ETV Bharat / state

Statewide Protest Against Chandrababu arrest రాష్ట్రవ్యాప్తంగా ఉధృతరూపం దాల్చుతున్న నిరసనలు.. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఊరువాడ ఆందోళనలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 9:20 PM IST

TDP Leaders protest against Chandrababu arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయి. 11వ రోజు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలలో భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. బాబు కోసం మేము సైతం అంటూ నినదించారు. సీఎం జగన్‌, చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొలేక అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపారని నేతలు మండిపడ్డారు. అధినేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

TDP Leaders protest against Chandrababu arrest
TDP Leaders protest against Chandrababu arrest

TDP Leaders protest against Chandrababu arrest: చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసనగా గుంటూరు పశ్చిమలో బీసీల ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఎటువంటి ఆధారాలు లేకపోయిన చంద్రబాబుపై కక్షపూరితంగా కేసులు పెట్టి జైలులు పంపారని టీడీపీ నేత కొల్లు రవీంద్ర మండిపడ్డారు. పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్ష దీక్ష 8వ రోజుకు చేరింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 11వ రోజూ దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షకు టీడీపీ నేత శ్రీరాం రాజగోపాల్ మద్దతు తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ నిరసన దీక్షలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎటువంటి అవినీతి జరగలేదని అయ్యన్న అన్నారు. చంద్రబాబును జైలుకు పంపడమే లక్ష్యంగా తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరులో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఎనిమిదోరోజు... ఎస్పీ, ఎస్టీ, బీసీ కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. రిలే నిరాహారదీక్షకు ఎంఆర్పీఎస్ నేతలు మద్దతు ప్రకటించారు. రాష్ట్రానికి, దేశానికి దిక్సూచి లాంటి వ్యక్తిని జైల్లో పెట్టి వేధిస్తున్నారని టీడీపీ నేత శ్రీనివాసులురెడ్డి మండిపడ్డారు. ప్రకాష్ నగర్ లో బీసీ సంఘం నాయకులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలలో శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. జమ్మలమడుగు పాతబస్టాండ్ లో చేపట్టిన దీక్షలో రైతులు పాల్గొన్నారు.


Thousands of women support Chandrababu in Anantapur హిందూపురంలో నారీ భేరీ.. బాబు అరెస్టుకు వ్యతిరేకంగా హిందూపురంలో పెద్దఎత్తున మహిళల నిరసన ర్యాలీ

చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ చిత్తూరులో రైతులు నిరాహార దీక్ష నిర్వహించారు. వ్యవసాయాభివృద్ధికి కృషి చేసిన దీక్షా దత్తుడిని జైలు పాలు చేయడం తగదని ముక్తకంఠంతో నినదించారు. తిరుపతి నగరపాలక కార్యాలయం ముందు నిర్వహిస్తున్న దీక్షా శిబిరంలో వినాయక విగ్రహం వద్ద బైఠాయించి.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో టీడీపీ బీసీ విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అధినేతను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

TDP Agitations on CBN Arrest in AP: 'సైకో హటావో.. సైకిల్ బచావో'.. నినాదాలతో హోరెత్తించిన టీడీపీ శ్రేణులు..

చంద్రబాబు అక్రమ కేసులను వ్యతిరేకిస్తూ విశాఖ ఆర్​కే బీచ్‌లో దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి గండి బాబ్జి ఆధ్వర్యంలో జలదీక్ష చేశారు. సముద్ర నీళ్లలో నిలబడి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమలాపురం, పి.గన్నవరంలో తెలుగుదేశం రైతు విభాగం, బీసీ సెల్ విభాగం, కోనసీమ రైతు పరిరక్షణ సమితి ప్రతినిధులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. పార్వతీపురం జిల్లా కురుపాం టీడీపీ కార్యాలయం వద్ద తెలుగు రైతు విభాగం ఆధ్వర్యంలో.. చేపట్టిన దీక్షలో పాల్గొన్న నేతలు.. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని, న్యాయం గెలవాలని ఆకాంక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం వెంకంపేట కూడలి వద్ద టీడీపీ, జనసేన చేపట్టిన దీక్షలో కొనసాగుతున్నాయి. దీక్షలో భారీగా పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేస్తున్న రిలే దీక్షలకు భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలివచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కొలేక ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైలులో పెట్టారని శేషారావు ఆరోపించారు.

అనంతపురం జిల్లా ఉరవకొండలో ముస్లిం మైనారిటీ నాయకులు 8వ రోజు రిలే నిరహార దీక్ష చేపట్టారు. సైకో పోవాలి- సైకిల్‌ రావాలంటూ నినాదాలు చేశారు. నంద్యాలలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జి భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ఎనిమిదో రోజు రిలే నిరాహారదీక్ష చేశారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలంటూ కర్నూలు జిల్లా ఆదోనిలో టీడీపీ శ్రేణులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఎమ్మిగనూరులో చేపట్టిన రిలే నిరాహారదీక్షలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్నూలులో జరుగుతున్న రిలే దీక్షలు భారీగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ సంయుక్తంగా రిలే నిరాహార దీక్షలు జరిగాయి. దీక్షకు మాజీ ఎమ్మెల్యేలు రమణమూర్తి, లక్ష్మణరావు సంఘీభావం తెలిపారు. నెల్లూరు గ్రామీణంలో యువత అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. నెల్లూరు, సర్వేపల్లి, కందుకూరు, కావలి ఆత్మకూరులో పెద్దఎత్తున నిరసనలు కొనసాగుతున్నాయి.

TDP Leader Dhulipalla Narendra on Fiber Grid జగన్ అవినీతిలో స్కిల్ మాస్టర్: ధూళిపాళ నరేంద్ర

TDP Leaders protest against Chandrababu arrest: చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కొనసాగుతున్న ఆందోళనలు...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.