ETV Bharat / state

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గాదె వెంకటేశ్వరరావు నామినేషన్

author img

By

Published : Feb 23, 2021, 4:33 PM IST

Krishna and Guntur teacher mlc nominations
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గాదె వెంకటేశ్వరరావు.. గుంటూరు కలెక్టరేట్​లో నామినేషన్ సమర్పించారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి పార్టీ కట్టుబడి ఉంటుందని పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ పేర్కొన్నారు.

కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గాదె వెంకటేశ్వరరావుకు జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు పార్టీ పీఏసీ సభ్యులు బోనబోయిన శ్రీనివాస్ తెలిపారు. నామినేషన్​కు చివరిరోజు గుంటూరు కలెక్టరేట్​లో వెంకటేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని బోనబోయిన శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పార్టీని గురువులు ఆశీర్వదించాలని కోరారు.

ఇదీ చూడండి: వృద్ధురాలన్న కనికరం లేదు... బస్సులో నుంచి దించేసిన సిబ్బంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.