ETV Bharat / state

ఇలాగేనా వైనాట్! టీడీపీ కంచుకోటలో ఓట్ల తొలగింపునకు భారీగా ఫారం-7 దరఖాస్తులు - ఎమ్మెల్యే మద్దాళి వాట్సప్‌ చాటింగ్‌ను బయటపెట్టిన టీడీపీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 9:16 AM IST

Updated : Nov 25, 2023, 11:55 AM IST

Irregularities In Guntur Voter List టీడీపీకి ఆ నియోజకవర్గం కంచుకోట! 2019లోనూ ఈ స్థానంలో పసుపు జెండానే ఎగిరింది. కానీ అధికారం కోల్పోవడంతో పార్టీ ఫిరాయించిన ఆ ఎమ్మెల్యే.. వచ్చే ఎన్నికల కోసం జగన్ బాటను సిద్దం చేసుకుంటున్నాడు. టీడీపీ ఓట్లు గల్లంతు చేయకపోతే వైసీపీ గెలుపు సాధ్యం కాదని గ్రహించిన సదరు నేత ఒక సామాజికవర్గం ఓట్లు జాబితాలో లేకుండా తొలగించేందుకు పక్కా వ్యూహంతో అడుగులు వేస్తున్నాడు. ఈ తతంగాన్నంతా.. ఆధారలతో సహా టీడీపీ నేతలు బయటపెట్టడంతో.. అధికార పార్టీలో గుబులు రేగుతోంది.

Irregularities_In_Guntur_Voter_List
Irregularities_In_Guntur_Voter_List

Irregularities In Guntur Voter List : గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ అరాచకాలకు తెగబడుతున్నారు. టీడీపీ కంచుకోట అయిన ఈ స్థానంలో 2019లో గిరిధర్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత అధికార పార్టీలోకి చేరిన ఆయన ఇప్పుడు టీడీపీ ఓట్ల గల్లంతుకు గురిపెట్టారు. నాలుగున్నరేళ్ల వైసీపీ ప్రజావ్యతిరేక పాలనలో ఇక్కడ వైసీపీ గెలుపు సులభం కాదని భావించి అరాచకానికి వ్యూహం పన్నారు. తెలుగుదేశానికి అనుకూలంగా ఉండేవారిని ఓటర్ల జాబితా నుంచి తప్పించేందుకు దందా సాగిస్తున్నారు.

Removal TDP Sympathizers Votes in AP : ప్రధానంగా ఒక సామాజికవర్గం ఓట్లు జాబితాలో లేకుండా తొలగించేందుకు పన్నాగాలు పన్నారు. మిగిలిన వర్గాల్లోనూ టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు స్కెచ్‌గీసి స్వయంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. 33వ డివిజన్‌లో ఎన్ని ఓట్లు తొలగించారని ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ దరఖాస్తులు చేసిన వారితో మాట్లాడిన వాట్సప్‌ చాటింగ్‌ను టీడీపీ గుంటూరు పశ్చిమ ఇన్‌ఛార్జ్‌ కోవెలమూడి రవీంద్ర బహిర్గతం చేశారు. డివిజన్లు, పోలింగ్‌ కేంద్రాల వారీగా ఓట్ల తొలగింపు దరఖాస్తుల పని ఎలా జరుగుతోందని ఎప్పటికప్పుడు వాట్సప్‌ ద్వారా చాటింగ్‌ చేసి ఎమ్మెల్యే ఆరా తీశారు. ఈ విషయాన్ని టీడీపీ నేతలు బయటపెట్టడంతో అడ్డంగా దొరికిపోయారు.

ఉంగుటూరులో అధికార పార్టీ అరాచకం, టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు యత్నం

Form 7 Issue Cases In Guntur : ఓట్ల తొలగింపునకు ఫారం-7 ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. టీడీపీ అభ్యర్థిగా గెలిచిన మద్దాళి గిరిధర్‌ పోలింగ్‌ కేంద్రాల వారీగా పార్టీల బలాబలాలపై సమాచారం సేకరించారు. 2019 ఫలితాల తర్వాత టీడీపీ మద్దతుదారుల వివరాలు రాబట్టారు. గతంలో ఒక్కరే వందల సంఖ్యలో ఫారం-7 దరఖాస్తులు సమర్పించేవారు. ఇప్పుడు వ్యూహం మార్చారు. ఒక్కొక్కరు అయిదు కంటే ఎక్కువ దరఖాస్తులు పెట్టకుండా జాగ్రత్తపడ్డారు. నవంబరులోనే 22వ తేదీ వరకు 3వేల 541 ఫారం-7 దరఖాస్తులు వచ్చాయి. ఇందులోనూ 5 కన్నా ఎక్కువ దరఖాస్తులు పెట్టినవారు 45 మంది ఉన్నారు. మొత్తం దరఖాస్తుల్లో ఇలా అయిదు కంటే ఎక్కువ దరఖాస్తులు పెట్టినవే 52 శాతం ఉన్నాయి. అంటే ఓట్ల తొలగింపునకు ఎంత కసిగా, ప్రణాళికతో వ్యవహరిస్తున్నారో అర్థమవుతుంది.

మితిమీరుతున్న అధికార పార్టీ నేతల ఆగడాలు - వైసీపీ సానుభూతిపరులకు రెండేసి ఓట్లు

Fake votes in AP : ఆయా డివిజన్లలో, పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న ఇంటిపేర్లను గమనిస్తున్న ఎమ్మెల్యే వర్గం వాటి ఆధారంగా సామాజికవర్గం అంచనా వేసి టార్గెట్‌ చేస్తున్నారు. ఆ ఓట్లను తొలగించేలా ఫారం-7 దరఖాస్తులు ఎమ్మెల్యే మనుషులే సమర్పిస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్‌ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులకు టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపు బాధ్యతలు అప్పగించారు. ఈ విషయాన్ని గమనించిన ఎలక్టొరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వందల దరఖాస్తులు పెట్టిన ఆరుగురిపై చర్యలు తీసుకోవాలని ఈఆర్వో ఫిర్యాదు చేయడం ఇక్కడి అక్రమాలకు నిదర్శనంగా నిలిచింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 19, 28, 33, 35, 37, 38, 42, 43, 45 డివిజన్లలో కొన్ని పోలింగ్‌ కేంద్రాల పరిధిలో వందల సంఖ్యలో ఓట్ల తొలగింపునకు దరఖాస్తులు పెట్టారు.

Irregularities in AP Voter List 2023 : అధికారం ఉంది కదా అని ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ కొందరు ఉద్యోగులపైనా ఒత్తిడి తెస్తున్నారు. స్థానిక వైసీపీ నేతలు ఒక బీఎల్వోపై ఒత్తిడి తెచ్చి, ఓట్లు తొలగించాలని భయపెట్టారు. అలా చేస్తే తన ఉద్యోగం పోతుందని అడ్డుచెప్పడంతో ఆయనతో వైసీపీ నాయకులు ఘర్షణ పడ్డట్లు తెలిసింది.

కొత్తపేటలో ఓట్లు తొలగించడానికి మరో ఎత్తుగడ - స్థానికంగా లేరంటా 4 వేల మందికి పైగా నోటీసులు

ఇలాగేనా వైనాట్! టీడీపీ కంచుకోటలో ఓట్ల తొలగింపునకు భారీగా ఫారం-7 దరఖాస్తులు - ఎమ్మెల్యే మద్దాళి వాట్సప్‌ చాటింగ్‌ను బయటపెట్టిన టీడీపీ
Last Updated : Nov 25, 2023, 11:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.