ETV Bharat / state

ప్రేమంటే ఏమిటంటే..

author img

By

Published : Feb 14, 2023, 7:06 AM IST

Valentines Day 2023: ప్రేమ, ప్రణయం.. పేరేదైనా కలిగే ఫీలింగ్ ఒక్కటే. పేద, ధనిక.. అంతరాలు ఎంతున్నా.. అనుభవం ఒక్కటే. కులం, మతం.. వర్గాలు ఏవైనా స్వభావం ఒక్కటే. ప్రేమించని.. ప్రేమలో పడని మనుషులు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. సృష్టిలో ఏ జీవికి లేని అదృష్టం మనుషులకు ఉంది. నేడు వాలెంటైన్స్ డే. ప్రపంచమంతా ప్రేమికుల దినోత్సవం ఘనంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎవరిని ప్రేమించాలి.. మంచి జీవితం కోసం ఎలాంటి వారికి సెలెక్ట్ చేసుకోవాలి లాంటి కొన్ని అంశాలను మీరూ తెలుసుకోండి..

Love
Love

Valentines Day 2023: ప్రేమ.. ఒక అనిర్వచనీయమైన భావన. చెప్పలేని అనుభూతి. మోయలేని భారం.. రాయలేని కావ్యం. చివరి మజిలీ అంటూ లేని ప్రయాణం. స్నేహంతో ప్రారంభమై.. పెళ్లితో ముగిసిపోయేది కాదు. ఆదిలోనే హంసపాదులు ఎన్ని వచ్చినా ఆగిపోయేది అసలే కాదు. అది నిరంతరం జరిగే ప్రక్రియ. కాలం మారే కొద్ది పెరిగే ఫీలింగ్. కేరింగ్. తల్లిదండ్రుల నుంచి మొదలుకొని జీవిత భాగస్వామి వరకు ప్రతి సందర్భంలోనూ మానవులు దీన్ని ఆస్వాదిస్తారు.

1.Character: మనలో చాలా మంది అందం చూసి ఇష్టపడతారు. అందానికి ఆకర్షితులవటం సాధారణ విషయమే అయినప్పటికీ.. ప్రేమలో ఇది అంత అవసరం లేదు. ఒక వ్యక్తి అందం కాదు... వ్యక్తిత్వం ముఖ్యం. అతను/ఆమె ఎలా ఉన్నారు అనే దానికంటే.. అంతరంగిక సౌందర్యం ముఖ్యం. అదే అవతలి వారిని నిజంగా ఆకర్షితుల్ని చేస్తుంది. శారీరక సౌందర్యం ఒకనాడు సమసిపోతుంది. కానీ నిజమైన వ్యక్తిత్వం ఎప్పటికీ నిలుస్తుంది. కాబట్టి మీరు ప్రేమించే వారిలో అందం కన్నా వ్యక్తిత్వం చూడండి.

2. Dont look for Wallet: చాలా మంది తమ బాయ్ఫ్రెండ్స్ కి బాగా డబ్బులు ఉండాలని కోరుకుంటారు. అలా ఉంటే షాపింగ్ చేయటం, తినటం, బైకు, కార్లపై షికారుకు వెళ్లొచ్చు అని అనుకుంటారు. ఇతరులతో పోల్చుకుంటూ ఇలాంటివి ఆలోచిస్తారు. కానీ నిజానికి అంత డబ్బు అవసరం లేదు. కావాల్సినంత ఉంటే సరిపోతుంది. పైగా అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తే ఆర్థిక కష్టాలు తీరినట్లే. జల్సాలు చేయకున్నా... తను మీ కడుపు నింపాడా లేదా.. అవసరంలో ఆదుకున్నాడా లేదా అన్నది ముఖ్యం. కాబట్టి జేబు నిండా డబ్బు ఉండాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఎలా చూసుకుంటాడో ఆలోచించండి.

3. Priority Matters: మనల్ని ప్రేమించేవారు మనకు ప్రియారిటీ ఇవ్వాలని కోరుకుంటారు. ఎక్కడున్నా ఎందరితో ఉన్నా మీకు గౌరవం, ప్రాముఖ్యం ఇచ్చే వాళ్లను ఎంపిక చేసుకోండి. అలా అని అస్తమానం మీతోనే ఉండమని అడగకూడదు. ఎందుకంటే అది అసాధ్యం. వారి వ్యక్తిగత జీవితం వారికీ ఉంటుంది. కాబట్టి అవసరమైనప్పుడు మీకు ప్రియారిటీ ఇచ్చే వాళ్లను చూసుకోండి.

4. Job: అందరూ ఉద్యోగం ఉన్న వాళ్లనే కోరుకుంటారు. కొందరికి అది ఉండదు కానీ మీరంటే చెప్పలేనంత ఇష్టం. అలా అని వాళ్లను చులకనగా, పనికి రాని వాళ్లలా చూడకండి. ఇలాంటి వాళ్లను వదిలేయకుండా.. మీ వల్ల అయినంత మటుకు సాయం చేసి, అన్ని విధాలా ప్రోత్సహించి ఒక దారికి వచ్చేలా చేయండి. రిలేషన్లోకి వచ్చాకా.. జాబ్ పోయిన సమయంలోనూ కొందరు బ్రేకప్ చెబుతారు. అలా చెయ్యకుండా..వారికి కావాల్సిన సాయం చేయడం, నైతిక మద్ధతు ఇవ్వడం లాంటివి చేయండి.

5. Secure Feeling & Trust: అమ్మాయిలు ప్రేమించాలంటే ఉండాల్సిన లక్షణాల్లో నమ్మకం, భద్రత భావం అనేవి ముఖ్యం. ఈ రెండు వారికి కలిగితే మీ లవ్ ఓకే అయినట్లే. అమ్మాయిలూ.. మీరు సురక్షితంగా ఫీల్ అయిన, మీకు నమ్మకం కలిగిన వారు ప్రపోజ్ చేస్తే వదులుకోకండి. వారి చెయ్యి విడిచిపెట్టకండి. ఎందుకంటే అవి అందరిపై కలగకపోవచ్చు. అబ్బాయిలూ.. మీరూ వీటికి కలిగేలా ప్రవర్తించండి. కష్టకాలంలో వారిని ఆదుకుంటాననే భరోసా కల్పించండి.

ప్రేమ అంటే కేవలం ఇవ్వటం మాత్రమే కాదు.. పొందడం కూడా. పరిశుద్ధ గ్రంథంగా పేరొందిన బైబిల్ లోనూ.. ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ అనే ముఖ్యమైన మూడు విషయాలను గురించి చెబుతూ.. వీటన్నింటిలోకెల్లా ప్రేమే గొప్పది అని రాసి ఉంటుంది. అవసరాల కోసమో, ఆర్థిక లాభాల కోసమో ప్రేమించకండి. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన నేటి కాలంలో.. వాట్సాప్ స్టేటస్ లు, ఇన్ స్టా రీల్స్ చూసి లేదా.. అవి చేసిన వారి ప్రేమలో పడిపోకండి.

ఇవీ చదవండి:

హాయ్..! నా ప్రేమను గెలుచుకోడానికి నన్నే త్యాగం చేశాను..

వాలంటైన్స్​ డే స్పెషల్​.. ఇదే నా మొదటి ప్రేమలేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.