ETV Bharat / state

పొన్నవోలును అరెస్టు చేసి జైల్లో పెట్టాలి - సజ్జలకు ఓటర్ వెరిఫికేషన్​, సైబర్ క్రైమ్​కు తేడా తెలియదు : టీడీపీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2023, 7:47 PM IST

TDP Leaders Comments on Sajjala Ramakrishna Reddy
TDP Leaders Comments on Sajjala Ramakrishna Reddy

TDP Leaders Comments on Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదు చేయాలని తెలుగుదేశం నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో వీరు న్యాయమూర్తులపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యవహారశైలి న్యాయవాద వృత్తికే కళంకమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు.

TDP Leaders Comments on Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిలపై కోర్టు ధిక్కరణ కేసులు నమోదు చేయాలని తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. వీరు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన వ్యవహారంలో న్యాయమూర్తులపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. న్యాయమూర్తిని తప్పుబట్టి మాట్లాడిన పొన్నవోలును అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని అన్నారు. తాను న్యాయస్థానాలపై ఏం వ్యాఖ్యలు చేయకపోయినా తనకు నోటీసులు జారీ చేశారని బుచ్చయ గుర్తుచేశారు. ఇప్పుడు అధికార పక్ష నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీస్ రాజ్యం ఇకపై చెల్లదని.. అధికారుల ధోరణి మారడం లేదని... తన వెంట్రుక కూడా పీకలేరని బుచ్చయ్య వ్యాఖ్యానించారు. జైల్లో పెట్టినా... అధికారంలోకి రాగల శక్తి తెలుగుదేశం పార్టీకి ఉందని అన్నారు.

ఒకే ఇంట్లో ఒక్కరికే పింఛన్‌ నిర్ణయంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యవహారశైలి న్యాయవాద వృత్తికే కళంకమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. ఏ అడ్వకేట్ జనరల్ కూడా ఇంత బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి న్యాయస్థానాన్ని నిందించలేదని మండిపడ్డారు. తనకీ పదవిచ్చిన జగన్ కళ్లల్లో ఆనందం చూడాలని పొన్నవోలు తన పరిధి దాటి మాట్లాడుతున్నారని వర్ల ఆక్షేపించారు. తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తులను ఏకవచనంతో సంబోధించడం పొన్నవోలు అహంకారానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేశారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి కరడు కట్టిన వైసీపీ నేతలా ప్రవర్తిస్తున్నాడని విమర్శలు గుప్పించారు. జగన్ కళ్లలో ఆనందం కోసం ఎమైనా చేస్తాడని విమర్శించారు. అలా అయితే రాజీనామా చేసి వైసీపీ తరుఫున పోటి చేయాలని ఎద్దేవా చేశారు. ప్రజల జీతంతో వైసీపీకి సేవ చేస్తున్నాడని విమర్శించారు. పొన్నవోలు టార్గెట్ చంద్రబాబు కేసు కాదని, చంద్రబాబును వేధించి జగన్​ ను సంతోషపరచడమే అని ఆరోపించారు.

'ఉచిత ఇసుక పాలసీ చట్ట విరుద్ధం ఎలా అవుతుంది?' హైకోర్టులో వాదనలు - విచారణ వాయిదా

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీఆర్ విరుచుకుపడ్డారు. సజ్జలకు ఓటర్ వెరిఫికేషన్​కూ.. సైబర్ క్రైమ్​కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. సజ్జల ప్రెస్​మీట్​లో చేసిన వ్యాఖ్యలను బీసీఆర్ ఖండించారు. ఈ మేరకూ.. రాజంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన టీడీపీ మేనిఫెస్టో, భవిష్యత్తుకు బాబు గ్యారెంటీ అనే పథకం కింద ఇంటింటికి షూరిటీ బాండ్ల నివ్వడం నేరమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ సలహాదారుసజ్జల పై ఘాటైనా పదజాలం తో విమర్శించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్ వెరిఫికేషన్ చేయడం, టీడీపీ మేనిఫెస్టోను ప్రచారం చేయడం సైబర్ నేరం కిందికి వస్తుందా అని బీసీఆర్ ప్రశ్నించారు.

చంద్రబాబు మధ్యంతర బెయిల్​ షరతులపై వాదనలు పూర్తి, తీర్పు రేపటికి వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.