ఇళ్లు పూర్తయ్యే నాటికి ఆ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి: సీఎం జగన్​

author img

By

Published : Nov 24, 2022, 6:11 PM IST

CM REVIEW ON HOUSING

CM REVIEW ON HOUSING : ఇళ్ల నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్​ ఆదేశించారు. గృహనిర్మాణశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ఇళ్లులేని వారికి ఇళ్లు ఇవ్వడమే ఈ కార్యక్రమం ఉద్దేశం అని తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.5,655 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దని.. ప్రతి దశలోనూ నాణ్యతా నిర్ధరణ పరీక్షలు జరగాలన్నారు.

CM JAGAN REVIEW ON HOUSING : ప్రభుత్వమే ఇళ్లు నిర్మించేలా ఆప్షన్‌–3ని ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణం సత్వరం పూర్తి చేసేలా దృష్టిపెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. లే అవుట్ల వారీగా, ప్రాధాన్యత పరంగా పనులను గుర్తించి.. అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలన్నారు. గృహనిర్మాణశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ఇళ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దని సూచించారు.

వారి సేవలనూ విసృత్తంగా వాడుకోవాలి: ప్రతి దశలోనూ నాణ్యతా నిర్ధరణ పరీక్షలు జరగాలన్నారు. ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీని నిరంతరం పాటించడానికి ఎస్‌ఓపీలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ సేవలను విస్తృతంగా వాడుకోవాలని సూచించారు. ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ ప్రమాణాలు పాటించే విషయంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ భాగస్వామ్యం తీసుకోవాలన్నారు.

"ఇళ్లులేని వారికి ఇళ్లు ఇవ్వడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.5,655 కోట్లు ఖర్చు చేశాం.ఇళ్ల నిర్మాణంపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. లే అవుట్లు సందర్శించినట్లు ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలి. ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తికావాలి. ఆప్షన్‌ 3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలి. ప్రాధాన్యత క్రమంలో లే అవుట్ల వారీగా పనులు గుర్తించాలి. ఇళ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దు. ప్రతి దశలోనూ నాణ్యతా నిర్ధరణ పరీక్షలు జరగాలి. విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ తప్పనిసరిగా ఉండాలి"-సీఎం జగన్​

నిర్మాణాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలి: ఇళ్లులేని వారందరికీ ఇళ్లు ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్న సీఎం.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.5,655 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. లే అవుట్లలో పర్యటన వల్ల ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షించి.. ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.

ఆ మౌలిక సదుపాయాలు కచ్చితంగా ఉండాలి: లే అవుట్లను సందర్శించినట్లుగా ఫొటోలను కూడా అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ప్రతి శనివారంను హౌసింగ్‌ డేగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇళ్లు పూర్తయ్యే సరికి మూడు రకాల మౌలిక సదుపాయాలు (విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ) తప్పనిసరిగా ఉండాలన్నారు. మిగిలిన మౌలిక సదుపాయాలనూ వృద్ధిచేసుకుంటూ ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయని సీఎంకు అధికారులు తెలిపారు. ప్రాధాన్యతాక్రమంలో చేసుకుంటూ వెళ్తున్నామన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.