ETV Bharat / state

గుంతల ఏపీకి దారేది సీఎం - టీడీపీ-జనసేన నిరసన పిలుపునకు అనూహ్య స్పందన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 18, 2023, 6:10 PM IST

Updated : Nov 19, 2023, 10:09 AM IST

tdp_janasena_joint_protest
tdp_janasena_joint_protest

TDP Janasena Joint Protest: రాష్ట్రవ్యాప్తంగా రహదారుల అధ్వన్న పరిస్థితికి నిరసనగా టీడీపీ జనసేనా ఉమ్మడిగా ఇచ్చిన పిలుపుకు.. అనూహ్య స్పందన వచ్చింది. తమ ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న గుంతల ఎదుట ఇరు పార్టీ శ్రేణులు నిరసనకు దిగి, జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రోడ్లపై ఉన్న గుంతల కారణంగా.. తాము ఎంతలా ఇబ్బందులు పడ్డామో తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టింగులు చేస్తున్నారు నిరసనకారులు.

గుంతల ఏపీకి దారేది సీఎం - టీడీపీ జనసేన నిరసన పిలుపునకు అనూహ్య స్పందన!

TDP Janasena Joint Protest: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోడ్ల దుస్థితిపై తెలుగుదేశం-జనసేన ఆధ్వర్యంలో.. గుంతల ఆంధ్రప్రదేశ్​కు దారేది సీఎం పేరుతో నిరసనలు చేపట్టారు. అధ్వానంగా తయారైన రహదారులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి తెలిజేసేలా ఆందోళనకు దిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రహదారులు నిర్మించాలని టీడీపీ-జనసేన నాయకులు డిమాండ్ చేశారు.

TDP Janasena Joint Protest In Guntur : రాష్ట్రంలో రహదారుల దుస్థితిని నిరసిస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు నిరసన తెలిపారు. వడ్లపూడి రహదారిపై నిరసన చేసిన నాయకులు రోడ్ల దుస్థితిని ప్రజలకు వివరించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంగళగిరి అభివృద్ధికి ముఖ్యమంత్రి నిధులు కేటాయించారన్న వైసీపీ నేతలు ఈ రహదారిని ఎందుకు బాగుచేయలేదో సమాధానం చెప్పాలని నిలదీశారు.

TDP Janasena Protest In NTR District: ఎన్టీఆర్ జిల్లా మైలవరం జి.కొండూరు రహదారుల దుస్థితిపై గడ్డమణుగు నుండి జి.కొండూరు వరకు టీడీపీ, జనసేన సంయుక్తంగా ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’ కార్యక్రమం పేరుతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పాదయాత్రలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, జనసేన ఇంఛార్జి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ), టీడీపీ జనసేన శ్రేణులు పాల్గొన్నారు. గుంతలనైనా పూడ్చలేని చేతకాని ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంతలను మట్టితో పూడ్చాలని ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకోవడం.. దుర్మార్గమని దుయ్యబట్టారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన నిరసన: పశ్చిమగోదావరి జిల్లా తణుకు తెలుగుదేశం-జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అత్తిలి మండలం కేసముద్రం గట్టు గ్రామంలో గుంతల ఆంధ్రప్రదేశ్​కు దారేది అంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. కేసముద్రం గట్టు గ్రామం వద్ద పాదయాత్ర ప్రారంభించి అత్తిలి వరకు సుమారు మూడు కిలోమీటర్లు పరిధిలో రహదారి గుంతల వద్ద ఇరుపార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సమస్యల సవాళ్లతో ఆటోనగర్​ విలవిల - రోజు గడవడం లేదంటూ మెకానిక్​ల ఆవేదన

ప్రకాశం జిల్లాలో ఇరుపార్టీల ర్యాలీ: ప్రకాశం జిల్లా కనిగిరి రోడ్ల అధ్వాన స్థితిని చూపిస్తూ.. టీడీపీ - జనసేన నేతలు ఆందోళన చేశారు. టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద నుంచి ఇరు పార్టీల నాయకులు ర్యాలీ నిర్వహించారు. భారీ గోతులను చూపుతూ స్థానిక అర్బన్ కాలనీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. వైసీపీ మోసపూరిత పాలనలో ప్రజలు నష్టపోయిన విధానాన్ని ఓ మహిళ పాట రూపంలో వివరించారు.

శ్రీకాకుళంలో టీడీపీ జనసేన ఆందోళన: శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస, చింతాడ రోడ్లపై టీడీపీ - జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. శ్రీకాకుళం ఆముదాలవలస ప్రధాన రహదారి నిర్మాణాన్ని.. నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనలో పూర్తిచేయలేకపోయారని ధ్వజమెత్తారు. గుంతల కారణంగా ఆముదాల వలస రహదారిపై సుమారు 27 మంది మృతి చెందారని.. తరచూ ప్రజలు ప్రమాదాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

TDP Janasena Protest in Satya Sai District: శ్రీ సత్యసాయి జిల్లాలో పెనుకొండ నుంచి కోనాపురం వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయం అయ్యిందంటూ.. టీడీపీ - జనసేన నాయకులు అన్నారు. టీడీపీ అధ్యక్షుడు బి.కె పార్థసారథి, జనసేన నియోజకవర్గ బాధ్యుడు కుమార్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లు నరకానికి దారులు అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో కనీసం గుంతలను పూడ్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నరసరావుపేట బైపాస్‌ రోడ్డుపై ప్రయాణించాలంటే 'కత్తి మీద సాములాంటిదే' బాబు!

అనంతపురం జిల్లాలో ఆందోళన: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం మండలంలో అధ్వానంగా ఉన్న రోడ్డుపై తెలుగుదేశం, జనసేన నాయకులు నిరసన తెలిపారు. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో తెలుగు యువత, నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు పాల్గొన్నారు. కళ్యాణదుర్గం నుంచి కన్నేపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కంకరతేలిన రోడ్డుపై మోకాళ్లపై కూర్చొని టీడీపీ -జనసేన నాయకులు ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.

TDP Janseana Protest: తూర్పుగోదావరి జిల్లాలో: తూర్పుగోదావరి జిల్లాలోని రహదారుల దుస్థితిపై అనపర్తిలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా బైక్​ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి, జనసేన నేత శ్రీనివాసరావు, టీడీపీ - జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున రోడ్డుపై ప్రయాణం కైలాసానికి పయనం నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. రాజమహేంద్రవరం కాకినాడ రహదారి దుస్థితిపై మండిపడ్డారు.

అల్లూరి జిల్లాలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో నిరసన: జగన్ పాలనలో రహదారులు గుంతల మయంగా మారాయాని అల్లూరి జిల్లా రంపచోడవరంలో టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. జగన్​ హయంలో అభివృద్ధి శూన్యమని ఎద్దేవా చేశారు. జిల్లాలో అధ్వాన్నంగా తయారైన రోడ్లను, రంప నుంచి రంపచోడవరం వెళ్లే రహదారి దుస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్​లో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రామాన్ని నిర్వహించగా.. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అధికార పార్టీ సర్పంచ్​కు కోపం వచ్చింది - ఆమె నిరసనకు ఊరు కదలి వచ్చింది ! కారణం ఏంటో తెలుసా ?

సీఎం శంకుస్థాపన చేసిన పనులు పూర్తికాకపోవడం సిగ్గు.. సిగ్గు.. అంబేడ్కర్​ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం - కాట్రేనికోన మండలాలను కలుపై రహదారి దుస్థితిపై టీడీపీ జనసేన నాయకులు నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి.. సంవత్సరాలు గడిచిన పనులు పూర్తికాకపోవడం సిగ్గు అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ముమ్మిడివరం టీడీపీ నేతలు, జనసైనికులు పాల్గొన్నారు.

పల్నాడు జిల్లాలో TDP Janasena Protest: పల్నాడు జిల్లాలోని రోడ్లపై ఏర్డడిన గుంతలను నిరసిస్తూ.. టీడీపీ జనసేన నేతలు ఆందోళన నిర్వహించారు. దాచేపల్లిలో కేసానుపల్లి గ్రామంలో గుంతలు ఏర్పడిన రోడ్డుపై నిరసన ప్రదర్శన నిర్వహించారు. పిడుగురాళ్లలో జానపాడు రోడ్​లో గల ఆక్స్ఫర్డ్ స్కూల్ వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో కూర్చోని.. ఆందోళన వ్యక్తం చేశారు.

TDP Janasena Protest: అనంతపురం జిల్లాలోని రుద్రంపేట సమీపంలో రోడ్ల దుస్థితిపై టీడీపీ జనసేన నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమాన్ని మరిచి జగన్​మోహన్​ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్​లో నిద్రపోతున్నారని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా.. జగన్​ను ఎప్పుడు ఇంటికి పంపుదామా అని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారని అన్నారు. చాబాల - ఉరవకొండ వెళ్లే రహదారిలో వంతెన నిర్మించాలని, చాబాల నుండి ధర్మపురి వరకు గుంతలమయంగా ఉన్న రహదారిపై నాయకులు నిరసన తెలిపారు.

మంత్రి​ గారూ ఓసారి మా ఊరికి రండి సారూ! - ఆదిమూలపు సురేశ్ నియోజకవర్గంలో అత్యంత దారుణ పరిస్థితి

TDP Janasena Agitation: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెలుగుదేశం పార్టీ జనసేన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలో నాలుగున్నర వైసీపీ పాలనలో గుంతలు పూడ్చకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ఈ అరాచక పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.

TDP Janasena Jiont Protest: ఏలూరులో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో బిర్లాభవన్ సెంటర్​కు సమీపంలో శిథిలావస్థకు చేరిన రోడ్డుపై వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమలో ఏలూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రానున్న ఎన్నికల్లో పతనం తప్పదని విమర్శించారు. చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ.. అభివృద్ది చేస్తున్నామని ఎమ్మెల్యేలు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.

Worst Roads in Minister adimulapu suresh Constituency మంత్రి ఆదిమూలపు సురేష్ ఇలాకాలో రోడ్ల దుస్థితి చూశారా..! ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

Last Updated :Nov 19, 2023, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.