ETV Bharat / state

ఇన్‌పుట్ సబ్సిడీ జీరో వడ్డీ నిధులను నేడు విడుదల చేయనున్న సీఎం

author img

By

Published : Nov 28, 2022, 10:42 AM IST

Input subsidy for farmers: రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, వైఎస్సార్‌ సున్నా వడ్డీ సొమ్ము లను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనుంది. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో బటన్‌ నొక్కి సీఎం వైఎస్ జగన్, నేరుగా రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. గతంలో వివిధ సాంకేతిక కారణాల వల్ల చెల్లింపులు పొందని వారి అకౌంట్లలో నగదు జమ చేస్తారు. 2022 జులై – అక్టోబర్‌ మధ్య ఖరీఫ్‌లో కురిసిన అధిక వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించనున్నారు. 45 వేల 998 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతన్నలకు 39.39 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఈరోజు చెల్లిస్తారు.

cm jagan
cm jagan

Input subsidy for farmers: రైతులకు పెట్టుబడి రాయితీ, వైఎస్సార్‌ సున్నా వడ్డీ సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనుంది. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి సీఎం జగన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. సాంకేతిక కారణాలతో గతంలో చెల్లింపులు అందనివారి అకౌంట్లలో నగదు జమ చేస్తారు. 2022 జులై – అక్టోబర్‌ మధ్య ఖరీఫ్‌లో కురిసిన అధిక వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించనున్నారు. 45 వేల 998 మంది వ్యవసాయ, ఉద్యానవన రైతులకు 39.39 కోట్ల సబ్సిడీ చెల్లిస్తారు. 2020 – 21 రబీ, 2021 ఖరీఫ్‌లో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన 8 లక్షల 22 వేల 411 మంది రైతులకు... 160.55 కోట్ల వడ్డీ సొమ్మును సీఎం విడుదల చేస్తారు.

వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల క్రింద ఇప్పటి వరకు 73.88 లక్షల మంది రైతన్నలకు 1,834.55 కోట్లు వడ్డీ రాయితీ అందించినట్లు ప్రభుత్వం తెలిపింది. వైకాపా ప్రభుత్వం మూడేళ్ళ ఐదు నెలల్లో వివిధ పథకాల క్రింద రైతన్నలకు 1,37,975.48 కోట్లు సాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.