ETV Bharat / state

TDP Protests Against Chandrababu Arrest: కొనసాగుతున్న ఆగ్రహజ్వాలలు.. విడుదల చేసే వరకూ విశ్రమించబోమంటున్న టీడీపీ నేతలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2023, 8:37 AM IST

Updated : Oct 9, 2023, 11:22 AM IST

TDP Protests Against Chandrababu Arrest: రాష్ట్రవ్యాప్తంగా చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తమ అధినేతపై ఎన్ని అక్రమ కేసులు బనాయించినా.. చంద్రబాబును విడుదల చేసే వరకూ విశ్రమించబోమని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

tdp_protests
tdp_protests

TDP Protests Against Chandrababu Arrest: కొనసాగుతున్న ఆగ్రహజ్వాలలు.. విడుదల చేసే వరకూ విశ్రమించబోమంటున్న టీడీపీ నేతలు
TDP Protests Against Chandrababu Arrest: చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం జగన్‌ రాక్షస పాలన సాగిస్తూ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై కక్షపూరితంగా కేసులు పెట్టారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. మచ్చలేని నాయకుడిగా చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అధినేత అరెస్టును ఖండిస్తూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు దీక్షలు, ప్రత్యేక పూజలు, కాగడాల ర్యాలీలను కొనసాగించారు.

Why AP does not Needs Jagan: ఇన్ని ఘోరాలు చేసి.. మళ్లీ ఓటు ఎలా అడుగుతావు జగనన్నా..?

అనంతపురం జిల్లా రాయదుర్గంలో చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు వెంటనే విడుదల కావాలని కోరుతూ గుంతకల్లులో మారెమ్మ ఆలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి జిల్లా కదిరిలో దీక్షలకు పకీర్లు సంఘీభావం తెలిపారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్‌ జిల్లా కామనూరులో ర్యాలీగా వెళ్లి కుందూ నదిలో దీక్ష చేపట్టారు. కర్నూలు జిల్లా ఆస్పరిలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. నంద్యాలలో దీక్షా శిబిరాన్ని శాలివాహన సంఘ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. డోన్‌లో టీడీపీ కార్యకర్తలు గుంజీళ్లు తీసి నిరసన వ్యక్తం చేశారు. జనసేన నాయకులు బైక్‌లపై ర్యాలీగా శిబిరానికి చేరుకుని సంఘీభావం తెలిపారు. నెల్లూరులో టీడీపీ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు కొనసాగాయి.

TDP Samara Shankharavam Sabha in Bengaluru: జగన్ అవినీతి మరకను చంద్రబాబుకు అంటించే కుట్ర.. వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం : టీడీపీ

పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో దీక్షల్లో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. టీడీపీ కార్యకర్తలు మోకాళ్లపై నిలబడి, అర్ధనగ్నంగా నిరసన తెలియజేయగా.. జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరంలో దీక్షా శిబిరాన్ని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సందర్శించి సంఘీభావం తెలిపారు. కృష్ణాజిల్లా పమిడిముక్కల మండలం మంటాడలో దీక్షా శిబిరాన్ని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ సందర్శించారు. అవనిగడ్డలో చేపట్టిన దీక్షల్లో భావదేవరపల్లి, సంగమేశ్వరం, కమ్మనమోల గ్రామాల టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. గన్నవరం, పెదప్రోలులో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు.

TDP Leader Devineni Uma On Krishna Basin Water: "రాష్ట్ర రైతుల హక్కులను తాకట్టు పెట్టారు.. రాయలసీమను ఎడారిలా మారుస్తున్నారు"

చంద్రబాబు విడుదల కావాలని కోరుతూ ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆలయాలు, చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం చింతపల్లిలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన శ్రేణులు కాగడాల ర్యాలీ చేపట్టాయి. విశాఖలో తెలుగు మహిళలు వైసీపీ నేతల మాస్కులు ధరించి వారు చేసిన అవినీతిని గురించి వివరిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా రాజాంలో దీక్షల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో టీడీపీ నేత కూన రవికుమార్‌ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగించారు. మండలానికి చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందగా శిబిరంలో వారికి నివాళులర్పించారు.

Last Updated :Oct 9, 2023, 11:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.