ETV Bharat / state

కాకినాడ టు వైజాగ్.. రెండు గంటల్లో కిడ్నీ తరలింపు

author img

By

Published : Feb 13, 2023, 10:33 PM IST

Kidney transplant : ఒక వ్యక్తి అవయవదానం మరో ఇద్దరికి పునర్జన్మనిచ్చింది. ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కిడ్నీ దానం చేయడానికి అతడి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో ఇది సాధ్యపడింది. కాకినాడ ఆస్పత్రి నుంచి వైజాగ్​లోని మరో ఆస్పత్రికి గ్రీన్ ఛానెల్(ట్రాఫిక్ క్లియరెన్స్) ద్వారా రెండు గంటల్లో కిడ్నీని తరలించారు.

కాకినాడ టు వైజాగ్
కాకినాడ టు వైజాగ్

Kidney transplant : గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రెండు గంటల్లో కాకినాడ అపోలో నుంచి వైజాగ్ కిమ్స్​కి రోడ్డు మార్గం ద్వారా కిడ్నీ తరలించారు. కాకినాడకు చెందిన నరేందర్.. ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయి మృతి చెందాడు. కిడ్నీ తరలింపు సమయంలో సిటీలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిపివేశారు. పోలీసులు దారి మొత్తం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. వైజాగ్ కిమ్స్ లో పేషంట్ కి కిడ్నీ అమర్చడానికి డాక్టర్లు ఏర్పాట్లు చేశారు.

నాగేంద్ర సింగ్(42) ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో కాకినాడ అపోలో ఆస్పత్రిలో చేరాడు. నాగేంద్ర సింగ్ బ్రెయిన్ డెడ్ కావడంతో రెండు కిడ్నీలను ఆమె భార్య సత్యభాయి మరో ఇద్దరికి దానం చేసింది. కాకినాడకు చెందిన వ్యక్తికి అపోలో ఆస్పత్రిలో కిడ్నీ ఇవ్వగా, మరో వ్యక్తికి విశాఖపట్నం కిమ్స్ హాస్పిటల్ కిడ్నీని పంపడం జరిగింది. ఈ విషయాన్ని అపోలో మెడికల్ సూపరింటెండెంట్ డా.చటర్జీ మృతుల కుటుంబాలకు తెలిపారు. విశాఖపట్నం కిడ్నీ తరలించేందుకు పోలీసులు ప్రత్యేక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సహకరించారు. వైద్యుల కృషి, పోలీసుల సహకారంతో ఇరువురికి పునర్జన్మ దక్కింది.

ఇద్దరికి పునర్జన్మ.. కాకినాడ టు వైజాగ్ 2 గంటల్లో కిడ్నీ తరలింపు

మాకు జరిగిన నష్టం పూడ్చలేనిదే. డాక్టర్లు కూడా బతికించేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. బ్రెయిన్ డెడ్ కావడంతో తన వల్ల.. అవయవదానంతో మరో నలుగురు జీవించే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెప్పడంతో అంగీకరించాం. - సత్యబాయి, నాగేంద్రసింగ్ భార్య

హార్ట్, లివర్, లంగ్స్ కూడా ట్రాన్స్ ప్లాంట్ చేయొచ్చు. అది పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటుంది. ఈ పేషెంట్​కు సంబంధించి రెండు కిడ్నీలను సేకరించి వాటిని ఓ మహిళతో పాటు మరో వ్యక్తికి అమర్చేందుకు ఏర్పాట్లు చేశాం. - డా.చటర్జీ, అపోలో మెడికల్ సూపరింటెండెంట్

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.