ETV Bharat / state

పీకల మీదకు రాగానే ముఖ్యమంత్రి దిల్లీ వెళ్తారు : టీడీపీ

author img

By

Published : Mar 18, 2023, 11:30 AM IST

Tdp Leaders Protest
టీడీపీ నేతల నిరసన

TDP Leaders On Cm Jagan : ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి దిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్లారో ప్రకటించాలని తెలుగుదేశం నేతలు డిమాండ్​ చేశారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి దిల్లీకి వెళ్లటం వల్ల రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేకూరిందో తెలియజేయాలని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి దిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్​ చేసిన టీడీపీ

Cm Jagan Delhi Tour : సీఎం జగన్ దిల్లీ పర్యటన వివరాలను బహిర్గతం చేయాలని తెలుగుదేశం శాసనసభ పక్షం నిరసన వ్యక్తం చేసింది. దిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఏం సాధించుకుని వచ్చారంటూ.. సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. పోలవరానికి ఎన్ని నిధులు తీసుకువచ్చారంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. ప్రత్యేక హోదా తెచ్చారా అంటూ నినాదాలు చేశారు. వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ ఏమైందని నిలదీశారు. అప్పర్ భద్రను నిలువరించారా, విశాఖకు రైల్వేజోన్ తీసుకువచ్చారా అంటూ.. తెలుగుదేశం నేతలు కాలినడకన అసెంబ్లీకి బయల్దేరారు.

బాబాయ్ హత్య కేసులో సీబీఐ అడుగు ముందుకు వేసినప్పుడు ముఖ్యమంత్రి జగన్​ మోహన్​ రెడ్డికి దిల్లీ గుర్తుకొస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. కేసులు మాఫీ చేయించుకోవాలని సీఎం దిల్లీ వెళ్లారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్​మోహన్ రెడ్డి 18సార్లు దిల్లీ వెళ్లారని వివరించారు. ఈ 18 సార్లలో 31రోజుల పాటు దిల్లీలో ఉన్నారన్నారు. అన్నిసార్లు దిల్లీ ఎందుకు వెళ్లారో ప్రజలెవ్వరికీ తెలియదని అన్నారు. ఈరోజు శాసనసభలో దిల్లీ పర్యటన వివరాలు చెప్పితీరాలని డిమాండ్​ చేశారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే ఆదరాబాదరాగా దిల్లీ ఎందుకు వెళ్లారో ముఖ్యమంత్రి ప్రకటించాలని అచ్చెనాయుడు డిమాండ్​ చేశారు.

"18 సార్లు దిల్లీ వెళ్లిన.. ఎందుకు వెళ్తున్నారో తెలియదు. ఏ సమస్య ప్రస్తావిస్తారో తెలియదు. అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి. అదివారం కూడా అసెంబ్లీని పెట్టిన బీజీ ముఖ్యమంత్రి.. నిన్న దిల్లీకి అర్జెంటుగా ఎందుకు బయల్దేరి వెళ్లారు. దిల్లీకి వెళ్లి రాష్ట్రానికి ఏం సాధించారు. బాబాయ్​ హత్య కేసులో, తనపై ఉన్న కేసులలో సీబీఐ ఒక అడుగు ముందుకు వేస్తే ముఖ్యమంత్రికి దిల్లీ గుర్తుకు వస్తుంది."-అచ్చెన్నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు

అధికారమదం, అహంకారంతో ప్రజల్ని చిన్న చూపు చూస్తే, తిరుగుబాటు ఎలా ఉంటుందో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూపించారని టీడీపీ నేతలు స్పష్టంచేశారు. ఈ ప్రభుత్వం ఇక పనికిరాదనే అభిప్రాయానికి ప్రజలు వచ్చేశారని అన్నారు. రాష్ట్రాభివృద్ధి మళ్లీ తెలుగుదేశంతోనే సాధ్యమనే నమ్మకంతో ప్రజలు ఉన్నారని తెలిపారు. అడ్డగోలు హామీలతో మోసగించిన విధానానికి పట్టభద్రులు గట్టిగా బుద్ధి చెప్పారని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ప్రజలు ఇచ్చిన ఒక్క అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేసుకున్నారని.. ఈ అంశాన్ని తాజా ఫలితాలు చెప్తున్నాయని వ్యాఖ్యానించారు. వైసీపీకి గుణపాఠం చెప్పాలనే కసి స్పష్టంగా కనిపించిందన్నారు. 3 ప్రాంతాల్లోనూ ప్రభుత్వం పట్ల ప్రజాభిప్రాయం ఒకేలా ఉంది అనటానికి తాజా ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు.

"ముఖ్యమంత్రి పీకల మీదకి వచ్చే సరికి దిల్లీ వెళ్తారు. దిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కోసం, రైల్వే జోన్​ కోసం, పోలవరం ప్రాజెక్టు కోసం, రాష్ట్రాభివృద్ధికి నిధుల కోసం వెళ్లనట్లు చెప్తారు. కానీ, ఆయన వెళ్లేది స్వప్రయోజనాల కోసం." -చినరాజప్ప, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు

"తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థులు బ్రహ్మండమైన విజయం సాధించారు. ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదని పట్టభద్రులు స్పష్టంగా తీర్పు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడితేనే.. రాష్ట్రాన్ని సరైన గడీలో పెట్టి, సవ్యంగా నడిపించగలరనే నమ్మకం ఓటర్లు అందించిన విజయం వల్ల కలిగింది." -ఏలూరి సాంబశివరావు, పర్చూరు ఎమ్మెల్యే

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.