ETV Bharat / state

ZPTC SARADA: 'రాష్ట్రం రావణకాష్టంలా మారినా సీఎం స్పందించరా?'

author img

By

Published : Sep 21, 2021, 2:07 PM IST

Updated : Sep 21, 2021, 5:23 PM IST

గుంటూరు జిల్లాలో మాజీ జడ్పీటీసీ శారద(ZPTC SARADA NEWS) ఇంటిపై వైకాపా నేతల దాడిని తెదేపా నేతలు ఖండించారు. భాదిత కుంటుంబాన్ని తెదేపా నేతలు ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla Narendra), నక్కా ఆనందబాబు(Nakka Anandababu), తెనాలి శ్రావణ్ కుమార్(Tenali Shravan Kumar) పరామర్శించారు. గణేశ్ నిమజ్జనం ముసుగులో వైకాపా నేతలు దాడులకు పాల్పడ్డారని తెదేపా నేతలు విమర్శించారు. రాష్ట్రమంతా రావణకాష్టంలా మారినా సీఎం స్పందించరా? అని నిలదీశారు.

tdp leaders
tdp leaders

రాష్ట్రం రావణకాష్టంలా మారినా సీఎం స్పందించరా?

గుంటూరు జిల్లా కొప్పర్రులో మాజీ జడ్పీటీసీ శారద (ZPTC SARADA NEWS) ఇంటిపై వైకాపా నేతల దాడి(attack on ex zptc saradha house)ని తెలుగుదేశం నేతలు(tdp leaders) ఖండించారు. కొప్పర్రులో పర్యటించిన ధూళిపాళ్ల నరేంద్ర(Dhulipalla Narendra), నక్కా ఆనందబాబు, తెనాలి శ్రావణ్ కుమార్(Tenali Shravan Kumar).. శారద కుటుంబాన్ని పరామర్శించారు. దాడి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గణేశ్ నిమజ్జనం ముసుగులో వైకాపా నేతలు దాడులకు పాల్పడ్డారని తెదేపా నేతలు విమర్శించారు. దాడి ఘటనలో పోలీసుల పాత్ర కూడా ఉందని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రమంతా రావణకాష్టంలా మారినా సీఎం స్పందించరా? అని నిలదీశారు. వినాయక నిమజ్జనంలో రాత్రి వైకాపా, తెదేపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.

కొప్పర్రులో తెదేపా ఇంటిపై వైకాపా నేతల దాడి పోలీసుల వైఫల్యమేనని నక్కా ఆనంద్ బాబు(Nakka Anandababu) మండిపడ్డారు. నాలుగు సంవత్సరాలుగా వినాయక నిమజ్జనం సందర్భంగా గొడవలు జరుగుతున్నాయని.. అయినా పోలీసు సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని విమర్శించారు. దీన్ని వదిలే ప్రసక్తే లేదని.. రాబోయే రోజుల్లో బదులిస్తామని ఆనందబాబు హెచ్చరించారు.

‘‘కొప్పర్రులో పోలీసులు వైఫలం కన్పిస్తోంది. ఈ దాడి ఘటనకు పోలీసులదే బాధ్యత. దాడి జరిగే అవకాశం ఉందని పోలీసులకు ముందే చెప్పినా పట్టించుకోలేదు. అర్థరాత్రి వరకూ ఊరేగింపు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు. స్థానిక వైకాపా నేతలకు పోలీసులు వత్తాసు పలికారు. భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. దాడి ఘటన బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’.శారద, వేణు దంపతులకు తెదేపా అండగా ఉంటుంది". -ధూళిపాళ్ల నరేంద్ర , తెదేపా సీనియర్‌ నేత

పోలీసులు ఉండేది ప్రజలను రక్షించాడానికా లేక దగ్గర ఉండి దాడులు చేయించటానికా అని తెనాలి శ్రావణ్ కుమార్(Tenali Shravan Kumar) ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాడులు, అరాచకాలతో వైకాపా ప్రభుత్వం పాలన చేస్తోందని మండిపడ్డారు. ఈ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని అన్నారు. జెండా ఉంది కాబట్టే దాడి జరిగిందని పోలీసులు చెప్పటం సరికాదని శ్రావణ్ కుమార్ చెప్పారు.

ఇదీ చదవండి

ATTACK : మాజీ జడ్పీటీసీ ఇంటిపై దాడి... ఆరు ద్విచక్రవాహనాలు దగ్ధం

Last Updated :Sep 21, 2021, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.