ETV Bharat / state

ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. అన్నవరం క్యూలైన్లలో తోపులాట

author img

By

Published : Nov 13, 2022, 4:23 PM IST

Updated : Nov 13, 2022, 9:19 PM IST

Devotees flock in AP temples: రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్నీ భక్తులతో కిక్కిరిసాయి. కార్తికమాసం.. అందులోనూ సెలవురోజు కావడంతో.. భారీ స్థాయిలో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వన భోజనాలకు వెళ్లేవారితో పాటు.. భక్తులు కూడా రావడంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. అన్నవరంలో ఆలయ అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో... భక్తులు నానాఅవస్థలు పడ్డారు.

heavy rush in  AP temples
heavy rush in AP temples

Devotees flock in AP temples: రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాల్నీ భక్తులతో కిక్కిరిసాయి. కార్తీకమాసం.. అందులోనూ సెలవురోజు కావడంతో.. భారీ స్థాయిలో ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వన భోజనాలకు వెళ్లేవారితో పాటు.. భక్తులు కూడా రావడంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. అన్నవరంలో ఆలయ అధికారులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో... భక్తులు నానాఅవస్థలు పడ్డారు.

సింహాద్రి అప్పన్న సన్నిధి: విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధికి భక్తుల తాకిడి పెరిగింది. కార్తీకమాసం దాకితోడు సెలవు రోజు ఆదివారం కావడంతో స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భారీ స్థాయిలో రద్దీ పెరగడంతో... స్వామి వారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. కొండ దిగువన భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కనీస సౌకర్యాలూ ఏర్పాటు చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నవరం: అన్నవరం సత్యదేవుని దర్శనం కోసం ఆలయం క్యూలైన్లలో గంటలకొద్దీ భక్తులు నిరీక్షిస్తున్నారు. క్యూలైన్లలో చిన్నపిల్లలతో తల్లులు ఇబ్బందిపడుతున్నారు. భారీగా తరలిరావడంతో ఆలయం క్యూలైన్లలోని తూర్పు రాజగోపురం వద్ద తొక్కిసలాట పరిస్థితి నెలకొంది. భక్తుల మధ్య తోపులాట జరిగింది. కొండపై పార్కింగ్​లో వందలాది వాహనాలు బారులు తీరాయి. రద్దీ నియంత్రణపై ఆలయ సిబ్బంది సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో... భక్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి: శ్రీశైల మహా క్షేత్రం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. కార్తికమాస ఉత్సవాలను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు . తెల్లవారుజాము నుంచే భక్తులు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీతో... వసతి సముదాయాలన్నీ నిండిపోయాయి. సోమవారం వరకు భక్తుల రద్దీ కొనసాగనుంది.

అరసవల్లి సూర్యనారాయణ: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయానికి భక్తులు పోట్తెతారు. కార్తీక మాసం సందర్భంగా... వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి రావడంతో.. క్యూలైన్ అన్ని కిటకిటలాడాయి. ఇంద్రపుష్కరిణి ప్రాంతమంతా కార్తీక దీపారాధనలతో కళకళలాడింది.

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి: కృష్ణా జిల్లా మోపిదేవిలోని స్వయంభువుగా వెలసిన శ్రీవల్లీ, దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనానికి... వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 6 గంటల నుంచే క్యులైన్లలో రద్దీ పెరిగింది. కనీస సౌకర్యాలూ ఏర్పాటు చేయకపోవడంతో.. భక్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

భక్తులతో కిక్కిరిసిన ప్రముఖ పుణ్యక్షేత్రాలు

ఇవీ చదవండి:

Last Updated :Nov 13, 2022, 9:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.