రేపు చంద్రబాబు అధ్యక్షతన "ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ" సదస్సు: అచ్చెన్నాయుడు

author img

By

Published : Nov 23, 2022, 3:24 PM IST

Atchanna Fires On CM JAGAN

TDP STATE LEVEL CONFERENCE : ఆక్వా రైతుల సమస్యలపై రేపు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ" పేరుతో సదస్సు జరగనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం జరగునున్నట్లు పేర్కొన్నారు. ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై సదస్సులో చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

Atchanna Fires On CM JAGAN : తెలుగుదేశం హయాంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా రంగం.. నేడు జగన్‌రెడ్డి చర్యలతో పతనావస్థకు చేరిందని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సంక్షోభంలో ఉన్న ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు రేపు పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్​ భవన్​లో అధినేత చంద్రబాబు అధ్యక్షతన "ఆక్వా రైతులకు ఇదేం ఖర్మ" పేరుతో సదస్సు జరగనున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో ఆక్వా రైతులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఆక్వా రైతులు, రైతు సంఘం నాయకులు సమావేశానికి హాజరుకానున్నట్లు వెల్లడించారు.

రూ.1.50 కే విద్యుత్‌ సరఫరా చేస్తానని జగన్‌రెడ్డి హామీ ఇచ్చి ఆక్వా రైతులను వంచించారని ఆరోపించారు. ఇచ్చిన హామీ అమలు చేయకుండా విద్యుత్‌ కోతలతో ఆక్వా రంగాన్ని నిండా ముంచారని మండిపడ్డారు. ప్రభుత్వ చర్యలతో ఆక్వా రైతులకు మద్దతు ధర లభించక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక షరతులతో సబ్సిడీలు ఎత్తివేసి ఆక్వా రైతులను వేధిస్తున్నారన్నారు. ఆక్వా రైతులను నాశనం చేస్తున్న జగన్‌రెడ్డి చర్యలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.

  • ఇదేం ఖర్మ.. ఆక్వా రైతాంగానికి?
    జాతీయ పార్టీ కార్యాలయంలో గురువారం నాడు రాష్ట్రస్థాయి సదస్సు.
    #IdhemKarmaManaRashtraniki pic.twitter.com/sxtxyp1wxk

    — Kinjarapu Atchannaidu (@katchannaidu) November 23, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.