ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్‌ నీటి హక్కులను కాపాడాలి- నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్సు భేటీలో ఏపీ వాదన

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 11, 2023, 10:45 AM IST

Updated : Nov 11, 2023, 11:23 AM IST

_interlinking_of_rivers
_interlinking_of_rivers

Task Force Committee Meeting on Interlinking of Rivers: గోదావరి- కావేరి అనుసంధానం ప్రాజెక్ట్‌కు గోదావరిలో ఎలాంటి నీళ్లు లేవని, ఛత్తీస్‌గడ్‌కు కేటాయించిన జలాలను వారు వాడకుంటే ఈ ప్రాజెక్ట్‌ వృథా అవుతుందని ఏపీ అభ్యంతరం తెలిపింది. దీనికి ప్రత్యామ్నాయంగా పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా నాగార్జునసాగర్‌కు, శ్రీశైలం నుంచి సోమశీల మీదుగా తరలించవచ్చని సూచించింది. దీనిపై స్పందించిన నదుల అనసంధాన టాస్క్‌ఫోర్సు ఛత్తీస్‌గడ్ కేటాయించిన జలాలు ఆ రాష్ట్రం వాడుకునే పరిస్థితులు లేనందునే తరలిస్తున్నట్లు తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌ నీటి హక్కులను కాపాడాలి- నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్సు భేటీలో ఏపీ వాదన

Task Force Committee Meeting on Interlinking of Rivers: గోదావరి-కావేరి అనుసంధానం ప్రాజెక్ట్‌ను ఆహ్వానిస్తూనే సాంకేతిక అంశాలపై ఏపీ అభ్యంతరాలు తెలిపింది. ఆ అంశాలపై చర్చించేందుకు జాతీయ జల అభివృద్ధి సంస్థ ఏపీ అధికారులతోనే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. నదుల అనుసంధానంపై హైదరాబాద్‌లో నిర్వహించిన టాస్క్‌ఫోర్సు కమిటీ సమావేశానికి (Task Force Committee Meeting on Interlinking of Rivers) హాజరైన రాష్ట్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్​సీ నారాయణరెడ్డి ఈ మేరకు తమ అభిప్రాయాలు వెల్లడించారు. దిగువ రాష్ట్రంగా ఏపీకి కృష్ణా, గోదావరి నదుల్లో మిగులు జలాలపై హక్కు ఉందని.. గోదావరి ట్రైబ్యునల్‌ ప్రకారం రాష్ట్ర హక్కులకు భంగం కలగనివ్వకూడదని కోరారు.

Chandrababu Power Point Presentation: నదుల అనుసంధానానికి దేశంలోనే తొలిసారి పునాది వేసింది టీడీపీ: చంద్రబాబు

కర్ణాటక అంతర్గత అనుసంధాన ప్రాజెక్టులో తుంగభద్ర కుడి కాలువ.. గోదావరి- కావేరి అనుసంధానంపై ఏపీ ప్రత్యామ్నాయ ఆలోచనను ప్రతిపాదించింది. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజికి, అక్కడి నుంచి వైకుంఠపురం, నాగార్జునసాగర్‌ శ్రీశైలం జలాశయం నుంచి సోమశిలకు మళ్లించేలా తాము ప్రతిపాదిస్తున్నామని తెలిపింది. దీనివల్ల వ్యయం, భూసేకరణ తగ్గనున్నట్లు ఏపీ అధికారులు వివరించారు. గోదావరి- కావేరి అనుసంధానం (Godavari-Caveri Linkage Project) వల్ల నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాల్లో అదనంగా నీటిని నిల్వ చేసే అంశాన్నీ పరిశీలించాలని విన్నవించారు.

ఇందులో భాగంగానే కర్ణాటకలో అంతర్గతంగా చేపడుతున్న నదుల అనుసంధానం ప్రమాణాల తరహాలోనే ఏపీలోనే అంతర్గత అనుసంధానానికి ఆమోదించాలని సూచించారు. తుంగభద్ర కుడి కాలువనూ కర్ణాటక అంతర్గత అనుసంధాన ప్రాజెక్టులో (Karnataka Internal Connectivity Project) చేర్చాలని కోరారు. గోదావరి- కావేరి అనుసంధానానికి సంబంధించిన ఎంవోయూపై తాము మరింత అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు.

Negligence on Godavari Penna Interlinking Project: ప్రాజెక్టు పేరు మారింది.. కానీ పనులు మాత్రం ముందుకు కదలడంలేదు

ఇచ్చంపల్లి వద్ద క్షేత్రస్థాయిలో పరిశీలన తరువాతే నిర్ణయం.. ఛత్తీస్‌గఢ్‌ వినియోగించుకోని జలాలనే ఈ ప్రాజెక్టులోకి తీసుకుంటున్నామే తప్ప ఏ రాష్ట్రం జలాలు, మిగులు జలాలు తీసుకోవడం లేదని టాస్క్‌ఫోర్సు కమిటీ ఛైర్మన్ వెదిరె శ్రీరాం తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించిన నీళ్లను వారు వాడుకునే పరిస్థితులు లేవన్నారు. అందుకే ఆ నీటిని కావేరికి తరలించనున్నట్లు తెలిపారు. ఇచ్చంపల్లి బదులుగా పోలవరం (Polavaram project) నుంచి అనుసంధానించాలని ఏపీ కోరగా.. ఇచ్చంపల్లి కాకుండా కొంత ఎగువ ప్రాంతం నుంచి గోదావరి- కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌ చేపట్టాలని తెలంగాణ విజ్ఞప్తి చేసింది.

ప్రస్తుతం చేపడుతున్న ప్రాజెక్టు తొలి దశ మాత్రమేనని.. తర్వాత దశల్లో అటు నుంచి కూడా అనుసంధానించే అంశం పరిశీలించవచ్చని వెదిరె శ్రీరాం తెలిపారు. కచ్చితంగా ఏ ప్రాంతం నుంచి అనుసంధానిస్తామనే అంశం జాతీయ జల అభివృద్ధి సంస్థ (National Water Development Agency) నిపుణులు క్షేత్రస్థాయిలో ఇచ్చంపల్లి వద్ద పరిశీలించాకే నిర్ణయిస్తారన్నారు.

Negligence on Godavari Penna Interlinking Project: ప్రాజెక్టు పేరు మారింది.. కానీ పనులు మాత్రం ముందుకు కదలడంలేదు

Last Updated :Nov 11, 2023, 11:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.