ETV Bharat / state

ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత శ్రీనివాస్ విడుదల

author img

By

Published : Jan 3, 2023, 1:44 PM IST

Updated : Jan 3, 2023, 2:06 PM IST

Vuyyuru Foundation head Srinivas
ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత శ్రీనివాస్

Vuyyuru Foundation Head Released: గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత శ్రీనివాస్​ను విడుదల చేస్తూ.. ఐదో అదనపు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. 25 వేల రూపాయల స్వయం పూచికత్తుపై విడుదల చేశారు. విచారణకు సహకరించాలని సూచించారు

Vuyyuru Foundation Head Released: గుంటూరులో తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత శ్రీనివాస్‌కు ఉపశమనం లభించింది. స్వయం పూచికత్తుపై విడుదల చేస్తూ.. ఐదో అదనపు న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు. పోలీసులు పెట్టిన 304(2) సెక్షన్.. ఆయనకు వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. విచారణకు సహకరించాలని సూచించారు. అంతకుముందు శ్రీనివాస్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. జీజీహెచ్​లో వైద్యచికిత్స అనంతరం ఐదో అడిషనల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఇంటి వద్ద ప్రవేశపెట్టారు. ఘటనను రాజకీయం చేయాలని వైసీపీ నాయకులు ప్రయత్నించినా చివరకు ధర్మం, న్యాయమే గెలించిందని టీడీపీ నేతలు అన్నారు.

స్వయం పూచికత్తుపై విడుదల చేస్తూ ఆదేశాలు జారీచేసిన న్యాయమూర్తి

"జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. అలా జరిగి ఉండాల్సింది కాదు. అది ఎవరి తప్పిదం అని ఇక్కడ ప్రస్తావించే కంటే.. భవిష్యత్తులో జరగబోయే ఎటువంటి కార్యక్రమాలలో కూడా తప్పిదాలు జరగకుండా చూసుకుంటాను. ముందు జాగ్రత్తలు తీసుకుంటాను". - శ్రీనివాస్, ఉయ్యూరు ఫౌండేషన్ అధినేత

"జనవరిలో జగన్మోహన్​రెడ్డి అంటే ఏంటో చూపిస్తామని జగనన్న సైన్యం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉంటే.. పోలీసులు ఏం చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ ఏం చేస్తోంది. ఏదో ఒక విధంగా నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి.. రిమాండ్ చేయాలనే దురుద్దేశంతో.. పెద్ద ఎత్తున ఏదో రౌడీని అరెస్టు చేసినట్టు ఈ కార్యక్రమాలన్నీ నడిచాయి. ఏది ఏమైనప్పటికీ.. న్యాయం కాపాడబడింది". - దేవినేని ఉమా, మాజీమంత్రి

ఇవీ చదవండి:

Last Updated :Jan 3, 2023, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.