విజయసాయి ఫోన్ పోయిందా? జగన్ లాక్కున్నారా?: టీడీపీ నేతలు

author img

By

Published : Nov 23, 2022, 3:56 PM IST

Former minister Jawahar, Ayyannapatra

TDP leaders comments on MP Vijayasai Reddy: దిల్లీ లిక్కర్​ స్కామ్​ సమాచారమంతా బయటపడుతుందనే భయంతోనే సెల్​ఫోన్​ పోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి డ్రామాలాడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. విజయసాయి ఫోన్​ పోలేదని.. పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.

TDP leaders comments on MP Vijayasai Reddy: ఎంపీ విజయసాయిరెడ్డి సెల్​ఫోన్​ మిస్సింగ్​పై టీడీపీ నేతలు స్పందించారు. అసలు విజయసాయిరెడ్డి ఫోన్​ పోయిందా.. లేక నాటకాలు ఆడుతున్నారా అని టీడీపీ నేతలు ఆరోపించారు. విజయసాయి ఫోన్ పోయిందా? లేక జగన్ లాక్కున్నారా? అని మాజీమంత్రి జవహర్ ప్రశ్నించారు. విజయసాయి ఫోన్ పోయిందని నాటకాలు ఆడుతున్నారన్న జవహర్.. దిల్లీ లిక్కర్ స్కామ్ సమాచారమంతా ఆ ఫోన్‌లోనే ఉందని ఆరోపించారు. జగన్ సహా అందరి వాటాల సమాచారం ఆ ఫోన్‌లోనే ఉందన్న ఆయన.. ఈడీ విచారణలో బాగోతం బయటపడుతుందని నాటకం ఆడుతున్నారని అన్నారు.

ఆయనే పడేశాడు: విజయసాయిరెడ్డి ఫోన్ పోలేదు.. ఆయనే పడేశారంటూ తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. దిల్లీ లిక్కర్ స్కాంతో తాడేపల్లి ప్యాలస్ పూసాలు కదులుతున్నాయంటూ ట్వీట్ చేశారు. ఫోన్ దాచేసి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేస్తున్నారంటూ ఆరోపించారు.

  • ఏ 2 ఫోన్ పోలేదు... పడేసాడు.
    ఢిల్లీ లిక్కర్ స్కాం తో తాడేపల్లి ప్యాలస్ పూసాలు కదులుతున్నాయి.

    — Ayyanna Patrudu (@AyyannaPatruduC) November 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

విజయసాయి ఫోన్​ మిస్​: వైఎస్సార్​​సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నట్లు.. ఆయన వ్యక్తిగత సహాయకులు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 21 నుంచి సెల్​ఫోన్​ కనిపించడం లేదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. యాపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్ 12 ప్రో సెల్​ఫోన్​ పోయిందని విజయసాయి పీఏ తమకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఫోన్​ అత్యంత విలువైన సమాచారం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.