ETV Bharat / state

అమూల్ సంస్థకు చిత్తూరు డెయిరీ లీజు.. మంత్రివర్గం ఆమోదం

author img

By

Published : Dec 13, 2022, 3:22 PM IST

Updated : Dec 13, 2022, 8:38 PM IST

Cabinate Meeting Decisions : రాష్ట్రంలో ఏపీ పంప్డ్‌ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2023 జనవరి నుంచి పెన్షన్​ పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణతోపాటు.. బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల్లో వైకాపా కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపులకు కేబినేట్ ఆమోదముద్ర వేసింది. ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజైన డిసెంబర్‌ 21న 5 లక్షల ట్యాబ్‌లు పంపిణీ చేసేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Cabinate Meeting Completed
ముగిసిన మంత్రివర్గ సమావేశం

Cabinate Meeting Decisions: ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీలో వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ వెల్లడించారు. . జిందాల్ స్టీల్ భాగస్వామిగా కడప స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసిందని వెల్లడించారు. రాష్ట్రంలో ఏపీ పంప్డ్‌ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీకి ఆమోదం తెలిపారు.

పెన్షన్ 2750 రూపాయలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం: 2023 జనవరి నుంచి పెన్షన్​ 2500 రూపాయల నుంచి 2750 రూపాయలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి పెంపుదల అమలు కానుందని.. 64.74 లక్షల మందికి పెన్షన్లు నెలకు 1786 కోట్లు వ్యయంతో పెన్షన్లు ఇవ్వనున్నామని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.130 కోట్లు భారం పడుతుందని మంత్రి తెలిపారు.

కడప స్టీల్ ప్లాంట్: జిందాల్ స్టీల్ ద్వారా 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భూముల రీ సర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పలనాడు, బాపట్ల అర్బన్ డెవల్మెంట్ అథారిటీ ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

మున్సిపాలిటీల చట్ట సవరణ: భూముల రీసర్వే కోసం మున్సిపాలిటీల చట్ట సవరణకు మంత్రివర్గం పచ్చజెండా ఊపిందన్నారు. బాపట్ల, పల్నాడు అర్బన్ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 1.301 చదరపు కిలీమీటర్ల విస్తీర్ణంలో 2 మున్సిపాలిటీలు, 101 గ్రామాలతో బాడా ఏర్పాటు చేయనున్నారు. అలాగే 7 వేల 281 చదరపు కిలోమీటర్ల పరిధితో పల్నాడు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ జరగనుంది. 8 మున్సిపాలిటీలు, 349 గ్రామాలతో పల్నాడు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు.

ఏపీ జ్యుడీషియల్ అకాడమీ: కొత్తగా ఏర్పాటు కానున్న ఏపీ జ్యుడీషియల్ అకాడమీలో 55 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. కొత్త జిల్లాల్లో వైకాపా కార్యాలయాల నిర్మాణానికి స్థలాల కేటాయింపునకు కేబినెట్‌ ఆమోదం లభించింది. హెల్త్ హబ్స్ ఏర్పాటుకు కొత్త విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తితిదేలో కొన్ని శాఖలకు ప్రచారం కోసం చీఫ్ పీఆర్‌వో పోస్టు భర్తీకి ఆమోదం తెలిపారు. ల్లూరు మెరిట్స్ కళాశాల లో కొన్ని పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకున్లు తెలిపారు.

2,63,000 వేల దరఖాస్తుల పునః పరిశీలన: సోషల్ ఆడిట్ చేసి సంక్షేమ పథకాలు అందని వారికి నవరత్నాలు పంచే అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ వెల్లడించారు. మొత్తం 2,63,000 వేల దరఖాస్తులు పునః పరిశీలించి ఆమోదం తెలపనున్నట్లు వివరించారు. ఉచిత పంటల భీమా - ఫసల్ భీమా పథకంలో సవరణలకు ఆమోదం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఖరీఫ్ పంటకు జూన్ 1 తేదీన నీరు విడుదల చేసిన కారణంగా తుఫాను ఇబ్బంది నుంచి తప్పించగలిగామని కేబినెట్ అభిప్రాయపడింది. ఇక నుంచి అదే తేదీలకు సాగునీరు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

పవర్ ప్రమోషన్ పాలసీ: సంప్రదాయేతర ఇంధన వనరులు భాగంగా పవర్ ప్రమోషన్ పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసిందన్నారు. ఎకరాకు 30 వేల చొప్పున లీజు, 43 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు వివరించారు. అదాని గ్రీన్, షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కు పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు లకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.

పాఠశాలో డిజిటల్ ఉపకరణాలు: పాఠశాల విద్యాశాఖ లో ఆధునిక బోధన ఉపకరణాలు డిజిటల్ బోర్డులు, ఫౌండేషన్ , ఫౌండేషన్ ప్లస్ పాఠశాలల ల్లో డిజిటల్ ఐ ఎఫ్ బి ల ఏర్పాటు కు నిర్ణయం తీసుకుంది. దీనికోసం 300 కోట్లు, స్మార్ట్ టీవిల ఏర్పాటు కోసం 50 కోట్లు వ్యయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 21 తేదీన సీఎం జగన్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని 4.6 లక్షల మంది విద్యార్థులకు శామ్సంగ్ ట్యాబ్ లు ఇస్తున్నట్లు మంత్రి చెళ్లుబోయిన వేణుగోపాల్ స్పష్టంచేశారు. 668 కోట్ల వ్యయం తో బైజుస్ కంటెంట్ తో 8 తరగతి చదివే విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ చేస్తామన్నారు.

బోధనేతర పనులకు సచివాలయాల సిబ్బంది: బోధనేతర పనులను ఉపాధ్యాయులను నిషేధిస్తూ విద్యా హక్కు నిబంధనలు సవరిస్తూ కేబినెట్ నిర్ణయించిందని ఆయన తెలిపారు. బోధనేతర పనులకు సచివాలయల సిబ్బందిని వినియోగించుకోవాలని కేబినెట్ అభిప్రాయపడిందన్నారు. పాఠశాల ప్రాంగణంలో ఉన్న మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచే బాధ్యత ఉపాధ్యాయులదేనని తేల్చిచెప్పారు. నాడు నేడు, మరుగుదొడ్లు బోధనేతర బాధ్యతల్లో కి రావన్నారు. అదీ ఉపాధ్యాయుల పనే వాళ్ళే చూసుకోవాలని మంత్రి తెలిపారు. అమర్ రాజ సంస్థ వెళ్లిపోయిందని అన్నారు ఇప్పుడు అధాని వస్తోందన్నారు.

చిత్తూరు డెయిరీ: చిత్తూరు డెయిరీ పునరుద్దరణకు కేబినెట్ నిర్ణయించిందని, అమూల్ సంస్థకు చిత్తూరు డెయిరీని 99 ఏళ్ళ లీజుకు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఏటా కోటి రూపాయలు అమూల్ ప్రభుత్వానికి చెల్లించేలా కేబినేట్ నిర్ణయించిందన్నారు. 4 లక్షల లీటర్ల పాల సేకరణకు అమూల్​కు అనుమతి ఆమోదించిందన్నారు. జ్యుడీషియల్ అకాడమీకి 55 పోస్టులు మంజూరు చేసినట్లు తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకాలు 1971 చట్ట సవరణకు కేబినేట్ ఆమోదం తెలిపినట్లు మంత్రి తెలిపారు.

సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ భేటీలో కీలక నిర్ణయాలు

ఇవీ చదవండి:

Last Updated : Dec 13, 2022, 8:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.