ETV Bharat / state

Two Laborers Died: చర్చి పునర్నిర్మాణ పనులు.. గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి

author img

By

Published : Apr 19, 2023, 8:42 PM IST

Two Labourers Died During The Church Wall Collapse: హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి పునర్నిర్మాణ పనుల్లో గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే చిన రాజప్ప పరామర్శించారు. ఈ ఘటన కాకినాడ జిల్లా సామర్లకోట బలుసుల పేటలో జరిగింది.

Etv Bharat
Etv Bharat

Two Labourers Died During The Church Wall Collapse : కాకినాడ జిల్లా సామర్లకోట బలుసుల పేటలో చర్చి పునర్నిర్మాణ పనుల్లో గోడ కూలి ఇద్దరు కూలీలు మృతి చెందగా మరో కూలి తీవ్రంగా గాయపడ్డారు. హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చి పునర్నిర్మాణంలో భాగంగా చర్చి ముందున్న గోడ కూల్చుతుండగా షెడ్ భీం ఒక్కసారిగా కూలీలపై పడింది. ఈ ప్రమాదంలో పిట్టా అర్జునరావు, మచ్చా నాగేశ్వరరావు, యడగల అబ్రహంలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గాయపడ్డ వారికి సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

పాము కాటుతో మూడేళ్ల బాలుడు మృతి

పరామర్శించిన రాజకీయ నాయకులు : ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పిట్టా అర్జునరావు, మచ్చా నాగేశ్వరరావు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో బలుసుల పేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలను పెద్దాపురం ఎమ్మెల్యే చిన రాజప్ప, వైసీపీ ఇంచార్జ్ దవులూరి దొరబాబు, జనసేన ఇంచార్జ్ తుమ్మల బాబు పరామర్శించారు.

పాము కాటుతో మూడేళ్ల బాలుడు మృతి : శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పాముకాటుతో మూడేళ్ల బాలుడు మృతి చెందాడు. నల్ల చెరువుకు చెందిన సుమిత్ర ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరగా.. ఆమె రెండో కుమారుడిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. భోజనం చేసిన తర్వాత చేతులు కడుక్కునేందుకు కుళాయి వద్దకు వెళ్లిన బాలుడి చేతిపై పాము కాటు వేసింది. చేయివాచి రక్తస్రావం కావటంతో భయాందోళనకు గురైన కుటుంబ సభ్యులు వైద్యుని వద్దకు తీసుకువెళ్లారు. వైద్యులు సాధారణ చికిత్స చేశారు. తర్వాత కొంత సేపటికే నురగలు కక్కుతూ బాలుడు మృతి చెందాడు.

బాలుడు మృతి చెందడానికి వైద్యులు నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాలుడి పరిస్థితి విషమంగా మారుతున్నా వైద్యులు సాధారణ చికిత్సను అందించారని వారు ఆరోపించారు. పూత మందు పూసి తగ్గిపోతుందంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడి చేయి వాపు వస్తోందన్న మాటను పట్టించుకోలేదని విమర్శించారు. బాలుడి తండ్రి కుళాయి పైపులో పామును గుర్తించి వైద్యుడికి చెప్పిన తరువాత కూడా ఆలస్యం చేయడం వల్లే తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలిందని కుటుంబ సభ్యులు వాపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి ఎదుట నిరసన తెలియచేస్తూ వైద్యులు, సిబ్బందిని బయటకు రాకుండా అడ్డుకున్నారు.

నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి : ప్రకాశం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కురిచేడు మండలం బోధనంపాడులో అభంశుభం తెలియని రెండేళ్ల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టిలో పడింది. చుట్టుపక్కల ఎవ్వరూ గమనించకపోవడంతో ఆ చిన్నారి మృతి చెందింది. రెండేళ్లకే పాప మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.