ETV Bharat / state

అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట... నేటి నుంచి చెల్లింపులు

author img

By

Published : Nov 7, 2019, 6:10 AM IST

రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితులకు నేడు చెక్కులు అందనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే నిధులు మంజూరు కాగా... సీఎం జగన్‌ స్వయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి ముందుగా చెల్లింపులు చేయడానికి ఏర్పాట్లు చేశారు.

అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట

అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట

అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలవాలని నిర్ణయించిన జగన్ ప్రభుత్వం... వారు మోసపోయిన మొత్తాలను ఇవాళ్టి నుంచి చెల్లించనుంది. పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ మేరకు... బడ్జెట్‌లో రూ.1150కోట్లు కేటాయించారు. ఇందులో రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ... గత నెల 18న ఉత్తర్వులు జారీ చేశారు. 3 లక్షల 69 వేల 655 మంది బాధితులకు ఊరట కలగనుంది.

గుంటూరులోని పోలీస్‌ పెరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి... స్వయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇతర జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తారు. తర్వాతి దశలో రూ.20 వేల లోపు వున్న మరో 4లక్షల మంది డిపాజిట్‌ దారులకు చెల్లింపులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు.

డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సెల్‌ అథారిటీ ప్రతిపాదనల ప్రకారం... జిల్లాల వారీగా బాధితులకు సొమ్ము అందచేయనున్నారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే 19 వేల మంది వరకూ అగ్రిగోల్డ్‌ బాధితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారికి అందించాల్సిన చెక్కులు సిద్ధం చేశారు. ఆన్​లైన్ చెల్లింపులకు సంబంధించిన వెబ్​సైట్‌ను సీఎం ప్రారంభిస్తారు.

సీఎం పర్యటన... ఏర్పాట్లు పూర్తి...
ముఖ్యమంత్రి జగన్ గుంటూరు పర్యటన కోసం... ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, చెరుకువాడ రంగనాథరాజు సీఎం పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించారు. వెయ్యి మంది పోలీసు సిబ్బందితో అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉదయం 8నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించగా... కలెక్టర్ కార్యాలయం నుంచి రమేష్ ఆసుపత్రి వరకూ వాహనాల రాకపోకలు నిషేధించారు.

ఇదీ చదవండీ... 'అర్చకులంతా.. సీఎంకు రుణపడి ఉంటారు'

AP_GNT_21_06_CM_PARYATANA_ERPATLU_AVB_AP10169 Contributor : Eswarachari, Guntur యాంకర్.... అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి వారి ఖాతాలకు నగదు జమచేయనుంది. గుంటూరు కవాత్ మైదానంలో రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతులు మీదగా భాధితులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఇంచార్జ్ మంత్రి రంగనాధ్ రాజు, హోం మంత్రి సుచరిత, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు రజిని, ముస్తఫా, మేరుగ నాగార్జున, జిల్లా కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ పరిశీలించారు. జిల్లాలో సుమారు 19 వేలు పైగా అగ్రిగోల్డ్ బాధితులను అధికారులు గుర్తించారు. వారికి రేపు స్వయన ముఖ్యమంత్రి జగన్ చెక్కులు అందజేస్తారు. రేపు జరిగే కార్యక్రమానికి సంబంధించి అన్నిఏర్పాట్లు పూర్తయ్యాని మంత్రులు తెలిపారు. ప్రయివేట్‌ సంస్థలు ప్రజలను ఆర్థికంగా మోసం చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు నగదు చెల్లించటం దేశంలో తొలిసారి జరుగుతుందని ... అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్‌ చొరవ చూపటం అభినందనీయమని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. రేపు గుంటూరులో అగ్రిగోల్డ్‌ బాధితులు 10 వేల డిపాజిటర్లకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ప్రైవేటు కంపెనీలు పేదలను మోసం చేస్తే ఆ కంపెనీల నుండి రికవరీ రాకున్నా ప్రభుత్వం నగదు చెల్లించి ఆదుకుంటుందని జిల్లా ఇంచార్జ్ మంత్రి రంగనాధ్ రాజు అన్నారు. మొదటి విడతగా పది వేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన వారికి రేపు ముఖ్యమంత్రి చెక్కులు పంపిణీ చేస్తారన్నారు. ప్రతిపక్షాలు చెప్తున్న వదంతులను బాధితులు నమ్మొద్దన్నారు. దశల వారీగా నగదు చెల్లించి ప్రభుత్వం భాదితులకు న్యాయం చేస్తుందన్నారు. కార్యక్రమంలో మంత్రులు రంగనాధ్ రాజు , మోపిదేవి వెంకటరమణ , ఎమ్మెల్యేలు ముస్తఫా, రజనీ , మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. బైట్..... మేకతోటి సుచరిత, రాష్ట్ర హోం శాఖ మంత్రి బైట్..... రంగనాధ్ రాజు, జిల్లా ఇంచార్జ్ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.