ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5PM

author img

By

Published : Nov 23, 2022, 5:01 PM IST

.

TOP NEWS 5PM
TOP NEWS 5PM

  • రాష్ట్రంలో మహాయజ్ఞంగా భూరికార్డుల ప్రక్షాళన : సీఎం
    CM JAGAN TOUR IN SRIKAKULAM : రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతతో భూముల సర్వే జరుగుతోందని.. మహాయజ్ఞంగా భూరికార్డుల ప్రక్షాళన జరుగుతోందని సీఎం జగన్​ అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన శాశ్వత భూహక్కు, భూరక్ష పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన లబ్ధిదారులకు పత్రాలు అందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయ
  • ఎంపీ విజయసాయి రెడ్డి సెల్​ఫోన్ మిస్​.. ఏం జరిగింది..?
    MP Vijaya Sai Reddy Mobile Missing: వైఎస్సార్​​సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెల్​ఫోన్​ పోగొట్టుకున్నట్లు ఆయన వ్యక్తిగత సహాయకులు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విజయసాయి ఫోన్ పోయిందా? జగన్ లాక్కున్నారా?: టీడీపీ నేతలు
    TDP leaders comments on MP Vijayasai Reddy: దిల్లీ లిక్కర్​ స్కామ్​ సమాచారమంతా బయటపడుతుందనే భయంతోనే సెల్​ఫోన్​ పోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి డ్రామాలాడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. విజయసాయి ఫోన్​ పోలేదని.. పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రేపు చంద్రబాబు అధ్యక్షతన "ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ" సదస్సు: అచ్చెన్నాయుడు
    TDP STATE LEVEL CONFERENCE : ఆక్వా రైతుల సమస్యలపై రేపు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ" పేరుతో సదస్సు జరగనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగునున్నట్లు పేర్కొన్నారు. ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై సదస్సులో చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆస్తి కోసం 72 ఏళ్ల భర్తపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భార్య!
    దిల్లీలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఆస్తి కోసం ఓ వృద్ధురాలు తన భర్తను చంపడానికి ప్రయత్నించింది. ఆస్తి విషయంలో భార్యాభర్తల మధ్య వివాదం చెలరేగగా.. భర్తపై కిరోసిన్​ పోసి నిప్పంటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'అఫ్తాబ్ కొడుతున్నాడు.. చంపి ముక్కలు చేస్తానన్నాడు'.. రెండేళ్ల ముందే లేఖ రాసిన శ్రద్ధ
    దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న శ్రద్ధా వాకర్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. నిందితుడు అఫ్తాబ్‌... ఆమెను చంపేసి ముక్కలుగా నరికి దిల్లీలో విసిరిసేనట్లు విచారణలో వెల్లడైంది. తనను చంపేస్తాడని రెండేళ్ల క్రితమే శ్రద్ధ బయపడినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు మహారాష్ట్ర పోలీసులకు ఆమె రాసిన లేఖ బయటకు వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చైనా ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉద్యోగుల నిరసనలు.. పోలీసుల ఉక్కుపాదం
    చైనాలోని ఐఫోన్ ఫ్యాక్టరీ ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. నెల క్రితం వచ్చిన తమను అసలు బయటకు అనుమతించడం లేదని, పైగా చేసిన పనికి డబ్బులు కూడా చెల్లించడం లేదని ఆందోళనబాట పట్టారు. వీరిపై పోలీసులు దాడి చేస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పర్సనల్ లోన్​ తీసుకోవాలా? అయితే ఇవన్నీ తెలుసుకున్నాకే..!
    అవసరం ఏమిటన్నది అడగకుండానే క్షణాల్లో అప్పులిచ్చే సంస్థలు ఎన్నో వచ్చాయి. అత్యవసరమైనప్పుడు ఈ రుణాలు ఉపయోగమే అయినప్పటికీ పూర్తి వివరాలు తెలుసుకోకుండా తీసుకుంటే మాత్రం ఆర్థికంగా దెబ్బ తీస్తాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తూన్నారు. ఒక వేళ లోన్​ తీసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఓ సారి చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • స్టార్​ ఫుట్​బాలర్​ రొనాల్డోకు షాక్.. జట్టు నుంచి తప్పించిన యాజమాన్యం
    పోర్చుగల్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు షాక్ ఇచ్చింది మాంచెస్టర్‌ యునైటెడ్ క్లబ్​. అతడితో బంధం తెంచుకన్నట్లు ప్రకటించింది. ఫిఫా ప్రపంచకప్‌ 2022లో భాగంగా మరో రెండు రోజుల్లో రొనాల్డో తన తొలి మ్యాచ్‌ను ఆడే క్రమంలో ఇలాంటి ప్రకటన రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఎన్టీఆర్​ వల్లే అలా.. నేను చేసిన ఆ పనికి పూరి షాక్​.. ఫుడ్​ ప్లేట్​ విసిరేశారు!'
    దర్శకుడు పూరి జగన్నాథ్​తో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు క్రేజీ రైటర్​ వక్కంతం వంశీ. తాను చేసిన ఓ పనికి ఆయన షాక్ అయి భోజనం ప్లేట్​ను నెట్టేసినట్లు చెప్పారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.