ETV Bharat / state

Chandrababu Former PS suspended by AP govt: చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శిని సస్పెండ్​ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2023, 2:12 PM IST

Chandrababu Former PS Suspended by AP Govt: చంద్రబాబు మాజీ వ్యక్తిగత కార్యదర్శి, సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న పి.శ్రీనివాస్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సర్వీసు నిబంధనలు అతిక్రమించి అమెరికా వెళ్లిపోయినందుకు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కోంది.

_ps_suspended
_ps_suspended

Chandrababu Former PS Suspended by AP Govt: చంద్రబాబు మాజీ పీఎస్, సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న పి.శ్రీనివాస్​ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీసు నిబంధనలు అతిక్రమించి అమెరికా వెళ్లిపోయినందుకు ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉన్నతాధికారులకు తెలియచేయకుండా విదేశాలకు వెళ్లినందున పరారీలో ఉన్నట్టు భావిస్తూ ఈ సస్పెషన్ చర్యలు చేపడుతున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సచివాలయంలోని ప్రణాళికా విభాగంలో అసిస్టెంట్ సెక్రటరీగా శ్రీనివాస్ పనిచేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో పి శ్రీనివాస్​ను కూడా సీఐడీ నిందితుడిగా చేర్చింది. సర్వీసు నిబంధనలు అతిక్రమించి విధులకు గైర్హాజరైనందున ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది.

TDP Calls to People to Motha Mogiddham Programme: ప్యాలెస్​లో ఉన్న సైకోకి వినపడేలా 'మోత మోగిద్దాం' కార్యక్రమానికి టీడీపీ పిలుపు

Skill Development Case: ఆంధ్రప్రదేశ్​ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో సీఐడీ పలు కీలక విషయాలు నమోదు చేసింది. 2015 జూన్‌లో స్కిల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్​లో ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయని గుర్తించింది. జీవో నెంబర్ 4 ప్రకారం డిజైన్‌ టెక్‌ ఎండీ వికాస్‌ కన్విల్కర్‌, సీమెన్స్‌ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్​కు గత ప్రభుత్వం 241 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపింది. ఉద్దేశపూర్వకంగానే ఈ సొమ్మును అప్పగించిందని వెల్లడించింది. ఈ సొమ్మును 7 షెల్‌ కంపెనీలకు తప్పుడు ఇన్‌ వాయిస్‌లు సృష్టించినట్టు తరలించారని తెలిపింది. 2017-2018 సంవత్సరంలో 371 కోట్ల రూపాయలలో.. దాదాపు 241 కోట్ల రూపాయల గోల్‌మాల్‌ జరిగినట్లు సీఐడీ రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొంది.

Film Actor Ravi Babu Reacts on Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుపై సినీ నటుడు రవిబాబు స్పందన.. ఆయన డబ్బు మనిషి కాదంటూ..!

Chandrababu Arrest: స్కిల్ డెవలప్​మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజయవాడ అనిశా కోర్టు రిమాండ్ (Remand) విధించడంతో నాటకీయ పరిణామాల మధ్య రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. విజయవాడలో తొమ్మిదిన్నర గంటలకు బయలుదేరిన కాన్వాయ్ రెండున్నర గంటల్లో రాజమహేంద్రవరం చేరుతుందని అంతా భావించారు. కానీ పోలీస్ ఆంక్షలు మధ్య వాహన శ్రేణి నాలుగున్నర గంటలు ఆలస్యంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకుంది.

Nara Bhuvaneshwari Left Rajahmundry: రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన నారా భువనేశ్వరి

Notices to Lokesh in Amaravati Inner Ring Road Case: అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌పై గతేడాది కేసు నమోదు చేసిన సీఐడీ.. కేసులో ఇటీవలే లోకేశ్ పేరును చేరుస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. విచారణ సందర్భంగా.. అమరావతి రింగురోడ్డు కేసులో సీఆర్​పీసీ (CRPC) 41A ప్రకారం లోకేశ్​కు ముందస్తు నోటీసులు ఇస్తామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌ హైకోర్టుకు తెలిపారు. రింగ్‌రోడ్డు కోసం ఒక్క అంగుళం స్థలాన్నీ సేకరించలేదని లోకేశ్ వెల్లడించారు. ఈ వ్యవహారంపై అధికార పార్టీ ఎమ్మెల్యే 2022 ఏప్రిల్‌లో ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దురుద్దేశంతో కేసు నమోదు చేశారని లోకేశ్ తెలిపారు. మంత్రిగా ఉన్నప్పుడు తన తండ్రి చంద్రబాబు నివసిస్తున్న వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌ ఇంట్లో తానూ ఉన్నానని ఈ కేసులో నిందితుడిగా చేర్చారని ఈ కారణంతో నిందితుడిగా చేర్చడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు (Amaravati Ring Road Project) వ్యవహారంలో మంత్రి హోదాలో గానీ, ఇతర ఏ హోదాలో గానీ తాను జోక్యం చేసుకోలేదని లోకేశ్ స్పష్టం చేశారు. అందువల్ల తనపై అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్‌ 409 కింద కేసు పెట్టడానికి వీల్లేదన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.