ETV Bharat / state

Sikh Religious Leaders: సిక్కు పెద్దలతో సీఎం జగన్ సమావేళం.. వివిధ అంశాలపై హామీ

author img

By

Published : May 8, 2023, 8:02 PM IST

సిక్కు పెద్దలతో సీఎం జగన్
CM Jagan

CM Jagan: రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలు మైనార్టీ కమిషన్‌ సభ్యుడు జితేందర్‌జిత్‌ నేతృత్వంలో సీఎం జగన్​తో సమావేశమయ్యారు. సిక్కుల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటుకు చేయాలని సిక్కు పెద్దలు కోరారు. సిక్కుల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటుతో పాటుగా వివిధ అంశాలపై సానుకూలంగా సీఎం జగన్ స్పందించారు. 10 రోజుల్లోగా ఇవన్నీ కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Sikh Religious Leaders Meet CM Jagan: రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. తనను కలిసిన సిక్కు నేతలకు సీఎం వరాలు కురిపించారు. మైనార్టీ కమిషన్‌ సభ్యుడు జితేందర్‌జిత్‌ నేతృత్వంలో సిక్కు పెద్దలు సీఎంను కలిశారు. మైనార్టీ నేతల విన్నపాలకు సీఎం సానుకులంగా స్పందించారు. పది రోజుల్లోగా చర్యలు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిక్కుల కోసం కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని సీఎంను సిక్కు పెద్దలు కోరారు. వారి విన్నపానికి సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ అంశంపై చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం జగన్ సూచించారు. గురుద్వారాల్లోని గ్రంధీలకు పూజారుల మాదిరిగా లబ్ధి చేకూర్చెేందుకు ప్రయత్నిస్తానని సీఎం జగన్ తెలిపారు.

సిక్కులకు సైతం నవరత్నాల అమలు చేయాలని విజ్ఞప్తి: రాష్ట్రంలో నివసించే సిక్కులకు నవరత్నాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సిక్కుల కోసం ఒక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్ తెలిపారు. సిక్కు పెద్దలు కోరిన మేరకు సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమావేశమయ్యారు. ఏపీ స్టేట్‌ మైనార్టీస్‌ కమిషన్‌ సభ్యుడు జితేందర్‌జిత్‌ సింగ్‌ నేతృత్వంలో సిక్కు పెద్దలు సీఎంను కలిశారు. గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిపై సీఎం అంగీకరించారు. గురుద్వారాలపై ఆస్తి పన్ను తొలగించాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు.

గురునానక్‌ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవు: గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు.. పూజారులు, పాస్టర్లు, మౌల్వీల మాదిరిగానే ప్రయోజనాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. గురునానక్‌ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవుదినంగా ప్రకటించేందుకు సీఎం అంగీకారం తెలిపారు. ఒక మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు అవసరమైన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని సీఎం జగన్ వెల్లడించారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం చేస్తామని సీఎం తెలిపారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సిక్కులకు అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వివిధ సామాజిక వర్గాలు నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎంఈల వ్యాపారాలను పెంచే క్రమంలో ఈ చర్యలు ఉండాలన్నారు. 10 రోజుల్లోగా ఇవన్నీ కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం నిర్దేశించారు.

సీఎం జగన్​తో సమావేశం అనంతరం సిక్కు పెద్దలు మీడియాతో మాట్లాడారు. తమ విన్నపాలపై సీఎం సానుకులంగా స్పందించారని వెల్లడించారు. త్వరలో హామీల అమలు దిశగా చర్యలు చేపట్టనున్నట్లు సీఎం వెల్లడించారని సిక్కు పెద్దలు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.