దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో చిట్టిబాబు మాట్లాడుతూ... వార్షిక బడ్జెట్​లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు కేటాయించాల్సి ఉన్నా.. ఆ మేరకు కేటాయింపులు చేయలేదని తెలిపారు. కేటాయించిన నామమాత్రపు నిధులను ఇతర సంక్షేమ పథకాలకు మళ్లిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం కేటాయించిన నిధుల్లో కూడా అత్యధికంగా సాధారణ పథకాలకు 11వేల పైచిలుకు కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు.

ప్రత్యేక నిధులు, పథకాలేవీ... ఐసీడీఎస్, ఉపాధి హామీ, పెన్షన్, పెళ్లి కానుక, సమగ్ర శిక్షా అభియాన్ వంటి సాధారణ పథకాలతో పాటు నవరత్నాలకు ఎస్సీ ఎస్టీ కంపోనెంట్ నిధులను మళ్లించారు తప్ప.. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక నిధులు, పథకాలు బడ్జెట్లో ప్రవేశ పెట్టకపోవడం విచారకరమన్నారు. అత్యాచారాల నిరోధక చట్టం సమర్థవంతమైన అమలుకు తగిన నిధులను కేటాయించలేదన్నారు. సబ్ ప్లాన్ అమలు కోసం ఉన్న నోడల్ ఏజెన్సీకి బడ్జెట్లో ఈసారి కేటాయింపులు తగ్గించారన్నారు. ఎస్సీ కార్పొరేషన్​లో నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా సబ్ ప్లాన్ నిధులను ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి సక్రమంగా ఖర్చు చేసేలా చూడాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ రూ.2,79,279 అంచనాలతో ప్రవేశపెట్టారు. అందులో అభివృద్ధి, సంక్షేమ వినియోగానికి రూ.1,59,729 కోట్లు కేటాయించినట్లుగా చూపించారు. సంక్షేమం, అభివృద్ధిని ఆయా కేటాయింపుల ఆధారంగానే పరిగణించాలి. ఎస్సీ, ఎస్టీ జనాభా, సబ్ ప్లాన్ నిర్దేశించిన విధంగా 16.4శాతం నిధులు కేటాయించాలి. ఐసీడీఎస్, సమగ్ర శిశు అభియాన్ పథకానికి, ఉపాధి హామీ, నవరత్నాల పథకాలకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను మళ్లించారే తప్ప.. దళితులకు ఉపయోగపడే కొత్త పథకం ప్రవేశ పెట్టలేదు. వీటితో పాటు దళిత, ఆదివాసీలు చదువుకునేందుకు ఉపయోగపడే జగనన్న విద్యాదీవెన, విద్యావసతి.. ఆయా వర్గాలకు చెందిన పీజీ విద్యార్థులకు వర్తింపజేయక పోవడం దారుణం. కేటాయించిన నిధులతో ప్రభుత్వం ఏం చేస్తుందో సమాధానం ఇవ్వాలి. దళిత, సుస్థిర అభివృద్ధిపై ప్రభుత్వం అంకెల గారడీ చేస్తున్నది. ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా బడ్జెట్ ను సవరించాలి. ఎస్సీ కార్పొరేషన్లకు కేటాయింపులు చేయాలి. ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలను నిరోధించాలి. సబ్ ప్లాన్ నిధులను ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి సక్రమంగా ఖర్చు చేసేలా చూడాలి. -చిట్టిబాబు, దళిత, బహుజన, శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.