Cow Celebration: శ్రావణ శుక్రవారం వేళ.. గోమాతకు సీమంతం

Cow Celebration: శ్రావణ శుక్రవారం వేళ.. గోమాతకు సీమంతం
Pooja to Cow: నోరు లేని మూగజీవాల పట్ల మనుషులు అమితమైన ప్రేమ చూపిస్తుంటారు. వాటిని ఇంట్లో పెంచుకుంటూ సొంత మనుషుల్లా చూసుకుంటారు. మరికొంతమందైతే.. వాటికి పుట్టినరోజులు లాంటి కార్యక్రమాలు కూడా చేస్తారు. రైతు కుటుంబంలో అయితే ఆవులను సొంత బిడ్డల్లా సాకుతారు. తమకు వ్యవసాయంలో నిత్యం చేదోడుగా ఉండే వాటిపట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తారు. కొన్ని పండుగలకైతే వాటిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. కోనసీమ జిల్లాలో శ్రావణ శుక్రవారం రోజున గర్భంతో ఉన్న ఆవుకు సీమంతం చేసి ముచ్చట తీర్చుకుంది ఓ కుటుంబం.
BABY SHOWER TO COW: మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే చుట్టుపక్కల వారిని, బంధువులను పిలిచి ఆనందంగా జరుపుకుంటాం. అలాగే ఇంట్లో పెంచుకుంటున్న ఆవుకు సీమంతం చేసిన ఓ కుటుంబం అదేవిధంగా అందరినీ పిలిచి శుభకార్యం నిర్వహించింది. మనుషులకు ఎలా సీమంతం చేస్తారో.. అదేవిధంగా చేసింది.
కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం నగరంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా గర్భంతో ఉన్న ఆవుకి వైభవంగా సీమంతం చేసింది త్రిమూర్తులు కుటుంబం. ముత్తాయిదువులతో కలిసి కార్యక్రమాన్ని జరిపించారు. పసుపు కుంకుమలతో, చీర సారేతో హారతులు పట్టారు. అనంతరం పేరంటాళ్లకు తాంబూలాలు అందజేశారు. గోవును పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని.. దేశం సుభిక్షంగా ఉంటుందని త్రిమూర్తులు చెబుతున్నారు.
ఇవీ చదవండి:
