ETV Bharat / state

Protests Against Chandrababu Naidu Arrest: పెల్లుబికిన ప్రజాగ్రహం.. అడుగడుగునా పోలీసుల అడ్డగింపు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 11, 2023, 5:47 PM IST

Updated : Sep 11, 2023, 8:36 PM IST

Protests Against Chandrababu Naidu Arrest: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పార్టీ పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్న నాయకులను పోలీసుల అడుగడుగునా అడ్డుకున్నారు. పలు చోట్ల శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నాయకులను కొందరిని పోలీసులు గృహనిర్బంధం చేశారు.

andhra bandh
andhra bandh

Protests Against Chandrababu Naidu Arrest: పెల్లుబికిన ప్రజాగ్రహం.. అడుగడుగునా పోలీసుల అడ్డగింపు

Protests Against Chandrababu Naidu Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ సయ్యద్ జిలాని ఆధ్వర్యంలో జనసైనికులు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. పోలీసులు ఆందోళనను అడ్డుకుని ఇంఛార్జ్ సయ్యద్ జిలానీని అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు. జనసేన ఇంచార్జి సయ్యద్ జిలానీ అరెస్టుకు నిరసనగా జనసైనికులు మరోసారి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో పార్టీ కార్యకర్తలు ఎక్కడికక్కడ రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. టైర్లు తగులబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కృష్ణాయపాలెం, ఉండవల్లిలో ఆందోళన చేస్తున్న రాజధాని రైతులు, పార్టీ కార్యాకర్తలు, మహిళలను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు వాహనానికి అడ్డుపడ్డారు.

Kosta Andhra TDP Supporters Protest Against Chandrababu Arrest చంద్రబాబు కోసం కదిలిన కోస్తాంధ్ర ప్రజలు.. నిరసనలు, ఆందోళనతో హోరెత్తిన కూడళ్లు

Peoples Fire on YCP Governance: గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పుల్లడిగుంటలో టీడీపీ నాయకులు గుంటూరు ప్రధాన రహదారిపై టైర్లు కు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. చంద్రబాబును వెంటనే బెయిల్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఆర్టీసీ బస్సులను నిలిపివేసి రహదారి పై బైఠాయించి నిరసన తెలిపారు.

ప్రత్తిపాడులో ఆర్టీసీ బస్సును నిలిపివేసిన టీడీపీ నాయకులను పోలీసులు తోసేసుకుంటూ వెళ్లారు. టీడీపీ నాయకులు, పోలీసులు మధ్య తోపులాట జరిగింది. నాయకులను చొక్కా పట్టుకుని లాగి ఆటోలో ఎక్కించి అరెస్ట్ చేశారు. గుంటూరుకు తరలించారు. చంద్రబాబు రిమాండ్ ను వ్యతిరేకిస్తూ.. ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలంలో టీడీపీ నేతలు నిర్వహిస్తున్న బంద్ ను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం నాయకులను అరెస్ట్ చేసి పొలీస్ స్టేషన్ కు తరలించారు.

Amaravati Capital Farmers Agitation On Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అమరావతి రాజధాని రైతుల ఆందోళనలు

TDP Leaders Arrest: పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు పార్టీ శ్రేణులు.. ఆందోళనలు చేపట్టారు. జిల్లా టీడీపీ కార్యదర్శి అర్తిమల్ల రమేష్​ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆందోళన చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తను పోలీసులు అరెస్టు సేసి అమరావతి పోలీస్ స్టేషన్ తరలించి.. స్టేషన్ లోపలికి ఎవరిని వెళ్లనీయకుండా గేట్లకు పోలీసులు తాళాలు వేశారు. క్రోసూరు, అచ్చంపేట, బెల్లంకొండ మండలాల్లో ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Slogans Against YCP Govt: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు, కనపర్రులో నిరసన తెలుపుతున్న టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. యడ్లపాడు మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాపట్ల జిల్లా అద్దంకిలో స్థానిక ఎమ్మెల్యే రవికుమార్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టారు. స్థానిక బంగ్లారోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనాకారులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు.

Tension at Vijayawada: ఉమ్మడి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం శ్రేణులు నిరసనలతో హోరెత్తించారు. విజయవాడ వన్‌ టౌన్‌ రథం సెంటర్‌లో ఆందోళన చేపట్టిన తెదేపా నేత బుద్ధా వెంకన్నని పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నందిగామలో తెదేపా నాయకురాలు తంగిరాల సౌమ్యను బయటకు రానివ్వకుండా గృహనిర్బంధం చేశారు. గోడ దూకి బయటకు వచ్చేందుకు ప్రయత్నించిన సౌమ్యను పోలీసులు నిలువరించడంతో తోపులాట జరిగింది. మైలవరంలో అరెస్టు చేసిన తెదేపా నాయకులను విడుదల చేయాలంటూ దేవినేని ఉమ.. పోలీసులు స్టేషన్‌కు బయలుదేరారు. దేవినేనిని పార్టీ కార్యాలయం వద్దే అడ్డుకున్న పోలీసులు.. 144 సెక్షన్ అమలులో ఉందని... సహకరించాలని కోరారు. దేవినేని, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది.

Schools and Colleges Bandh: తెదేపా బంద్‌ పిలుపుతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కళాశాలలు, పాఠశాలలు, దుకాణాలు మూతపడ్డాయి. ఏలూరు పాత బస్టాండ్ వద్ద తెలుగుదేశం శ్రేణులు... మోకాళ్లపై కూర్చుని నిరనస తెలిపారు. నరసాపురంలో శాంతియుతంగా బంద్‌ చేస్తున్న తెదేపా శ్రేణులను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆచంటలో జోరువానను సైతం లెక్కచేయకుండా తెదేపా శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిరసనకారుల్ని పోలీసులు... బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించారు.

Clash between TDP Activists and Police: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం, జనసేన నేతలు కదం తొక్కారు. కాకినాడలో భారీ ర్యాలీ చేపట్టి భానుగుడి సెంటర్‌లో నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అమలాపురంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్న తెదేపా శ్రేణులను పోలీసులు వాహనాల్లో ఎక్కించి తరలించారు. చంద్రబాబు జైలు నుంచి విడుదలవ్వాలని కోరుకుంటూ... రాజమండ్రి జైలు వద్ద ముస్లిం మతపెద్దలు ప్రార్థనలు చేశారు..

విశాఖ గాజువాక జంక్షన్‌లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న శ్రేణులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాటలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనకాపల్లిలో బంద్‌కు జనసైనికులు మద్దతు పలికారు.

Public Protest Chandrababu Arrest : చంద్రబాబు అరెస్ట్​పై ప్రజాగ్రహం.. నిరసనల వెల్లువ.. 'టీడీపీ నేతల హౌస్ అరెస్ట్'

TDP Leaders to Police Staion: ఉమ్మడి విజయనగరం జిల్లాలో తెదేపా శ్రేణులు రోడ్డెక్కారు. చీపురుపల్లి గాంధీ బొమ్మ సెంటర్‌లో సుమారు 500 బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించారు. భోగాపురంలో జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు.. బస్సులను ఆపి... రోడ్డుపై పొర్లుదండాలతో ఆందోళన చేపట్టారు. బొబ్బిలిలో తెదేపా అభిమాని... తాగునీటి ట్యాంక్‌ ఎక్కి నిరసన తెలిపారు. పాలకొండ–వీరఘట్టం ప్రధాన రహదారిలో ఆందోళన చేస్తున్న తెదేపా నేతలను.. పోలీసులు అడ్డుకుని స్టేషన్‌కు తరలించారు.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జాతీయ రహదారిని దిగ్బంధించిన తెదేపా శ్రేణులు.. లారీ కింద దూరి నిరనస తెలిపారు. శ్రీకాకుళం RTC కాంప్లెక్స్ వద్ద నిరసన చేస్తున్న కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

Last Updated :Sep 11, 2023, 8:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.