ETV Bharat / state

సంగం డైయిరీని ఎప్పటికైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది: మంత్రి అప్పలరాజు

author img

By

Published : Dec 15, 2022, 12:02 PM IST

Updated : Dec 15, 2022, 2:07 PM IST

అప్పలరాజు
appalaraju

Veterinary Hospital Built 86 Lakh Rupees: గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో 86 లక్షల రూపాయలతో నిర్మించిన పశు వైద్యశాలను ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్యతో కలసి మంత్రి అప్పలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రైతులు ఎంతో నిబద్దతగా వ్యవసాయం చేస్తున్నారని, రైతులకు వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం కావాలంటే పాడి పరిశ్రమ శాఖ సహాయం ఎంతో అవసరం అన్నారు.

సంగం డెయిరీని ఏనాటికైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తీరుతుందని.. మంత్రి సీదిరి అప్పలరాజు తేల్చిచెప్పారు. ప్రజల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన గుంటూరు మిల్క్ యూనిట్‌ను అక్రమంగా ప్రైవేటు పరం చేసుకున్నారని ఆరోపించారు. గుంటూరు జిల్లా పొన్నూరులో నిర్మించిన పశువైద్యశాలను స్థానిక ఎమ్మెల్యే కిలారి వెంకటరోశయ్య, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌తో కలిసి మంత్రి అప్పలరాజు ప్రారంభించారు. గత ప్రభుత్వంలో పాడిపరిశ్రమశాఖ అవినీతిమయంగా మారిందని మంత్రి ఆరోపణలు చేశారు.

గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో 86 లక్షల రూపాయలతో నిర్మించిన పశు వైద్యశాలను మంత్రి అప్పలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాల వెల్లువ పథకం మొదలు పెట్టిన తర్వాత పాడి పరిశ్రమలోనూ, రైతులలోనూ చాలా మార్పులు వచ్చాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి 1000 పశువులకు ఒక అసిస్టెంటును, నియోజకవర్గానికి రెండు పశువుల ఆంబులెన్సులను ఏర్పాటు చేశారన్నారు. అమూల్ డెయిరీ ప్రైవేట్ కంపెనీ కాదని, అదొక కోఆపరేటివ్ వ్యవస్థ అన్నారు. అమూల్ సంస్థలో పాలు పోసే ప్రతి ఒక్కరు వాటాదారులేనన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో సొసైటీ ఆస్తులు ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టారని రాష్ట్రంలో రామన్న కాలంలో 3600 మిల్క్ చిల్లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.

ఇవీ చదవండి

Last Updated :Dec 15, 2022, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.