ETV Bharat / state

సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్ల 36 గంటల నిరసన దీక్ష- కలెక్టరేట్‌ ముట్టడికి యత్నం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 16, 2023, 7:25 AM IST

Updated : Dec 16, 2023, 10:49 AM IST

ASHA Workers Protest in AP: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆశా కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా 36 గంటల నిరసన కార్యక్రమం నిర్వహించారు. పలు చోట్ల వంటవార్పు నిర్వహించి నిరసన తెలిపారు. ఆశా కార్యకర్తలతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయిస్తోందని, విధుల నిర్వహణలో రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయని ఆరోపించారు.

ASHA_Workers_Protest_in_AP
ASHA_Workers_Protest_in_AP

సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్ల 36 గంటల నిరసన దీక్ష- కలెక్టరేట్‌ ముట్టడికి యత్నం

ASHA Workers Protest in AP : సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు 36 గంటల ధర్నా చేపట్టారు. ఆశా వర్కర్ల సమస్యలను, డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గుంటూరు కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఆశా వర్కర్లకు 26 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలి డిమాండ్ చేశారు. పపని భారం తగ్గించి, ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌ ఏదైనా ఒక విధానాన్ని మాత్రమే అప్పగించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే తమకు కూడా 62 ఏళ్లకు పదవీ విరమణ కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

YSRCP Government Cheating ASHA Workers : తమ సమస్యలను పరిష్కరించాలని ఆశా వర్కర్లు నంద్యాలలో ఆందోళన చేశారు. నంద్యాల కలెక్టరేట్ సమీపాన ప్రధాన రహదారిపై బైఠాయించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేశారు. ఎన్నికల ముందు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏమయ్యాని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని ఆశ వర్కర్లు డిమాండ్ చేశారు.

ఆల్‌ ఇన్‌ వన్‌గా వాడుకుంటూ అరకొర జీతాలు - వైసీపీ ప్రభుత్వంపై గళమెత్తిన ఆశా కార్యకర్తలు

ASHA Workers Situation in Andhra Pradesh : ఆశా వర్కర్ల సమస్యలపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్పారు. విజయవాడ అలంకార్ సెంటర్ లో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో వేలాదిమంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు, పింఛన్ 10 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ASHA Workers Problems in AP : ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆశ వర్కర్లు 36 గంటలు నిరవధిక ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు నిలువరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఆశా కార్యకర్తలకు ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించాలని కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేశారు. కొవిడ్ సమయంలో మరణించిన ఆశ వర్కర్లకు 10 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Asha Workers Protest రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్ల నిరసన.. కార్యకర్త కృపమ్మ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌

CM Jagan Cheating ASHA Workers : శ్రీకాకుళంలో ఆశా వర్కర్లు 36 గంటలు చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిబా పూలే పార్క్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం చేస్తూ రాత్రి కూడా అక్కడే బస చేశారు. ఉదయం కలెక్టరేట్ ముట్టడికి వెళ్లేందుకు ఆశాలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆశా వర్కర్లకు పోలీసులు మధ్య తోపులాట జరగడంతో వీరందరినీ అక్కడ నుంచి పోలీస్​ స్టేషన్ తరలించారు. ఆశా వర్కర్లపై ఒకటో పట్టణ పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేశారు.

సమస్యలు పరిష్కరించాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల ఆందోళన

Last Updated :Dec 16, 2023, 10:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.