ETV Bharat / state

BJP: ఏడుకొండల వాడితో పెట్టుకున్న వారెవరూ చరిత్రలో బాగు పడలేదు: సునీల్ దియోధర్

author img

By

Published : Apr 19, 2023, 4:39 PM IST

Sunil Deodhar: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న జాతీయ స్ధాయి ప్రతిభా పోటీల కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా పని చేస్తున్నారని వెల్లడించారు. వైసీపీ నేతలు సీబీఐని నిందించడం సరైనది కాదన్నారు. తితిదేలో అన్యమతస్తులను ప్రోత్సహిస్తున్నారని.. గత కొన్ని రోజుల ముందు తితిదే ఇచ్చిన నోటిఫికేషన్​ను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.

Sunil Deodhar
సునీల్ దియోధర్

BJP National Secretary Sunil Deodhar: తప్పు చేసినవారు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదని.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అదే జరుగుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దియోధర్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్న జాతీయ స్ధాయి ప్రతిభా పోటీల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా పని చేస్తున్నారని... వైసీపీ నేతలు సీబీఐని నిందించడం సరైనది కాదన్నారు. ఫ్యాక్షన్ ప్రభుత్వంగా పేరు సంపాదించుకున్న వైసీపీతో బీజేపీ కలిసిందన్న ప్రచారంలో నిజం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్​కు ముఖ్యమంత్రి కావడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యమని ఆయన అన్నారు. తితిదేలో అన్యమతస్తులను ప్రోత్సహిస్తున్నారని.. గత కొన్ని రోజుల ముందు తితిదే ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెనక్కి తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు.

'జగన్‌ ఏపీకి సీఎం కావడం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. తెలుగు భాషను అంతం చేసేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనేక తెలుగు పాఠశాలలు మూశారు. కేవలం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను, క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్​ను ప్రోత్సహిస్తున్నారు. ప్రపంచ ప్రఖ్యాత టీటీడీలో అనేక మార్పులను తీసుకువచ్చారు. తద్వారా ఆలయ పవిత్రను దెబ్బతిసే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో వైసీపీ 175 సీట్లు గెలుచుకుంటుందని అంటున్నారు. ఎవరు గెలుస్తారో అనేది సమయమే నిర్ణయిస్తోందన్నారు. వైసీపీతో కలిసే సమస్యే లేదు. తప్పుచేసిన వారెవరైనా జైలుశిక్ష అనుభవించక తప్పదు. వైఎస్‌ వివేకా హత్య కేసులో అదే జరుగుతోంది. సీబీఐ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారు. వైసీపీ నేతలు సీబీఐని నిందించడం సరైనది కాదు. ఆధారాలు ఉన్నందునే అనుమానితులను అరెస్టు చేస్తున్నారు. వైసీపీతో బీజేపీ కలిసిందన్న ప్రచారంలో నిజం లేదు. ఏడుకొండల వాడితో పెట్టుకున్న వారెవరూ చరిత్రలో బాగుపడలేదు.'- సునీల్ దియోధర్, బీజేపీ జాతీయ కార్యదర్శి

తిరుమలలో కేంద్ర మంత్రి: తిరుమల శ్రీవారిని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ్ జెసింగ్‌భాయ్ చౌహాన్ దర్శించుకున్నారు.ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను చౌహాన్​కు అందజేశారు.

అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడారు. సీబీఐ కేసులపై రిపోర్టర్స అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందించారు. సీబీఐ తన పని తాను చేసుకుంటుందని పేర్కొన్నారు. ఆ విషయంలో మేము తాము ఏం మాట్లాడలేమని తెలిపారు. విచారణ సంస్థలు, కోర్టులు రాజ్యంగానికి లోబడి పనులు చేస్తాయని వెల్లడించారు. 2024లో జరిగే లోక్​సభ ఎన్నికల్లో ఏపీలో 10 నుంచి 12 సీట్లు గెలుస్తామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.