ETV Bharat / state

Agitations on CBN Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కొనసాగుతున్న నిరసనలు.. విదేశాల్లో సైతం ఆందోళనలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 7, 2023, 8:05 AM IST

Agitations on CBN Arrest: చంద్రబాబును విడుదల చేయాలని కోరుతూ టీడీపీ శ్రేణుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఇతర దేశాల్లో టీడీపీ అభిమానులు చంద్రబాబు అరెస్టుకు నిరసన తెలుపుతూనే ఉన్నారు. చంద్రబాబుకు మద్దతుగా దీక్షలు, పూజలు కొవ్వొత్తుల ర్యాలీలు, వినూత్న నిరసనల ద్వారా తమ నిరనస గళాన్ని వినిపిస్తున్నారు.

Agitations_on_CBN_Arrest
Agitations_on_CBN_Arrest

Agitations on CBN Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కొనసాగుతున్న నిరసనలు.. ఇతర దేశాల్లో సైతం ఆందోళనలు

Agitations on CBN Arrest: తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని ఆ పార్టీ నేతలు ధ్వజమెత్తారు. యువత భవితకు భరోసానిచ్చిన నైపుణ్యాభివృద్ధి సంస్థలో అక్రమాలు జరిగాయంటూ అరెస్టు చేయడం సరికాదని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ శ్రేణులు వివిధ రూపాల్లో నిరసనలను కొనసాగించాయి.

చంద్రబాబును విడుదల చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని టీఎన్​ఎస్​ఎఫ్​ నేతలు స్పష్టం చేశారు. అనంతపురంలో చేపట్టిన దీక్షలో పెద్దఎత్తున టీఎన్​ఎస్​ఎఫ్​ కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలో తెలుగుదేశం కార్యకర్తలు జలదీక్ష చేపట్టారు. అనంతరం మారెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి 101 టెంకాయలు కొట్టారు. గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.

జగన్​ సమాధానం చెప్పు.. నీకో రూలు.. నాకో రూలా..?: చంద్రబాబు

కర్నూలు జిల్లా మంత్రాలయంలో దీక్షా శిబిరానికి బసవన్నను తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేశారు. నంద్యాలలో దీక్షా శిబిరాన్ని యాదవ సంఘ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. చిత్తూరు జిల్లా నుంచి వెళ్లి రష్యాలో స్థిరపడిన తెలుగు ప్రజలు చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. పీటర్స్‌బర్గ్‌లో నిరసన తెలిపారు.

కృష్ణా జిల్లా అవనిగడ్డలో గత 24 రోజులుగా కొనసాగుతున్న దీక్షల్లో టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు. మోపిదేవి మండలానికి చెందిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా నాగాయలంకలో సంతకాల సేకరణ చేపట్టారు. 2024లో నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని టీడీపీ శ్రేణులు ఆకాంక్షించారు. ఆయనపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్​ చేశారు.

TDP Agitations Continues Against Chandrababu Arrest: వైసీపీ సర్కారుపై ఆగ్రహ జ్వాలలు.. చంద్రబాబుకు మద్దతుగా ముప్పేట ఆందోళనలు

అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ట్రంక్‌ పెట్టెను ఏర్పాటు చేసి దాని నుంచి కాగితాలు తీస్తూ.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా సాధించిన అభివృద్ధిని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వివరించారు. వైసీపీ చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని కక్షపూరితంగానే చంద్రబాబును అరెస్టు చేశారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మండపేటలోని మున్సిపల్​ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరహారదీక్ష శిబిరంలో.. రాయవరం మండలం టీడీపీ నాయకులు పాల్గొన్నారు. టీడీపీ నాయకుడు దేవు వెంకటరాజు.. అరగుండు గీయించుకుని నిరసన తెలిపారు.

అనకాపల్లిలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ.. బాబుతో నేను కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానికంగా మహిళలు తెలుగు దేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సైకో పోవాలి.. సైకిల్‌ రావాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేకాకుండా బాబుతోనే మేమంతా అంటూ వీధులన్ని మార్మోగించారు.

Amaravathi Farmers Meet Lokesh Bhuvaneswari: వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ది చెప్తాం.. నారా భువనేశ్వరి, లోకేశ్‌లతో అమరావతి రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.