ETV Bharat / state

AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 5PM

author img

By

Published : Nov 13, 2022, 4:59 PM IST

.

AP TOP NEWS
AP TOP NEWS

  • యువతను నట్టేట ముంచిన వైకాపాను ఇక సాగనంపాలి: పవన్​
    వైకాపా ప్రభుత్వంపై పవన్​కల్యాణ్​ నిప్పులు చెరిగారు. విజయనగరం జిల్లాలోని గుంకలాంలో పర్యటించిన ఆయన.. రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేస్తుందని ఆరోపించారు. యువత తన శక్తిని అవినీతి నిర్మూలనకు వినియోగించాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Annavaram: అన్నవరంలో పోటెత్తిన భక్తులు.. తోపులాట
    సత్యదేవుని దర్శనం కోసం అన్నవరం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. రద్దీ నియంత్రణపై ఆలయ సిబ్బంది దృష్టి సారించపోవడంతో ఆలయ క్యూలైన్లలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు గంటలకొద్దీ నిరీక్షిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అమ్మో ఆ వంతెనపై ప్రయాణమా.. ప్రమాదకరమే
    ఆ వంతెనపై వెళ్లాలంటేనే వాహనదారులు భయపడే పరిస్థితి నెలకొంది. అర కిలోమీటరు దూరంలోనే మూడు ప్రమాదకర గుంతలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రెండు జాతీయ రహదారులను కలిపే నెల్లూరులోని వంతెన దుస్థితి ఇది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విషాదాన్ని మిగుల్చుతున్న బాణాసంచా తయారీ కేంద్రాలు
    పేరుకు ఉపాధి.! కానీ తేడా వస్తే ప్రాణాలే సమాధి. ఏరుకోడానికి ఎముకలు మిగలవు. మనుషుల ఆనవాళ్లూ దొరకవు. అంతటి విషాదాన్ని మిగిల్చే బాణసంచా తయారీ కేంద్రాలు పచ్చని పల్లెల్లో కుంపట్లలా మారుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి.. పరిమితికి మించి వాడుతున్న మందుగుండు సామాగ్రి భయోత్పాతం సృష్టిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • గిరిజనుడి విజయగాథ.. తినడానికి తిండి లేని స్థాయి నుంచి అమెరికాలో టాప్ సైంటిస్ట్​గా..
    కష్టపడేతత్వం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి భాస్కర్‌ హలమి జీవితం సరైన ఉదాహరణ. మహారాష్ట్ర.. గడ్చిరోలిలోని ఓ మారుమూల పల్లెలో ఒక్కపూట తినడానికి కూడా కష్టపడ్డ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు అమెరికాలో ఓ ప్రఖ్యాత సంస్థలో సీనియర్‌ సైంటిస్ట్‌ స్థాయికి చేరారు. భాస్కర్ హలమి విజయగాథ ఏంటో ఓ సారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పాత పెట్రోల్ వాహనాలను.. కొత్త ఎలక్ట్రిక్​ బైక్​గా.. ఓ వృద్ధురాలి వినూత్న ఆలోచన
    పెట్రోల్​ వాహనాలను ఎలక్ట్రిక్​ బైక్​లుగా మారుస్తారని మీకు తెలుసా? రాజస్థాన్​కు చెందిన ఓ వృద్ధురాలు ఈ వినూత్న ఆలోచనతో ఓ ఆటో మొబైల్ కంపెనీని ప్రారంభించింది. ఆ కంపెనీ గురించి తెలుసుకుందామా.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అంచనాలు తలకిందులు.. సెనేట్​పై డెమొక్రాట్ల పట్టు.. ట్రంప్​ ఆశలపై నీళ్లు!
    ఎగ్జిట్‌పోల్‌ అంచనాలను తలకిందులు చేస్తూ సంప్రదాయంగా వస్తున్న ఫలితాలను బద్దలు కొడుతూ.. సెనేట్‌పై అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్‌ పట్టు నిలుపుకున్నారు. రిపబ్లికన్‌ పార్టీ ఆశలపై నీళ్లు చల్లుతూ, మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టాలన్న డొనాల్డ్ ట్రంప్‌ ఆకాంక్షను పటాపంచలు చేస్తూ అమెరికా అధికార పార్టీ సత్తా చాటింది. సెనేట్‌లో అవసరమైన 50 సీట్లను గెలుచుకున్న డెమొక్రాట్లు.. తమ కార్యవర్గ అజెండా అమలుకు సిద్ధం అవుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • వడ్డీ రేట్లు పెరిగాయని పాత FDలు రద్దు చేస్తే లాభమా, నష్టమా?
    ఒకప్పటి వరకు తక్కువగా ఉన్న ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. గతంలో తమ సొమ్మును తక్కువ వడ్డీకి జమ చేసిన వారు.. తమ పాత డిపాజిట్లను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. ఇలా చేయడం వల్ల ఎంత వరకు ఫలితాలను ఇస్తుందో ఓ సారి తెలుసుకుందాం.పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సానియా-షోయబ్ విడాకులు నిజమేనా? లేక రియాలిటీ షో కోసం జిమ్మిక్కులా?
    భారత స్టార్​ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, పాకిస్థాన్​ క్రికెటర్​ షోయమ్​ మాలిక్​.. విడాకుల విషయం ప్రస్తుతం నెట్టింట్లో హాట్​ టాపిక్​గా మారింది. తాజాగా సానియా, షోయబ్​లు​ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు. అదేంటంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ బంధాల కంటే ఒంటరిగా ఉండడమే హ్యాపీ అంటున్న సదా
    జయం సినిమాతో నటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు సదా. దొంగా దొంగది, అవునన్నా కాదన్నా, అపరిచితుడు లాంటి చిత్రాల ద్వారా తెలుగువారికి మరింత చేరువయ్యారు. అయితే తాజాగా ఆమె పెట్టిన ఓ ఇన్​స్టా పోస్ట్​ వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.