ఆ ఇల్లు... ఓ వైజ్ఞానిక ప్రపంచం.. పురాతన వస్తువులకు కేరాఫ్​

author img

By

Published : Aug 4, 2022, 8:51 PM IST

ANTIQUE

ANTIQUE: ఒక్కొక్కరికి ఒక్కో అభిరుచి ఉండటం సహజం. కానీ ఓ న్యాయవాది మాత్రం.. తన అభిరుచితో ఇల్లునే.. పురాతన వస్తువుల నిలయంగా మార్చేశారు. ప్రపంచ వ్యాప్తంగా చరిత్రకు అద్దం పట్టే ఎన్నో చారిత్రక పురాతన వస్తువులను సేకరించి.. అబ్బుర పరుస్తున్నారు. సుమారు 4 వందల ఏళ్ల క్రితం నాటి వస్తువులు సైతం ఆయన ఇంట్లో ఉన్నాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు

Shekhar's house as Museum: డీ.సీ.శేఖర్​.. వృత్తిరీత్యా న్యాయవాది. అనంతపురం జిల్లా గుంతకల్లులో న్యాయవాద వృత్తిలో ఉన్న శేఖర్​కు.. పురాతన వస్తువుల సేకరణ అంటే చిన్ననాటి నుంచి మక్కువ. ఈ ఇష్టంతోనే అనేక అరుదైన వస్తువులను సేకరించి, తన ఇంటినే ఓ పురాతన వస్తు వైజ్ఞానిక ప్రదర్శనశాలగా మార్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఇల్లు ఓ వైజ్ఞానిక ప్రపంచం. గణితం, భౌతిక, రసాయన శాస్త్రాల ఆధారంగా 400 ఏళ్లనాటి వస్తువులు సైతం ఇక్కడ కనిపిస్తాయి. రెండు వందల ఏళ్లనాటి టెలీ స్కోప్, 1885 నాటి బైనాక్యులర్, వందల ఏళ్లనాటి గ్రామ్‌ఫోన్‌.. ఇలా ఎన్నో అరుదైన అపురూప వస్తువులు ఆ ఇంట్లో ఉన్నాయి. ప్రపంచంలోని తొలి ఫొటో కెమెరా ఇక్కడ చూడవచ్చు.

ప్రపంచంలో తయారైన తొలితరం నాటి టేప్ రికార్డర్, విద్యుత్ అవసరమే లేకుండా వీనుల విందుగా సంగీతం వినిపించే వందల ఏళ్లనాటి గ్రామ్ ఫోన్ ప్లేయర్ శేఖర్ వద్ద ఉంది. దాదాపు 150 ఏళ్లకు పైగా వివిధ దేశాలు తయారు చేసిన గోడగడియారాలు, టేబుల్ గడియారాలు ఈ ఇంట్లో మనం చూడొచ్చు. పూర్వం దేశాలు, పట్టణాలకు సంబంధించిన పటాలు చూడటానికి వినియోగించిన.. 220 ఏళ్లనాటి మ్యాగ్ని ఫై గ్లాస్ పురాతన వస్తువుల సేకరణలో ఆకర్షణగా నిలుస్తోంది. సముద్రాలపై దాదాపు వందల మీటర్ల దూరం చూడగిలిగే అరుదైన అనేక టెలీస్కోప్ లు అక్కడ ఉన్నాయి.

దాదాపు 35 ఏళ్లుగా.. ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి ఈ వస్తువులను సేకరించానని శేఖర్‌ అంటున్నారు. ప్రాచీన వస్తువులను చూడటానికి శేఖర్ ఇంటికి చాలామంది వస్తుంటారు. తీవ్ర పనివత్తిడితో ఉన్నపుడు శేఖర్ ఇంట్లోని ఆ వస్తువులను చూస్తూ వాటి గురించి తెలుసుకుంటే ఊహించని అనుభూతి కలుగుతుందని ఆయన స్నేహితులు చెబుతున్నారు.

ఇంటినే పురాతన వస్తునిలయంగా మార్చిన శేఖర్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.