ETV Bharat / state

తుపాను ప్రభావంపై సీఎం జగన్ ఆరా - అధికారులతో సమీక్ష

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2023, 4:03 PM IST

CM Jagan Review on Michaung Cyclone
CM Jagan Review on Michaung Cyclone

CM Jagan Review on Michaung Cyclone: తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధికారులతో సమీక్షించారు. క్యాంపు కార్యాలయంలో సీఎంవో సహా రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక అధికారులతో సీఎం భేటీ అయ్యారు. తుపాను పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని... ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తం చేసినట్లు వివరించారు.

తుపాను ప్రభావంపై సీఎం జగన్ ఆరా - అధికారులతో సమీక్ష

CM Jagan Review on Michaung Cyclone: మిగ్​జాం తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌ అధికారులతో సమీక్షించారు. క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, సీసీఎల్‌ఏ సెక్రటరీ ఇంతియాజ్, సీఎంఓ (CMO) అధికారులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. తుపాను పరిస్థితులపై ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో సహాయ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని, ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తం చేసినట్లు వివరించారు.

తిరుపతి, నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం: నెల్లూరు –కావలి మధ్య సగం ల్యాండ్‌ ఫాల్, సగం సముద్రంలో తుపాను గమనం ఉందని అధికారులు తెలిపారు. చీరాల బాపట్ల మధ్య పయనించి అక్కడ పూర్తిగా తీరం దాటనుందని సీఎంకు జగన్ (CM jagan) వివరించారు. తిరుపతి, నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావం ఈ ఉదయం నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతోందని తెలిపారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా తదితర జిల్లాల కలెక్టర్లనూ అప్రమత్తంగా చేశామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ఇప్పటివరకూ 211 సహాయ శిబిరాల్లో సుమారు 9500 మంది ఉన్నారని వెల్లడించారు. వారందరికీ మంచి సదుపాయాలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. సౌకర్యాల కల్పనలో ఎలాంటి పొరపాట్లు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

'ఎక్కడ వేసిన గొంగడి అక్కడే' హుద్​హుద్​ బాధితుల ఇళ్లను గాలికొదిలిన వైసీపీ సర్కారు

48 గంటల్లోగా పరిహారం అందించాలి: నెల్లూరు, తిరుపతి సహా తుపాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంటు సరఫరా వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. మనుషులు, పశువులు మరణించినట్టు సమాచారం అందితే 48 గంటల్లోగా పరిహారం అందించాలని సీఎం సూచించారు. తుపాను తగ్గిన వెంటనే ఎన్యుమరేషన్‌ కూడా ప్రారంభం కావాలని ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ, వాలంటీర్‌ వ్యవస్ధలను వాడుకుని రేషన్‌ పంపిణీ సమర్ధవంతంగా చేపట్టాలని అధికారులకు సీఎం నిర్దేశించారు.

తీరాన్ని తాకిన మిగ్​జాం తుపాను మిగ్​జాం బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. మరో గంట వ్యవధిలో తుఫాను తీరాన్ని పూర్తిగా దాటనుంది. తీరాన్ని దాటిన అనంతరం తీవ్ర తుపాను స్వల్పంగా బలహీనపడనుంది. సాయంత్రానికి వాయుగుండంగా బలహీన పడే సూచనలు ఉన్నాయి. తుఫాను ప్రభావంతో బాపట్ల తీర ప్రాంతంలో భారీగా ఈదురు గాలులు, వర్షం కురుస్తోంది. తుపాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వృక్షాలు నేల కూలుతుండటంతో జాగ్రత్తలు వహించాలని సూచించారు. వాహనాలను చెట్లకింద పార్క్ చేయకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సహాయం అందించడానికి వైద్యులను సిద్దంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

తిరుపతిలో నీట మునిగిన ప్రాంతాలు - వాగులో చిక్కుకున్న యువకులను కాపాడిన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.