ETV Bharat / state

Jagan Govt Neglected Development of Amrit Parks: పచ్చదనంపై జగన్ సర్కార్ నిర్లక్ష్యం.. మూత పడుతున్న ఉద్యానవనాలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2023, 9:18 AM IST

Updated : Aug 30, 2023, 1:37 PM IST

Jagan Govt Neglected Development of Amrit Parks: నగరాలు, పట్టణాల్లో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచటంలో, ఆరోగ్యాన్ని పెంపొందించటానికి పార్కులు చాలా కీలకం. ఇదే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పార్కుల నిర్మాణం చేపట్టింది. టీడీపీ హయాంలో పనులు ప్రారంభించిన పార్కులను అసంపూర్తిగా ఉన్నాయని వైసీపీ ప్రభుత్వం పక్కకు పెట్టింది. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన పార్కులు నిరుపయోగంగా మారుతున్నాయి.

jagan_govt_neglected_development_of_amrit_parks
jagan_govt_neglected_development_of_amrit_parks

Jagan Govt Neglected Development of Amrit Parks: పచ్చదనంపై జగన్ సర్కార్ నిర్లక్ష్యం.. మూత పడుతున్న ఉద్యానవనాలు

Jagan Govt Neglected Development of Amrit Parks: ఆహ్లాదకరమైన వాతావరణం కోసం పట్టణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలి. పట్టణాల సుందరీకరణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. రహదారుల మధ్య, రోడ్లకు ఇరువైపులా పచ్చదనం అవసరం. ఇందుకోసం తగిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి. పట్టణాల్లో పచ్చదనం అభివృద్ధి కోసం 2022 మే 9న అధికారులకు సీఎం జగన్ చేసిన సూచనలు ఇవి. ఆచరణలో మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో పట్టణాల్లో అభివృద్ధి చేసిన ఉద్యానవనాలను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. దాదాపుగా పూర్తయిన పార్కులను ప్రారంభించకుండా గేట్లకు తాళాలు వేసింది. చిన్న చిన్న పనులు పూర్తయితే అందుబాటులోకి వచ్చే ఉద్యానవనాలను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.

YSRCP Government Negligence on AIIB Projects: ప్రతి ఇంటికీ తాగునీరు ఇస్తానని చెప్పి.. నిధులు ఇవ్వకపోతే ఎలా జగననన్నా..

YCP govt did not fund Amrit Parks: అమృత్ పథకం కింద ప్రతిపాదిత పార్కుల పనులు పూర్తి చేస్తే 209 ఎకరాల్లో పచ్చదనం అందుబాటులోకి వచ్చేది. తెలంగాణలో ఇదే పథకంలో 28 పార్కుల పనులు పూర్తి చేశారు. 82 ఎకరాల్లో పచ్చదనం ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. 35 పార్కుల ద్వారా 442 ఎకరాల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేసేలా తెలంగాణలో ప్రతిపాదించారు. మన రాష్ట్రంలో గత ప్రభుత్వంలో పూర్తి చేసిన పార్కులు ప్రారంభించలేదు. వివిధ దశల్లో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు నిధులు కేటాయించలేదు. ఇలా అయితే పట్టణాల పచ్చదనం, ఆహ్లాదకరమైన వాతావరణం ఎలా సాధ్యమని పర్యావరణ ప్రియులు ప్రశ్నిస్తున్నారు.

Jagan Govt which did not Develop Amrit Parks: టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు పనులు పూర్తయిన టిడ్కో ఇళ్లను పక్కన పెట్టినట్లే.. ప్రజలకు ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే పచ్చని ఉద్యానవనాలను కూడా ప్రస్తుత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. మిగిలిన కొద్దిపాటి పనులు పూర్తి చేయిస్తే పార్కులను ఉపయోగించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వానికి ఇదేదీ పట్టడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన పనులు పూర్తి చేయరాదని, పూర్తి చేసినా ప్రారంభించకూడదన్నది ప్రస్తుత ప్రభుత్వ విధానంగా కనిపిస్తోంది. దీంతో పనులు పూర్తయిన ఉద్యానవనాలు ప్రారంభానికి నోచుకోవడం లేదు. మిగిలినవి అసంపూర్తిగా ఉంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన అమృత్ పథకంలో భాగంగా రాష్ట్రంలో 92 కోట్ల 10 లక్షల రూపాయలతో గత ప్రభుత్వ హయాంలో 95 ఉద్యానవనాల పనులు మొదలయ్యాయి. ఇందులో దాదాపు 51 కోట్ల వ్యయంతో 24 పార్కుల పనులు పూర్తయ్యాయి. మరో 24 పనులు వివిధ దశల్లో ఉన్నాయి.

Small Scale Industries in AP: చిన్న తరహా పరిశ్రమలపై వైసీపీ సర్కార్ చిన్నచూపు.. అటకెక్కించిన పారిశ్రామిక సర్వే..

Parks were Completed During TDP Govt: నాలుగు చోట్ల వివిధ కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. ప్రాజెక్టు అంచనా వ్యయంలో కేంద్ర ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూర్చుతోంది. మిగతా 50 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం, సంబంధిత పట్టణ, స్థానిక సంస్థలు సమకూర్చాలన్నది ఒప్పందం. గత ప్రభుత్వ హయాంలోనే ఉద్యానవనాల పనులు ఎక్కువగా పూర్తయ్యాయి. వివిధ దశల్లో ఉన్న మిగిలినవి ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. బిల్లులు సరిగా చెల్లించని కారణంగా పలుచోట్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. చివరి దశలోని పనులు కూడా పలు ప్రాంతాల్లో నిలిపివేశారు. దీంతో పార్కుల్లో ఏర్పాటు చేసిన వ్యాయామ పరికరాలు, పిల్లల ఆట వస్తువులు కొన్నిచోట్ల తుప్పు పడుతున్నాయి. పనులు పూర్తయ్యేలోగా అనుమతించాలని ప్రజలు కోరుతున్నా.. లోపలకు వెళ్లకుండా గేట్లకు తాళాలు వేస్తున్నారు.

  • Guntur District: గుంటూరు జిల్లా తెనాలిలోని అమరావతి కాలనీలో 64 సెంట్ల విస్తీర్ణంలో అమృత్ పథకంలో 52 లక్షల రూపాయలతో ఉద్యానవనాన్ని అభివృద్ధి చేసి ప్రారంభించకుండా గేటుకు తాళం వేశారు. పార్కు లోపల అంతర్గత రహదారులు, వ్యాయామశాల, పిల్లలకు ఆట పరికరాలు ఏర్పాటు చేశారు. ముఖ్యమైన పనులన్నీ పూర్తయినా ప్రారంభానికి నోచుకోలేదు. ఇదే పట్టణంలోని ఫైకస్ ప్రాంతంలోనూ కోటీ 70 లక్షలతో ఉద్యనవనాన్ని టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేశారు. మిగిలిన పనులకు ప్రస్తుత ప్రభుత్వం 50 లక్షలు మంజూరు చేసినట్లే చేసి మళ్లీ వెనక్కి తీసుకుంది.
  • Krishna District: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం ఎదుట 30 లక్షలతో బ్రహ్మపురం పేరుతో ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశారు. అమృత్ పథకంలో గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించారు. ఇందులో వ్యాయామశాలతో పాటు పిల్లలకు ఆట పరికరాలు ఏర్పాటు చేశారు. దీన్ని ప్రారంభించక పోగా.. ప్రజలెవరకూ లోపలకు వెళ్లకుండా గేటుకు తాళం వేశారు. ఉద్యావనంలో ఏర్పాటు చేసిన వస్తువులు అలంకారప్రాయంగా మిగిలిపోతున్నాయి. ఇదే నగరంలోని శిడిండి అగ్రహారంలోనూ 30 లక్షలతో ఏర్పాటు చేసిన పార్కు కూడా ప్రారంభానికి నోచుకోలేదు.

Aayush Hospitals: ఆయుర్వేద, హోమియో వైద్యాలను ప్రజలకు కలగానే మారుస్తున్న వైసీపీ ప్రభుత్వం

28 parks are complete in Telangana: అమృత్ పథకం కింద తెలంగాణలో ప్రారంభించిన 35 పార్కుల్లో ఇప్పటికే 28 పూర్తయ్యాయి. వీటిలో 82 ఎకరాల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేశారు. మరో 7 పార్కుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని కూడా పూర్తి చేస్తే మొత్తం 442 ఎకరాల్లో పచ్చదనం అందుబాటులోకి రానుంది. ఏపీతో పోల్చిచూస్తే తెలంగాణలో పార్కుల సంఖ్య తక్కువైనా వీటి విస్తీర్ణం ఎక్కువ. ఏపీలో ప్రతిపాదిత 99 పార్కుల విస్తీర్ణం 209 ఎకరాలైతే.. తెలంగాణలో 35 పార్కుల్లో 442 ఎకరాల్లో పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.

Last Updated : Aug 30, 2023, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.